
అండర్-19 ప్రపంచకప్ జట్టులో వైభవ్ కనిపించడు..నిజమేనా?
15 ఏళ్లు నిండాక అంతర్జాతీయ క్రికెట్ లోకి రాక, కానీ అండర్ 19 జట్టుకి కొత్త నిబంధనల అమలు చేస్తున్న బీసీసీఐ
భారత్ మరోసారి అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ గెలిచింది. కానీ ఇప్పుడు చర్చ మొత్తం ఫైనల్లో ఇంగ్లాండ్ పై చిచ్చర పిడుగల్లే చెలరేగి సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ మీదే జరుగుతోంది.
కేవలం 80 బంతుల్లో 175 పరుగులు, 200 కు పైగా స్ట్రైక్ రేట్ తో నిర్థాక్షిణ్యంగా విరుచుపడటం చూసి అవాక్కయింది. ఫైనల్ ఒత్తిడిని చిత్తూ చేస్తూ ఆడటం చూసి క్రికెట్ ప్రపంచం లేచి గంతెసింది.
ఐపీఎల్ లోనూ రెండో అత్యుత్తమ వేగవంతమైన సెంచరీ సాధించేశాడు. అయితే ఇప్పటి వరకు భారత సీనియర్ జట్టులో మాత్రం అతను చోటు లభించట్లేదని అనుమానాలు వస్తున్నాయి. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఐసీసీ నిబంధనల్లోనే ఉంది.
రికార్డులు దాసోహం
వైభవ్ క్రికెట్ ప్రపంచాన్ని ఎందుకు ఇంతలా ఆకర్షించాడో అర్థం చేసుకోవడానికి, గత సంవత్సరంలో అతను బద్దలు కొట్టిన రికార్డులను చూస్తే తెలుస్తుంది. U19 ప్రపంచ కప్ ఫైనల్‌లో, అతను 80 బంతుల్లో 175 పరుగులు చేశాడు, ఇది ఫైనల్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోరు. అతను టోర్నమెంట్‌లో 30 సిక్సర్లు బాది కొత్త రికార్డును సృష్టించాడు. ఇంతకుముందు అత్యధిక సిక్స్ లు బాదిన రికార్డు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ డెవాల్డ్ బ్రెవిస్ పేరు మీద ఉండేది. ఇప్పుడిది కనుమరుగు అయింది.
కేవలం 14 సంవత్సరాల 272 రోజుల్లోనే, లిస్ట్-ఎ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్రలో నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో, అతను కేవలం 59 బంతుల్లోనే 150 పరుగులు సాధించి, ఎబి డివిలియర్స్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఐపిఎల్‌లో, రాజస్థాన్ రాయల్స్ తరపున 35 బంతుల్లోనే సెంచరీ సాధించి, అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.
యుఎఇపై 32 బంతుల్లోనే సెంచరీ సాధించి, ఇండియా ఎ తరపున టి20 సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కూడా నిలిచాడు. యూత్ వన్డేల్లో, ఇంగ్లాండ్‌పై 52 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించగా, యూత్ టెస్టుల్లో, 58 బంతుల్లోనే భారతదేశం తరపున అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించాడు, ఇది ప్రపంచంలోనే రెండవ వేగవంతమైన సెంచరీ.
సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అజేయంగా 108 పరుగులు చేసి, యూత్ వన్డేల్లో 100 కెరీర్ సిక్సర్లను బాదాడు, ఇది చరిత్రలో మొదటిది. "సూర్యవంశీ తుఫాను" ఇప్పటివరకు దేశీయ, ఫ్రాంచైజీ క్రికెట్‌కే పరిమితం అయినప్పటికీ, మరికొద్ది రోజుల్లోనే మనం అంతర్జాతీయ క్రికెట్ లో అతన్ని చూసే అవకాశం ఉంది.

