ఆ ఆటగాడి ఫామ్ పై ఎలాంటి ఆందోళన అవసరం లేదు: గౌతం గంభీర్
x

ఆ ఆటగాడి ఫామ్ పై ఎలాంటి ఆందోళన అవసరం లేదు: గౌతం గంభీర్

టీమిండియా మాజీ కెప్టెన్ ఫామ్ పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, వచ్చే సిరీస్ లో కచ్చితంగా పరుగులు సాధిస్తాడని కోచ్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించారు. తన పని ఆటగాళ్లకు..


భారత్ స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి ఇటీవల ఫామ్ పై ఎలాంటి సమస్య లేదని, ఎలాంటి ఆందోళన చెందట్లేదని టీమిండియా కోచ్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించారు. తాను(విరాట్) అరంగ్రేటం చేస్తున్నప్పుడు ఎలాంటి పరుగుల ఆకలితో ఉన్నాడో .. ఇప్పుడు అలాగే ఉన్నాడని, ప్రతీ మ్యాచ్ పూర్తయ్యాక తీర్పు ఇవ్వకూడదని అన్నారు.

కోహ్లి తన చివరి ఎనిమిది ఇన్నింగ్స్‌లలో ఒక్క సెంచరీ సాధించలేదు. అత్యధిక స్కోరు కేవలం 76 పరుగులు మాత్రమే. అది కూడా గత ఏడాది చివర డిసెంబర్ లో దక్షిణాఫ్రికాపై సెంచూరియన్ టెస్టులో సాధించాడు. ఈ నెలలోనే భారత్, న్యూజిలాండ్ తో మూడు టెస్ట్ ల సిరీస్ ను ఆడబోతోంది.
కోహ్లి తన ఫామ్ ను తిరిగి పొందడానికి ఇదే మంచి అవకాశం అని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు. వచ్చే నెలలో భారత్, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో భాగంగా కంగారులతో ఐదు టెస్ట్ మ్యాచ్ లను ఆడబోతోంది. ఈ సందర్భంగా కోచ్ గంభీర్ విలేకరులతో మాట్లాడాడు. కోహ్లి ఫామ్ పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, త్వరలోనే రాణిస్తాడని గంభీర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.
"చూడండి, విరాట్ గురించి నా ఆలోచనలు ఎప్పుడూ చాలా స్పష్టంగా ఉన్నాయి, అతను ప్రపంచ స్థాయి క్రికెటర్. అతను చాలా కాలం పాటు అసాధారణ ప్రదర్శన ఇచ్చాడు. అతను అరంగేట్రం చేసినప్పుడు ఉన్న పరుగుల దాహం, ఇప్పటికి అలాగే ఉంది' అని గంభీర్ అన్నారు.
"ఆ ఆకలి అతన్ని ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా చేసింది. అతను ఈ సిరీస్‌లో పరుగులు సాధించాలనే ఆకలితో ఉంటాడని, బహుశా ఆస్ట్రేలియాలో కూడా ముందుకు వెళతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను," అన్నారాయన. కేవలం ఒక సిరీస్ లేదా ఒక సంవత్సరం ఆట ఆధారంగా ఆటగాళ్లని ఫామ్ ను అంచనా వేయకూడదని పేర్కొన్నారు.
ఇదో క్రీడ .. ప్రతి ఆటగాడికి అప్ అండ్ డౌన్ ఉంటాయి. మ్యాచ్ పరిస్థితులు.. ఆడిన ప్రదేశాలు కూడా లెక్కలోని తీసుకోవాల్సి ఉంటుందని మాజీ కెప్టెన్ నూ పూర్తిగా వెనకేసుకు వచ్చాడు. మాకు జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఆటల్లో గెలవడం కోసం శ్రమిస్తాం అని గంభీర్ అన్నాడు. తన ముఖ్య లక్ష్యం ఆటగాళ్లకు మద్ధతు ఇవ్వడం, విజయం కోసం సిద్ధం చేయడమని అన్నారు.
"ప్రతిఒక్కరికీ ప్రతిరోజూ మంచి రోజులు ఉండవు. మనం మన ఆటగాళ్లకు మద్దతునిస్తూ ఉంటాము. నా పని ఆటగాళ్లకు మద్దతునివ్వడం. అత్యుత్తమంగా ఆడుతున్న 11 మందిని ఎన్నుకోవడం, ఎవరినీ వదులుకోవడం కాదు’’ అని గంభీర్ తేల్చి చెప్పారు.
"అందరూ ఆకలితో ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వరుసగా ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లు ఉన్నాయని వారికి తెలుసు. కాబట్టి, వారు వరుసగా మంచి ప్రదర్శన చేయడం బహుశా ఇది ప్రారంభం కావచ్చు" అని గంభీర్ అన్నాడు.
Read More
Next Story