ఆ ఆటగాడు రాకపోవడం మాకు సంతోషానిచ్చింది : హాజిల్ వుడ్
గత రెండు పర్యాయాలు తమ దేశ బౌలర్ల సహనాన్ని ఆ బ్యాట్స్ మెన్ పరీక్షించేవాడని, ఇప్పుడు ఆ ఆటగాడు రాకపోవడం మాకు సంతోషానిచ్చిందని అన్నారు.
వచ్చే శుక్రవారం భారత్ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ ప్రారంభం పై ఆసీస్ బౌలర్ హాజిల్ వుడ్ స్పందించారు. తాము ఈ సారి చెతేశ్వర్ పుజారాకు బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
పుజారా సిరీస్ కు రాకపోవడం పై తాము సంతోషంగా ఉన్నామని మొహమాటంలేకుండా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆసీస్ వేదికగా గత బీజీటీ సిరీస్ లో పుజారా, రహానే పాల్గొన్నారు. రెండో టెస్ట్ లో రహనే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి జట్టను విజయపథంలో నడిపించాడు. కంగారు బౌలర్లకు పుజారా తన దుర్బేద్యమైన ఢిపెన్స్ తో వికెట్లకు అడ్డుగోడగా నిలిచాడు. ఓవర్లకు ఓవర్లు కరిగిస్తూ ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించేవాడు.
పుజారా 2018-19 సిరీస్‌లో 1258 బంతుల్లో 521 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. మూడేళ్ల తర్వాత 928 బంతుల్లో 271 పరుగులు సాధించి మరోసారి భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు.
"పూజ్ (పుజారా) ఇక్కడ లేనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అతను స్పష్టంగా టైమ్ బ్యాటింగ్ చేసేవాడు, ప్రతిసారీ అతని వికెట్ సంపాదించేలా చేస్తాడు, తన పర్యటనలన్నింటిలో ఆస్ట్రేలియాలో చాలా బాగా రాణించాడు" అని హాజిల్‌వుడ్ విలేఖరులతో చెప్పారు. మా ఓపికను ఓపికగా పరీక్షించేవాడని నవ్వుతూ వ్యాఖ్యానించాడు.
పుజారా లేనప్పటికీ, భారత జట్టులో తగినంత ప్రతిభ ఉందని జోష్ పేర్కొన్నారు. జట్టులో ప్రతిభకు కొదువ లేదు. కుర్రాళ్లు వస్తూనే ఉన్నారు. మంచి ప్రదర్శన ఇవ్వడానికి ఉత్సాహంగా చూస్తున్నారని చెప్పారు
పంత్ ఓ చిచ్చరపిడుగు..
పుజారాతో పాటు రిషబ్ పంత్ మునుపటి సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా బ్రిస్బెన్ టెస్ట్ లో ఆసీస్ విధించిన 329 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అద్భుతమైన నాక్ ఆడాడు. 89 పరుగులతో అజేయంగా నిలిచాడు.
పంత్ ను కట్టడి చేయడానికి తగిన వ్యూహాలు ఉన్నాయని జోష్ చెప్పారు. మాకు ప్లాన్ బీ, సీ లాంటి వి ఉన్నాయి. అలాగే మా జట్టులో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ లాంటి దూకుడైన ఆటగాళ్లు ఉన్నారని అన్నారు. ప్రస్తుత జట్టులో గిల్, షమీ లేకపోవడం కూడా జట్టుకు నష్టమేననీ హజిల్ ఉడ్ చెప్పారు.
Next Story