వెల్లింగ్టన్ టెస్ట్: పోరాడిన భారత్ కు దక్కని విజయం
x

వెల్లింగ్టన్ టెస్ట్: పోరాడిన భారత్ కు దక్కని విజయం

విజయానికి అడ్డు గోడలా నిలిచిన మిచెల్, గ్లెన్ ఫిలిప్స్


Click the Play button to hear this message in audio format

వెల్లింగ్టన్ టెస్ట్ లో భారత్ పోరాడినప్పటికీ ‘డ్రా’ మాత్రమే దక్కింది. పూర్తిగా నిర్జీవమైన పిచ్ నుంచి భారత బౌలర్లకు ఎలాంటి సహకారం దక్కలేదు. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ పట్టుదలగా భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. దాదాపు 40 ఓవర్ల పాటు డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ పట్టుదలతో క్రీజులో నిలబడ్డారు.

119 పరుగులకు రెండు వికెట్లతో ఐదో రోజును ప్రారంభించిన న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 239 పరుగులు సాధించింది. పిచ్ నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.
ఈ డ్రా తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించే భారత్ అవకాశాలు దెబ్బతిన్నాయి. భారత్ పాయింట్లు 51.52 శాతం నుంచి 50 శాతానికి పడిపోయింది. భారత్ ఈ జాబితాలో నాలుగు స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ కూడా ఈ డ్రాతో 66.67 పాయింట్లతో రెండో స్థానం నుంచి మూడో స్థానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా 75 శాతం పాయింట్లతో డబ్ల్యూటీసీ పట్టికలో మొదటి స్థానంలో ఉండగా, 69. 23 శాతంతో ఆసీస్ రెండో స్థానంలో ఉంది.

వాతావరణం మారినా.. పిచ్ మాత్రం...

వెల్లింగ్టన్ అంటనే విపరీతంగా పైర గాలులకు పెట్టింది పేరు. అయితే అనూహ్య వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గత నాలుగు రోజులుగా ఇక్కడ విపరీతంగా ఎండకాస్తోంది. కానీ చివరి రోజు మాత్రం మంచి గాలి, మబ్బులు పట్టిన పిచ్ పరిస్థితి మాత్రం మారలేదు. భారత బౌలర్లు దాదాపు యాభై ఓవర్లు బౌలింగ్ చేసినా కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. డారెల్ మిచెల్ 187 బంతుల్లో 49 నాటౌట్, ఫిలిప్స్ 126 బంతుల్లో 26 నాటౌట్ భారత్ బౌలర్లకు సహనానికి పరీక్ష పెట్టారు.
న్యూజిలాండ్ బౌలర్లు 120 ఓవర్లు పాటు క్రీజులో ఉన్నారు. ఆరంభంలో డెవాన్ కాన్వేను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ పంపాడు. అప్పటికే రచిన్ రవీంద్ర 129 బంతుల్లో 37, కాన్వే 165 బంతుల్లో 65 క్రీజులో పాతుకు పోయారు.
మొదటి ఇన్నింగ్స్ లో ప్రభావం చూపని ప్రసిద్ధ్ కృష్ణ రెండో ఇన్నింగ్స్ లో కాస్త పర్వాలేదనిపించాడు. అయితే బూమ్రా, ఆకాశ్ దీప్ మాత్రమే చాలా ప్రభావవంతంగా బౌలింగ్ చేశారు. ఇప్పటికే సిరాజ్ కు జట్టులో చోటు ఎందుకు ఇవ్వలేదనే అంశంపై దేశంలో దుమారం రేగుతోంది. మరో మూడు రోజుల్లో రెండో టెస్ట్ ప్రారంభమవుతోంది. అందులో నైనా హైదరాబాద్ పేసర్ కు చోటు దక్కుతుందో లేదో చూడాలి


Read More
Next Story