స్పిన్ పోరులో గెలిచేదెవరూ?
x

స్పిన్ పోరులో గెలిచేదెవరూ?

దుబాయ్ వేదికగా భారత్ తో తలపడనున్న న్యూజిలాండ్


ఐసీసీ ఛాంపియన్ ట్రోఫి చివరి అంకానికి చేరుకుంది. రేపు దుబాయ్ వేదికగా భారత్, కివీస్ తో తలపడుతోంది. భారత్ 12 సంవత్సరాల క్రితం ఇంగ్లండ్ వేదిక జరిగిన మ్యాచ్ లో హోస్ట్ నేషన్ ను ఓడించింది.

తరువాత అదే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్ ట్రోఫిలో భారత్ ఫైనల్ కు చేరినప్పటికీ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ వేదికగా ట్రోఫి జరుగుతున్నప్పటికీ భారత్ ఆడే మ్యాచులన్నీ కూడా దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నారు. భద్రతా కారణాల వల్ల పాక్ వెళ్లడానికి నిరాకరించింది.

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు దాదాపు ఇదే చివరి ఐసీసీ ట్రోఫి అని ఊహగానాలు ఉన్నాయి. అయితే ఐసీసీ ఈవెంట్లలో ఆసియా జట్లపై కివీస్ 10-6 ఆధిక్యంలో ఉంది.
అలాగే భారత్ పైగా కూడా 3-1 తో ఆధిక్యంలో ఉంది. ఇది టీమిండియాను కలవరపెట్టే అంశంగా ఉంది. అయితే దుబాయ్ లో ఎక్కువ మ్యాచులు ఆడటం వల్ల బ్లూజెర్సీకి అదనపు లాభం వస్తుందని ఇతర జట్లు విమర్శలు చేస్తున్నాయి. అయితే స్పిన్ విభాగంలో ఇరుజట్లు బలంగానే ఉన్నాయి.
లీగ్ మ్యాచులో ఇప్పటికే ఇరుజట్లు తలపడ్దాయి. అందులో భారత్ చాలా కంఫర్ట్ గా విజయం సాధించింది. అయితే న్యూజిలాండ్ ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఓపెనర్ రచిన్ రవీంద్ర, కేన్ మామ, గ్లెన్ ఫిలిప్స్ మంచి ఫామ్ లో ఉన్నారు.
లీగ్ మ్యాచ్ లో లాగానే ఇక్కడ కూడా భారత్ నలుగురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగబోతోంది. హర్డిక్ పాండ్యా తన పూర్తి కోటా వేస్తుండటంతో భారత్ కు ఇబ్బంది ఉండటం లేదు.
జట్టులో ముగ్గురు స్పిన్నర్లు లెప్ట్ హ్యండ్లర్లూ ఉన్నారు. అయితే జడేజా, అక్షర్ పటేల్ సాంప్రదాయ ఫింగర్ స్పిన్నర్లు కాగా, కుల్దీప్ యాదవ్ చైనామెన్ బౌలర్, అయితే భారత జట్టు తురుఫు ముక్కగా వరుణ్ చక్రవర్తిని మరోసారి ప్రయోగించే అవకాశం కనిపిస్తోంది.
రెండు దశాబ్దాల క్రితం..
ఐసీసీ ఈవెంట్స్ లో న్యూజిలాండ్ కు చాలాసార్లు చేదు అనుభవాలు ఉన్నాయి. అయితే ఆ జట్టు రెండు సార్లు గెలిచిన ఐసీసీ టైటిల్స్ భారత్ ను ఓడించే సాధించింది.
ముఖ్యంగా 2000 లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫిని న్యూజిలాండ్ ఎగరేసుకుపోయింది. క్రిస్ క్రెయిన్స్ మెరుపు బ్యాటింగ్ చేయడంతో ఇండియాకు ఓటమి ఎదురైంది. తరువాత 2021 లో జరిగిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ లోనూ కూడా టీమిండియాను ఓటమికి రుచిచూపించింది.
భారత బ్యాటింగ్..
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫిలో విరాట్, శ్రేయస్, పటేల్, హర్డిక్ పాండ్యా, రాహుల్ బ్యాటింగ్ లో రాణిస్తున్నారు. కానీ ఓపెనర్లు శుభ్ మన్ గిల్, రోహిత్ మాత్రం భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డారు.
వీరి వైఫల్యం మిడిల్ ఆర్డర్ పై భారాన్ని మోపింది. కోహ్లి ఐదు ఇన్నింగ్స్ లో ఓ సెంచరీ, రెండు అర్థ సెంచరీలు సాధించారు. సెమీ ఫైనల్ లో ఆసీస్ తో ఆడినట్లు ఆడితే మరోసారి ఐసీసీ కప్ మనదే.
Read More
Next Story