‘‘టెస్ట్ క్రికెట్ నుంచి నేను ఎందుకు రిటైర్ అయ్యానంటే’’
x
విరాట్ కోహ్లీ

‘‘టెస్ట్ క్రికెట్ నుంచి నేను ఎందుకు రిటైర్ అయ్యానంటే’’

సరదాగా సమాధానం ఇచ్చిన కింగ్ కోహ్లీ


టెస్ట్ క్రికెట్ నుంచి హాఠాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యారో కింగ్ కోహ్లి సరదా మాటల్లో చెప్పారు. లండన్ లో డాషింగ్ లెప్ట్ హ్యాండర్ యువరాజ్ సింగ్ చేస్తున్న క్యాన్సర్ నిధుల సేకరణ కార్యక్రమానికి హాజరైన కింగ్.. ఈ సందర్బంగా ప్రజెంటర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

‘‘ఫీల్డ్ మ్యాన్ గా మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాము’’ అని ప్రెజెంటర్ గౌరవ్ కపూర్ అన్నారు. ఈ ప్రశ్నకు ఒక్క క్షణం ఆగి కోహ్లీ సమాధానమిచ్చారు.
‘‘నేను రెండు రోజుల క్రితం నా గడ్డానికి రంగు వేసుకున్నాను. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి మీరు మీ గడ్డానికి రంగు వేసుకునే సమయం ఆసన్నమైందని మీకు తెలుసు. ఇది విశ్రాంతి సమయం’’ అని కింగ్ అన్నారు.
ఈ సమాధానం చెపుతున్న సమయంలో కోహ్లీ పక్కన రవిశాస్త్రి, క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్, యువరాజ్ సింగ్ ఉన్నారు. ఈ కార్యక్రమం కంటే ముందు కోహ్లి వింబుల్డన్ లో కనిపించాడు. తరువాత క్యాన్సర్ నిధుల కోసం ప్రారంభించిన ‘యూ వీ కెన్’ లో మెరిశాడు.
రవిశాస్త్రితో సంబంధం..
కోహ్లీ కాలంలో టెస్ట్ జట్టును కొత్త శిఖరాలకు తీసుకెళ్లినప్పుడూ ప్రధాన కోచ్ గా ఉన్న శాస్త్రితో తనకున్న బంధం గురించి ఆయన మాట్లాడారు.
‘‘నిజాయితీగా చెప్పాలంటే నేను అతనితో కలిసి పనిచేయకపోతే.. టెస్ట్ క్రికెట్ లో ఏమి జరిగిందో అది జరగకపోయి ఉండేది. ప్రతి క్రికెటర్ తన కెరీర్ లో ఎదగడానికి ఇది అవసరం’’ తన కెరీర్ లో రవిశాస్త్రి మద్దతు తనకు లభించిందని అన్నారు. నా క్రికెట్ ప్రయాణంలో అతని పాత్ర చాలా గొప్పగా ఉండటం పట్ల నాకు ఎల్లప్పుడూ గౌరవం ఉందని కింగ్ అన్నారు.
గత ఏళ్లలో కోహ్లీ అత్యంత ప్రభావవంతమైన క్రికెటర్ అని శాస్త్రి ప్రశంసలకు ప్రతిస్పందించాడు. ‘‘మీరు ప్రపంచకప్ లు ఇతర విషయాలను గెలుస్తారు కానీ ఎర్రబంతి క్రికెట్(టెస్ట్ క్రికెట్) ను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకున్నాడు. తరువాత చాలా మంది క్రికెటర్లు ఇది అనుసరించారు’’ అని శాస్త్రి అన్నారు.
‘‘నేడు భారత్ టెస్ట్ క్రికెట్ లో ఒక స్థాయిని ఆడుతోందంటే.. అతని నాయకత్వంలో ఆడిన యువతరం క్రికెటర్లు ఇందుకు కృతజ్ఞతలు చెప్పాలి’’ అన్నారు. ప్రపంచ క్రికెట్ కూడా ఇందుకు థ్యాంక్స్ చెప్పాలన్నారు. భారత్ టెస్ట్ క్రికెట్ లో బాగా ఆడటంతో డబ్బులు వచ్చాయి. బీసీసీఐకి కూడా అది బాగా కలిసోచ్చిందన్నారు.
‘‘వారు తక్కువ తీసుకుంటున్నారు. ఎక్కువ తీసుకోవాలి. కానీ అతను గత దశాబ్ధంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి’’ అని భారత మాజీ కోచ్ , కోహ్లీని కొనియాడారు.
Read More
Next Story