అశ్విన్, జడేజా లను ఎందుకు తీసుకోలేదంటే? రోహిత్ వివరణ
ఆసీస్ తో పెర్త్ లో జరిగిన తొలి టెస్ట్ లో సీనియర్ స్పిన్నర్లు ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజాలను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై కెప్టెన్ రోహిత్ శర్మ వివరించారు.
ఆస్ట్రేలియాతో పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో తుది జట్టు నుంచి సీనియర్ ఆటగాళ్లు అశ్విన్, జడేజాలను తప్పించడాన్ని భారత కెప్టెన్ రోహిత్ శర్మ సమర్థించాడు. ఇది సరైన నిర్ణయమే అని, అయితే వారి అనుభవం తమకు మున్ముందు జట్టుకు ఉపయోగపడుతుందని హిట్ మ్యాన్ అన్నారు. తొలి టెస్టు లో అశ్విన్, జడేజాలను తప్పించి నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాలు అరంగ్రేటం చేశారు. అంతకుముందు న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో 0-3 తో టీమిండియా ఓటమి పాలైంది.
కానీ ఆసీస్ తో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నిర్ణయం జట్టుకు గొప్ప బూస్టు ఇచ్చింది. అడిలైడ్ లో రెండో టెస్టు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన రోహిత్.. "దురదృష్టవశాత్తూ, వారు మొదటి మ్యాచ్ ఆడటం లేదని ఈ వార్తను వారికి తెలియజేయడానికి నేను అక్కడ లేను.
జడేజా, అశ్విన్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లను వదిలివేయడం (అవుట్) చేయడం ఎల్లప్పుడూ కష్టమే. ఇది ఎప్పుడూ సులభం కాదు." "కానీ నిర్ణయం తీసుకున్నాం. జట్టు మేనేజ్ మెంట్ ఆ సమయానికి ఏది సరైందో అదే తీసుకున్నారు.. అశ్విన్, జడేజా ఇద్దరికి 855 వికెట్లు ఉన్నాయి. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మూడో ఫైనల్ ఆడటానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అని రోహిత్ అన్నారు.
కొద్ది రోజులుగా భారత జట్టు సాధిస్తున్న విజయాలల్లో యువ క్రీడాకారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. వాషింగ్టన్ సుందర్ కు అన్ని పరిస్థితుల్లో ఆడే సత్తా ఉందని, అందుకే అశ్విన్ స్థానంలో జట్టులోకి తీసుకున్నామని ఓ ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.
పెర్త్ లో అరంగ్రేటం చేసిన నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాలు మైదానంలో వారి ప్రతిభతో ఆకట్టుకున్నారని భారత్ కెప్టెన్ ప్రశంసించారు. ఐపీఎల్ లో కొన్ని మ్యాచుల్లో వారి ప్రతిభను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. కుర్రాళ్లిద్దరూ మైదానంలో గొప్ప బాడీ లాంగ్వేజ్ ను చూపారని అన్నారు. వారు ఇద్దరు చాలా ఎక్కువ కాలం క్రికెట్ కు సేవలందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story