LIVE ప్రపంచ కప్ విజేత ఇండియన్ ఉమెన్స్
x
భారత ఉమెన్స్ క్రికెట్

ప్రపంచ కప్ విజేత ఇండియన్ ఉమెన్స్

మహిళల ప్రపంచ కప్ 2025(Women's World Cup) ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) సరికొత్త రికార్డు నెలకొల్పింది.


మహిళల ప్రపంచ కప్ 2025ను భారత్ గెలిచి చరిత్ర సృష్టించింది. ముంబైలో ఆదివారం జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై ఘన విజయాన్ని సాధించి తొలిసారి కప్ ను గెలిచింది. ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త బ్యాట‌ర్లు చెల‌రేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవ‌ర్లలో 7 వికెట్ల న‌ష్టానికి 298 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో ప్రోటీస్ జట్టు ముందు 299 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. భారత్ బ్యాటర్లలో షఫాలీ వర్మ( 87) సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకు పడింది.

సౌతాఫ్రి​కా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా, భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (45), షఫాలీ వర్మ (87) వేగంగా పరుగులు సాధించారు. దూకుడుగా ఆడిన స్మృతి(Smriti Mandhana) తృటిలో అర్ధ సెంచరీ మిస్ చేసుకుంది. 45 పరుగుల వద్ద.. క్లో ట్రయాన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ సినాలో జాఫ్తాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఇక సెమీ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శనతో ఓవర్ నైట్ స్టార్ అయినా జెమీమా(Jemimah Rodrigues).. ఈ మ్యాచ్‌లో తక్కువ పరుగుల(24)కే ఔటైంది. దూకుడుగా కనిపించిన షెఫాలీ వర్మ 87 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అయోబొంగా ఖాకా బౌలింగ్ లో ఔటైంది. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా 20 పరుగులకే పెవిలియన్ చేరింది. మొత్తంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది.

మహిళల ప్రపంచ కప్ 2025(Women's World Cup) ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్‌ వరల్డ్‌ కప్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ గా ఆమె చరిత్ర సృష్టించింది. నేడు(ఆదివారం) సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో (India vs South Africa) మంధాన ఈ అరుదైన ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డు మిథాలి రాజ్‌(Mithali Raj) పేరిట ఉండేది. మిథాలీ 2017 ఎడిషన్‌లో 409 పరుగులు చేయగా.. 2025 ఎడిషన్‌లో స్మృతి 418 పరుగులతో టాప్ ప్లేస్ లో ఉంది.

ఈ ఫైన‌ల్లో భార‌త కెప్టెన్ హ‌ర్మన్ ప్రీత్ కౌర్ తీవ్ర నిరాశ‌ప‌రిచింది. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన హర్మన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీప్తి శర్మతో కలిసి కాసేపు క్రీజులో నిలబడినప్పటికి తన మార్క్ చూపించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. 29 బంతుల్లో కేవలం 20 పరుగులు చేసిన హర్మన్‌.. సౌతాఫ్రికా స్పిన్నర్‌ మలాబా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యింది. అయితే ఈ మ్యాచ్‌లో హర్మన్ విఫలమైనప్పటికి ఓ వరల్డ్ రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. మహిళల ప్రపంచ కప్ నాకౌట్‌లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. వరల్డ్‌కప్‌లో నాలుగు నాకౌట్ మ్యాచ్‌లు ఆడిన హర్మన్‌.. 331 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఈ రి​కార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ పేరిట (330) ఉండేది.

ఫీల్డింగు విషయంలో భారతీయ టీమ్ అనేక తప్పులు చేసినప్పటికీ ఎట్టకేలకు విజయం సాధించింది. వత్తిడితో పలుమార్లు క్యాచ్ లు వదిలేశారు.

Live Updates

  • 3 Nov 2025 12:02 AM IST

    10వ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

    29 బంతులు 53 పరుగులు.. 1 వికెట్

    246 పరుగులకు దక్షిణాఫ్రికా ఆల్ అవుట్

  • 3 Nov 2025 12:00 AM IST

    9వ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

    30 బంతులు 53 పరుగులు.. 1 వికెట్

  • 2 Nov 2025 11:43 PM IST

    8వ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

    సెంచరీ పూర్తి చేసిన లౌరా వాల్డార్ట్ అవుట్

    41 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా 220/76

  • 2 Nov 2025 11:42 PM IST

    7వ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

    సెంచరీ పూర్తి చేసిన లౌరా వాల్డార్ట్ అవుట్

    41 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా 220/76

  • 2 Nov 2025 11:36 PM IST

    40 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా 211/6

    సెంచరీ పూర్తి చేసిన లౌరా వాల్డార్ట్

    టైరాన్ 2 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు

    58 బాల్స్ లో 87 పరుగులు చేయాల్సి ఉంది

  • 2 Nov 2025 11:33 PM IST

    6వ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

    39,3 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 209/6

    లౌరా వాల్దార్డ్ 99

    డెర్క్సన్ 23/19 అవుట్

  • 2 Nov 2025 11:16 PM IST

    35 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 185/5

    లౌరా వాల్దార్డ్ 85

    డెర్క్సన్ 23/19 అవుట్

    భారీ మూల్యం చెల్లించిన రాథా

    నో బాల్ వేసినపుడు 6 పరుగులు

    మళ్లీ బాల్ వేసినపుడు 6 పరుగులు

    దీంతో ఒకే బాల్ కి 12 పరుగులు ఇచ్చినట్టయింది

  • 2 Nov 2025 10:54 PM IST

    5వ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

    30.3 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 148/5

    లౌరా వాల్దార్డ్ 74/71

    జప్టా 35/30 అవుట్

    నిదానమే ప్రధానమంటున్న దక్షిణాఫ్రికా

    124 బంతుల్లో 115 పరుగులు చేయాల్సి ఉన్నదక్షిణాఫ్రికా

  • 2 Nov 2025 10:30 PM IST

    4 వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

    22.1 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 123/4

    ఓపెనర్ వాల్దార్ట్ ఆడుతున్నారు. 

  • 2 Nov 2025 10:21 PM IST

    ౩వ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

    20 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 113/2

    లౌరా వాల్దార్డ్ 60/49,లూస్ క్రీజ్ 25/30

Read More
Next Story