నేను డకౌట్ అయితే.. యువీ సంతోషించాడు: యువ ఓపెనర్
x

నేను డకౌట్ అయితే.. యువీ సంతోషించాడు: యువ ఓపెనర్

నా తొలి మ్యాచ్ లో డకౌట్ అవడంపై తన మెంటార్ యువరాజ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడని యువ ఒపెనర్ అభిషేక్ శర్మ వెల్లడించారు.


జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 లో డకౌట్ కావడంపై తన మెంటార్ యువరాజ్ సంతోషించాడని యువ ఒపెనర్ అభిషేక్ శర్మ తెలిపారు. ‘ఇది మంచి ఆరంభం’ అని వెల్లడించాడని పేర్కొన్నారు. జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్ లో అరంగేట్రం చేసిన అభిషేక్ డకౌట్ అయ్యాడు.

శనివారం జరిగిన ఈ మ్యాచ్ లో మెన్ ఇన్ బ్లూ 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ తరువాత జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. కేవలం 47 బంతుల్లో సెంచరీ చేశాడు. మొదటి మ్యాచ్ లో డకౌట్ అయిన బాధను రెండో టీ20లో సెంచరీ చేయడం ద్వారా తీర్చుకున్నాడు.

"నేను నిన్న (శనివారం) కూడా అతని(యువీ)తో మాట్లాడాను. నేను డకౌట్ అయినప్పుడు అతను ఎందుకు చాలా సంతోషించాడో నాకు తెలియదు. ఇది మంచి ప్రారంభం అని అతను చెప్పాడు, అయితే అతను నా కుటుంబంలాగే చాలా సంతోషంగా, గర్వంగా ఉండాలి" అని అభిషేక్ చెప్పాడు. అని బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొంది.
2011 వరల్డ్ కప్ హీరో నా జీవితంలో క్రికెట్ ఆడటానికి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. యువీ మైదానంలో నా నైపుణ్యాలను మెరుగు పరచడానికి సాయం చేయడమే కాకుండా, ఇంటి నుంచి దూరంగా ఉన్న సమయంలో కూడా నాకు ధైర్యం చెపుతున్నాడు.
"ఇదంతా అతని వల్లనే, అతను పడిన కష్టమే. (రెండు-మూడేళ్ళుగా, అతను నా క్రికెట్‌పై మాత్రమే కాకుండా) మైదానం వెలుపల కూడా చాలా కష్టపడ్డాడు." ఆదివారం ఆట ముగిసిన తర్వాత, యువరాజ్‌కు అభిషేక్ ఫోన్ చేశాడు. సెంచరీ చేసిన తరువాత తన సంతోషాన్ని తన మెంటార్ తో పంచుకున్నాడు. ఈ సందర్భంగా యువీ తనను మెచ్చుకున్నాడని, ఆరంభం బాగుందని, ఇది ప్రారంభం మాత్రమే అని యువరాజ్ గుర్తు చేశాడని పేర్కొన్నారు.
మొదటి రెండు గేమ్‌ల మధ్య విశ్రాంతి లేనందున, ఓడిన మ్యాచ్ గురించి ఆలోచించే సమయం లభించలేదు. ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 1-1 తో సమం చేయడానికి ఇది సాయయపడింది. "మేము నిన్న ఓడిపోయాము, కానీ నేను మ్యాచ్ కు ముందు అనుకున్నాను. ఈ రోజు.. నాది, నేను మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలి, సానుకూల విషయం ఏమిటంటే తదుపరి గేమ్ గురించి ఆలోచించడానికి మాకు ఎక్కువ సమయం లేదు," అని శర్మ చెప్పారు..
అభిషేక్ - రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్)తో కలిసి రెండో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. " నన్ను నేను నిరూపించుకోవాలని అనుకున్నాను. నేను రుతుతో కూడా మాట్లాడాను, అతను అదే మాట చెప్పాడు, 'బంతుల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నువ్వు చేయగలిగింది చెయ్'," అని అతను చెప్పాడు.
సెంచరీ చేసినందుకు తన పంజాబ్ సహచర ఆటగాడు కెప్టెన్ శుభ్ మన్ గిల్ కృతజ్ఞతలు తెలిపాడు. పర్యటనలో ఉన్న భారత కెప్టెన్‌కి మరియు తన బ్యాట్‌ను అందించినందుకు అతని పంజాబ్ సహచరుడు శుభ్‌మన్ గిల్‌కు అతను మరోసారి కృతజ్ఞతలు తెలిపాడు. ఇలా అండర్ 14 నుంచి జరుగుతోంది. నేను అతను టీమ్ తో ఉన్నప్పుడల్లా బ్యాట్ తో రాణిస్తున్నాడు. అనేక కష్టాల నుంచి ఈ స్థాయికి చేరుకున్నాడని గిల్ అన్నారు.
Read More
Next Story