కర్నాటక బిజెపిలో ఉత్తర దక్షిణ తన్నులాటలు మొదలయ్యాయి
x
కర్నాటక బిజెపి పెద్దాయన యడ్యూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర

కర్నాటక బిజెపిలో ఉత్తర దక్షిణ తన్నులాటలు మొదలయ్యాయి

కర్నాటక బిజెపి అధికారంలో ఉంటే ఒక సమస్య, లేకుంటే మరొక సమస్య. దక్షిణ కర్నాటక పెత్తనేమేంటని ఉత్తర కర్నాటక ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.


అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఏడు నెలలవుతున్నా భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి ఉన్న ఏకైక దక్షిణాది రాష్ట్రమయిన కర్నాటకలో తన్నులాటలు చల్లారడం లేదు.మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర ని పిసిసి అధ్యక్షుడిగా నియమించినా, వారి విధేయుడు ఆర్‌ అశోక్‌ ని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత కూడా బిజెపిలో ముఠాతగాదాలు సమసిపోవడం లేదు.

వ్యక్తిగత కక్షలతో పాటు ఇపుడు ప్రాంతీయ కుంపట్లు మొదలయ్యాయి. ఉత్తర కర్నాటక దక్షిణ కర్ణాటకకు చెందిన పార్టీ నాయకుల మధ్య విబేధాాలు కూడా తోడైయ్యాయి. మమ్మల్ని పార్టీలో నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని ఉత్తర కర్నాటక వాళ్లు వాపోతున్నారు. దక్షిణాది పెత్తనం ఎక్కువయిందని ఆగ్రహిస్తున్నారు.

మే నెలలో కాంగ్రెస్ చేతిలో అధికారం కోల్పోయాక, షాక్ కు గురైన నాయకత్వం కర్ణాటకలో రి గాలికి వదిలేసింది. పిసిసి అధ్యక్షుని నియమించలేదు. ప్రతిపక్ష నాయకుడిని ఎంపిక చేయలేదు. ఈ గందరగోళం మధ్య పరిస్థితి చక్కదిద్దాలని కోరుతూ బిజెపి హైకమాండ్ ఇంతకుముందు పక్కన పెట్టిన యడ్యూరప్పనే ఆశ్రయించింది.

ఆయన్ని బుజ్జగించేందుకు ఆయనకుమారుడు విజయేంద్రను రాష్ట్ర కమిటి అధ్యక్షుడిని చేసింది. ఆపైన అశోక్ ప్రతిపక్ష నాయకుడిగా నియమించింది. దీని తర్వాత ఇక పార్టీ చక్కబడుతుందని బిజెపి నేతలు భావించారు. అయితే, మరొక కొత్త రకం వివాదం మొదలయింది పార్టీలో.

బీజేపీ అంతర్గత పోరు

అప్పటి నుండి, పార్టీలో అనేక విస్ఫోటనాలు జరుగుతూనే ఉన్నాయి., ప్రధానంగా కర్నాటక పెద్దాయన గా పేరున్న యడియూరప్ప (బిఎస్ వై) ని వ్యతిరేకించే వాళ్లంతా కుటుంబ పెత్తనం మీద కత్తులు దూస్తున్నారు.

ఈ పెత్తనం ఏమిటని, బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌ వంటి నేతలు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు, శాసనసభాపక్ష సమావేశాలకు హాజరుకావడం కావడం మానేశారు. పవర్ లో ఉంటే ఒక సమస్య, పవర్ లో లేకుంటే మరొక సమస్య, ఏమిటీ పరిస్థితి అని యత్నాల్ మండిపడుతున్నారు.

"అధికారంలో ఉన్నా లేకున్నా కర్ణాటకలో మన గతి ఇంతేనా" అని ఒక బిజెపి నాయకుడు ఫెడరల్‌ తో విలపించారు.

బిఎస్‌వై ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలువురు నేతలు ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించారని, ఆయనను సక్రమంగా పనిచేయనివ్వలేదని, చివరకు ఆయన పదవిని కూడా వదులుకునేలా చేశారని ఆయన గుర్తు చేశారు.

"ఇప్పుడు, అధికారం పోయింది, అధికారంలో లేనప్పుడు కూడా పార్టీని ప్రశాంతంగా ఉంచడం లేదు, మళ్ళీ వివిధ వర్గాలు పరస్పరం వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. పార్టీని సమర్థవంతమైన ప్రతిపక్షంగా పనిచేయనివ్వడమే లేదు" అని ఆయన అన్నారు.

మొన్న ఉత్తర కర్ణాటకలోని బెల్గావిలో అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. ఇక్కడ ఏడాదికొకసారి మాత్రం అసెంబ్లీ ఒక సెషన్ కోసం సమావేశమవుతుంది.

ఒకరోజు. బిజెపి కార్యకర్తలపై దాడులకు నిరసనగా విజయేంద్ర సభలోని నడవ లోకి దూకేశాడు. అపుడు ఉన్నట్లుండి, ప్రతిపక్ష నాయకుడు అశోక్ వాకౌట్ ప్రకటించి బిజెపి శాసనసభ్యులను గందరగోళపరిచారు. వాకౌట్ మీద ఒక విధానం ఉండనవసరం లేదా. సభ్యుల మధ్య సమన్వయం ఉండక్కర్లేలేదా అనేది వాళ్ల విమర్శ.

అపుడేమయింది? కొందరు విజయేంద్రను అనుసరించి సభలో వెల్ నిరసన తెలుపుతూ ఉంటే, మరికొందరు అశోక్‌తో కలిసి శాసనసభ నుండి బయటకు వచ్చారు. ఈ గందరగోళం మధ్య, విజయేంద్ర, ఇతర ఎమ్మెల్యేలు కూడా కొద్ది సేపయ్యాక గుమ్మున వాకౌట్ చేశారు.

బీజేపీ అసంతృప్తులు

విజయేంద్ర అనుచరుడైన బెంగళూరు ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌, అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ పరిస్థితి మీద మండిపడ్డాడు. సభలో నిరసన జరుగుతున్నపుడు వాకౌట్ అని పిలుపు నిచ్చిందుకు అశోక్‌ని బాహాటంగా నీచమైన పదజాలంతో తిట్టారు.

అశోక్‌కు నాయకత్వ పటిమ లేకపోవడం వల్లే కర్ణాటకలో బీజేపీ పతనం కాబోతున్నదని హెచ్చరించారు.

విజయేంద్ర, అతని మిత్ర బృందం సహకారం రాకపోవడంతో అశోక్ బ్యాచ్ తిరిగి అసెంబ్లీకి వెళ్లింది.

మరొక సంఘటన. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నియినందుకు అశోక్‌ను అభినందించేందుకు స్పీకర్‌ యూటీ ఖాదర్‌ బసనగౌడ యత్నాల్‌ పేరును పిలిస్తే ఆయన నోరు మెదపలేదు.

రెండోసారి పిలిచినా మౌనంగానే ఉన్నాడు.

యత్నాల్ ప్రవర్తనపై ఎమ్మెల్యేలు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇది ప్రతిపక్ష పార్టీకి ఇది చాలా ఇబ్బందికరంగా మారింది.

ఆతర్వాత మీడియాతో మాట్లాడుతూ తన అక్కసు వెళ్లగక్కారు యత్నాల్.

, "ఉత్తర కర్ణాటక ప్రజలు దక్షిణ కర్ణాటక నాయకులకు బానిసలు కాదు" అని అన్నారు. ఉత్తర కర్ణాటకకు న్యాయం జరిగే వరకు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశాలకు హాజరు కాబోనని చెప్పారు.

‘ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, పదవులన్నీ దక్షిణ కర్ణాటకకేనా. ఉత్తర కర్నాటక ఒకటుందని మర్చిపోయారా ’ అని అసెంబ్లీలో మండిపడ్డారు.

‘అధికారం దక్షిణ కర్నాటక నేతలు ఎలా పంచుకుంటూ ఉత్తర కర్ణాటక ప్రజలను ఎలా ‘ఆదరిస్తున్నా’రో అందరికీ తెలుసు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా విజయపుర నియోజకవర్గం అభివృద్ధికి రూ.125 కోట్లు మంజూరు చేశారు. కానీ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం దానిని వెనక్కి తీసుకుంది," అని ఆయన చెప్పారు.

మరో బీజేపీ ఎమ్మెల్యే అడ్డుతగిలి యడ్యూరప్ప కూడా గ్రాంట్ ఇచ్చారని చెప్పడంతో యత్నాల్ ఆవేశంగా ‘నోరు మూయ్’ అన్నారు.

కాంగ్రెస్ హస్తమా?

లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా కుటుంబ రాజకీయాలు ముగుస్తాయి, కుల రాజకీయాలకు కర్నాటకలో కూడా స్వస్తి పలకడం జరుగుతుందని యత్నాల్ అన్నారు. ఈ మాటని ఆయన బిఎస్ వై గుంపు మీదే ఎక్కు పెట్టినట్లు వేరే చెప్పాల్సిన పనిలేదు.

అశోక్ పై అసహనం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఎస్ ఆర్ విశ్వనాథ్ ‘అశోక్ పదవిలో ఉన్నంత వరకు ప్రతిపక్ష నేత గదిలోకి రాను,’ అని చెప్పారు.

బిజెపి శాసన సభాపక్ష సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్‌వై, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయేంద్ర, అశోక్, కోట శ్రీనివాస పూజారి పాల్గొన్నారు.

అయితే ఎమ్మెల్యేలు యత్నాల్, రమేష్ జారకిహోళి, ఎస్టీ సోమశేఖర్ హాజరు కాలేదు.

సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలను మాట్లాడేందుకు అనుమతించలేదని కొన్ని బీజేపీ వర్గాలు తెలిపాయి.

ఇది ఇలా ఉంటే మొన్న గురువారం బెళగావిలో జరిగిన కాంగ్రెస్ విందు సమావేశానికి సోమశేఖర్, శివరామ్ హెబ్బార్, హెచ్ విశ్వనాథ్ హాజరయ్యారు. ఈ నేతలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

Read More
Next Story