తెలంగాణ స్పీకర్ గా ఎస్సీలకు చాన్స్ కాబోయే స్పీకర్ గడ్డం ప్రసాద్
దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి స్పీకర్ పదవి వరించింది. వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం ప్రసాద్ తెలంగాణ స్పీకర్ అయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఎస్సీ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ పేరును ఎంపిక చేసింది. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి స్పీకర్ పదవి వరించింది. వికారాబాద్ ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో ఆయన మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మర్పల్లిలో ఆయన పుట్టారు. ఇంటర్మీడియట్ చదివారు. 2008 ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్ నియోజకవర్గ నుంచి గెలిచారు. పూర్తి స్థాయి ఎమ్మెల్యేగా తొలిసారి 2009లో ఎన్నికయ్యారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుసగా ఓటమి పాలయ్యారు. 2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మంచి అనుభవం ఉండడంతో ఆయనకు స్పీకర్ బాధ్యతలు అప్పగించింది.