ఏపీ ఎన్నికలు ఫిబ్రవరిలో?
x
క్యాబినెట్ మీటింగ్ లో సీఎం జగన్

ఏపీ ఎన్నికలు ఫిబ్రవరిలో?

క్యాబినెట్ మీటింగ్ లో ఏపీ సీఎం జగన్ ఎన్నికలపై కీలక వ్యాఖ్య చేశారు.. అందర్నీ సన్నద్ధం కావాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు.


సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ కన్నా ముందే జరుగుతాయా? ఏప్రిల్, మేలో జరగాల్సిన ఎన్నికలు ముందే వస్త్తాయా? అందుకే ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షల్ని మార్చిలోనే పూర్తి చేస్తున్నారా? జనరల్ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో కాస్త ముందుగానే జరగుతాయన్న సంకేతాలు ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఏపీ కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందని.. అయినా ఎన్నికలకు పూర్తి సన్నద్ధం కావాలని మంత్రులకు సూచించారు. ఈసారి జరగబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తాయన్నట్టుగా జగన్ మాట్లాడినట్టు ఓ మంత్రి చెప్పారు.

జనంలోనే ఉండండని మంత్రులకు సలహా

‘‘ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. అయినా సరే మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పని చేయాలి. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావొచ్చు’’ అని కేబినెట్‌ భేటీలో సీఎం జగన్‌ అన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు.. వాటికి కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు చేసే విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఎంతో కొంత సమాచారం లేకుండా సీఎం స్థాయి వ్యక్తి ఆమాట అనరని మంత్రులు వ్యాఖ్యానించారు.

Read More
Next Story