బీహార్, జార్ఖండ్‌‌లో కమల వికాసం: ఫెడరల్ సర్వే
x

బీహార్, జార్ఖండ్‌‌లో కమల వికాసం: ఫెడరల్ సర్వే

ఫెడరల్-పుతియతలైమురై- యాప్ట్ 2024 ప్రీ-పోల్ సర్వే: రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన ఓట్ల శాతాన్ని పెంచుకున్నా ఆశించిన సీట్లు దక్కవు.


ఇటీవల బీహార్, జార్ఖండ్‌లలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే బీజేపీ పుంజుకునేలా కనిపిస్తుంది.

బీహార్‌లో నితీష్ కుమార్ మరో మలుపు తీసుకున్నారు. మిత్రపక్షాలు, RJD, కాంగ్రెస్‌తో బంధాన్ని తెంచుకుని BJPతో చేతులు కలిపారు. అతని పార్టీ జేడీ(యూ) ఇప్పుడు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతోంది.

జార్ఖండ్‌లో అవినీతి కేసుల్లో హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. తర్వాతి జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంలో జాప్యం కారణంగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి BJP దూసుకుపోతుందనే ఊహాగానాల మధ్య చంపాయ్ సోరెన్ ఆ పదవిని చేపట్టారు.

వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తుందా?

ఫెడరల్-పుతియాతలైమురై-యాప్ట్ 2024 ప్రీ-పోల్ సర్వే బీహార్, జార్ఖండ్‌లలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సూచిస్తుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే రెండు రాష్ట్రాల్లో ఓట్ల-షేర్ పరంగా కాంగ్రెస్ కొంత పురోగతి సాధించగలదు. అయితే ఇది పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వకపోవచ్చు.




బీహార్: బీజేపీదే పైచేయి

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 45 శాతం ఓట్లతో బీజేపీ స్పష్టమైన విజేతగా నిలుస్తుందని ఫెడరల్ సర్వే సూచిస్తుంది. దాని తర్వాతి స్థానంలో 18 శాతంతో దాని మిత్రపక్షమైన JD(U) నిలుస్తుంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)కి 2019 సార్వత్రిక ఎన్నికల్లో 22 శాతం ఓట్లు వచ్చాయి. జేడీ(యూ) 2019లో 16 సీట్లు సాధించగా.. వచ్చే ఎన్నికల్లో 2 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది.


మరోవైపు కాంగ్రెస్ 2019లో దాదాపు 8 శాతం ఉన్న ఓట్ల శాతాన్ని ఈ ఏడాది దాదాపు 12 శాతానికి పెంచుకునే అవకాశం ఉంది. దాని కూటమి భాగస్వామి, లాలూ ప్రసాద్ నేతృత్వంలోని RJD, 2019లో దాదాపు 16 శాతం ఉన్న ఓట్ షేర్ ఇప్పుడు 10 శాతానికి పడిపోయే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.


బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలకు గాను 37 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, జేడీ(యూ)కు రెండు, కాంగ్రెస్‌కు ఒకటి దక్కుతుందని ఫెడరల్ సర్వే అంచనా వేసింది.

జార్ఖండ్: ఇక్కడ కూడా కమలానిదే హవా..

ఈసారి బీజేపీకి 65 శాతానికి పైగా ఓట్లు వస్తాయని ది ఫెడరల్ సర్వే అంచనా వేసింది. ఇది 2019లో సాధించిన దాదాపు 52 శాతం ఓట్ షేర్ కంటే గణనీయమైన పెరుగుదల.


కాంగ్రెస్ తన ఓట్ల శాతం 15.8 శాతం నుంచి 16.4 శాతానికి స్వల్పంగా పెరుగుతుందని, అయినప్పటికీ బీజేపీకి పొంతన లేదని సర్వే సూచిస్తుంది.


ప్రస్తుతం రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న జేఎంఎం, లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు సగానికి పడిపోయి, 11.7 శాతం నుంచి 6 శాతానికి చేరుకుంది.

Read More
Next Story