నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్‌పై కాంగ్రెస్ చార్జిషీట్
x
కాంగ్రెస్ చార్జిషీట్ విడుదల చేస్తున్న ఎంపీ రేణుకాచౌదరి, టీపీసీసీ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి,తదితరులు

నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్‌పై కాంగ్రెస్ చార్జిషీట్

నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ పేరిట కాంగ్రెస్ పార్టీ చార్జిషీట్ విడుదల చేసింది. బీజేపీ ఎంపీ అరవింద్ కు టీపీసీసీ ఎన్నారై సెల్ నాలుగు ప్రశ్నలు సంధించింది.


‘గల్ఫ్ కార్మిక ద్రోహి... గప్పాల అరవింద్’ పేరిట కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం సంచలన చార్జిషీట్ విడుదల చేశారు. 2019 లో మాయ మాటలతో గల్ఫ్ కార్మికుల ఓట్లు కొల్లగొట్టి నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అరవింద్ గల్ఫ్ కార్మికులను మోసం చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. టీపీసీసీ ఎన్నారై సెల్, గల్ఫ్ కాంగ్రెస్ నాయకులు సోమవారం గాంధీ భవన్ లో ఒక చార్జిషీట్ ను విడుదల చేశారు.

- మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, టీపీసీసీ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, కేరళ ప్రవాసి కాంగ్రెస్ నేత మునీర్ తో కలిసి ఎంపీ అరవింద్ పై చార్జిషీట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. చార్జిషీట్ లోని నాలుగు ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోతే... ఈ పార్లమెంటు ఎన్నికల్లో అరవింద్ కు గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే నైతిక అర్హత ఉండదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.


ఎంపీ అరవింద్ పై సంధించిన నాలుగు ప్రశ్నలు
- 2020 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల పొట్టగొడుతూ... కనీస వేతనాలు 30 నుంచి 50 శాతం వరకు తగ్గిస్తూ సర్కులర్లు జారీ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కనీసం ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం సిట్టింగ్ ఎంపీ అరవింద్ కు చేతకాలేదా?
- ప్రవాసి భారతీయ బీమా యోజనలో సహజ మరణాన్ని చేర్చకుండా గల్ఫ్ కార్మికుల బతుకులతో బీజేపీ ప్రభుత్వం అడుకుంటే...ఎంపీ అరవింద్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించకుండా తప్పించుకున్నారు కదా.
- హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్ ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ కూడా అరవింద్ లేఖ ఎందుకు రాయలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.
- కరోనా కష్టకాలంలో... గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చిన పేద కార్మికుల రక్తం పిండి రెండింతలు, మూడింతలు విమాన చార్జీలు వసూలు చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాదా అని వారు ప్రశ్నించారుర. ఫ్రీగా రప్పించాల్సిన కేంద్రం.. అధిక చార్జీలు వసూలు చేయడాన్ని ప్రశ్నించలేని అరవింద్ ఎంపీ పదవికి అనర్హుడని చెప్పారు.


Read More
Next Story