ఖర్గే ఇక హైదరాబాద్ కు మకాం మారుస్తారా!
x
ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో రాహుల్ గాంధీ

ఖర్గే ఇక హైదరాబాద్ కు మకాం మారుస్తారా!

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీష్ గడ్ లలో పరాజయం తర్వాత రాజవంశం మీద నిందపడకుండా ఉండేందుకు కాంగ్రెస్ యోధానుయోధులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.


టికె అరుణ్

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్యం, శ్రేయస్సు కారణాల దృష్ట్యా తాత్కాలికంగా హైదరాబాద్‌కు స్థావరం మార్చడం మంచిదని కాంగ్రెస్ భావించవచ్చు. రాజకీయాల్లో నరబలి జరగక చాలా కాలమయింది. జరిగేది జరగకుండా పోదనుకోవడం కన్న ఖర్గే చేసేదేమీ లేదు. ఎందుకంటే, ,ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల రౌండ్‌లో హిందీ రాష్ట్రాలలో కాంగ్రెస్ ఘోర పరాజయం నింద రాహుల్ గాంధీ మీద పడకుండా రక్షించడానికి చాలా శక్తివంతమైన రాజకీయ నాయకులు మార్గాలను అన్వేషిస్తున్నారు. వైఫల్యం భారాన్ని ఎవరో ఒకరి మీద వేయాలి. ఎదురుగా చాలా బాగా కనిపిస్తున్నది పార్టీ అధ్యక్షుడు ఖర్గే భారీ విగ్రహమే.

పదేళ్లపాటు అధికారానికి దూరమైన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పార్టీ నాయకత్వం పట్ల తెలంగాణ ఓటర్లు సెంటిమెంట్ సానుకూలంగా మారింది. కాంగ్రెస్ ఓట్ల వాటా కె చంద్రశేఖర రావు నాయకత్వంలోని BRS సాధించిన దాని కంటే కేవలం రెండు శాతమే ఎక్కువ. ఎదయితేనేం, గెలుపు గెలుపే.

రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీషగడ్ రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు బిజెపికి, ప్రధాని మోడీకి, మంచి భరోసా ఇచ్చాయి. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమం చేశాయి. అక్కడ బిజెపి సంస్థాగత వ్యవహారాలు చూసిన అమిత్ షాకి కృతజ్ఞతచెబుతున్నా,ఈ రాష్ట్రాల్లోని బిజెపి నాయకులంతా తమ విజయానికి క్రెడిటంతా మోడీ కే అప్పగిస్తున్నారు.

ప్రస్తుతం పార్లమెంటు సభ్యులుగా పనిచేస్తున్న ప్రముఖ నాయకులను అసెంబ్లీ ఎన్నికలకు పోటీకి పంపడం కూదా బిజకపి వ్యూహంలో భాగమే, అది బిజెపికి చక్కగా పనిచేసినట్లు కనిపిస్తోంది.

బిజెపి రాజకీయాలకు సంబంధించినంతవరకు తెలంగాణ ఎన్నికలు ఉత్తర దక్షిణాల మధ్య విభజన రేఖ గీయాలన్నంత ఉత్సాహం కల్గిస్తాయి. దక్షిణాఫథం బిజెపికి లొంగని శక్తిగా పరిగణించబడుతుంది.ఇలా విభజన రేఖ గీయడం చాలా సులువు. కాని గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.

బిజెపి రాజకీయాలు వేరు బిజెపి ఎన్నికలు వేరు అనే విషయం ఎవరూ విస్మరించరాదు. హిందూ జాతీయ వాదం నుంచి బిజెపి హిందూ మెజారిటీ దృక్పథం నిర్వచించుకోవాలి. ఇక్కడ ఇతర విశ్వాసాల ప్రజలు మహా అంటే రెండవ తరగతి పౌరులుగా జీవించాల్సిందే. ఈ ధోరణి బాగా ప్రచారానికి వస్తున్నది. దక్షిణాదిలో గెలుస్తున్న బిజెపిలు తక్కువేకావచ్చు. కాని బిజెపి హిందూత్వం ఇక్కడ బాగా పాచుర్యంలోకి వస్తున్న ఉన్న విషయం మరువరాదు.

మతపరమైన ఆచారాల పేరుతో మైనారిటీల్లో మధ్య ఉన్న ప్రజావ్యతిరేక ధోరణులను ఎదుర్కోవడంలో, వ్యతిరేకించడంలో ప్రతిపక్షాలు నిలకడగా వైఫల్యం చెందడం బిజెపి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ వంటి పార్టీలు ఓట్ల కోసం మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ ఒక బలమయిన నిందా ప్రచారం చేయడానికి ఇది కారణమయింది.

ఈ మతతత్వ రాజకీయానికి బిజెపి చక్కగా దేశాభివృద్ధి అనే పూత పూసింది. బిజెపి ప్రభుత్వ హయాంలో ప్రగతి ప్రస్పుటంగా జరిగిందని, గత ప్రభుత్వ హయాంలో అవినీతి తప్ప మరేమీ జరగలేదనే కథనాన్ని సోషల్ మీడియాను ఉపయోగించి కాషాయ పార్టీ చాలా విస్తృతంగా బలంగా ప్రచారం చేసింది.

నిజానికి, యుపిఎ పదేళ్ల వృద్ధి రేటు ను చూస్తే మోడీ పది సంవత్సరాల్లో సాధించిన వృద్ధి రేటు కంటే ఎక్కువగానే ఉంది. ప్రజల దృక్పథాన్ని ప్రభావితం చేయడంలో వాస్తవాల కంటే ప్రజలకు ఏదర్థమమయితే అదే బలంగా పని చేస్తుంది. అదే వాళ్ల దోరణిలో మార్పు తెస్తుంది.

వామపక్షాలు ఆధిపత్యం చెలాయించే కేరళ వంటి రాష్ట్రంలో కూడా, పదవిలో ఉన్నా లేకున్నా, సంఘ్ పరివార్ భావజాలం దట్టంగా కనిపిస్తుంది. అయితే, ప్రజలు అక్కడ బిజెపికి ఎపుడూ ఓటు వేయరు ఎందుకంటే అది ఎప్పటికీ ఎన్నికలపరంగా ఒక ప్రత్యామ్నాయం మారేలా లేదని ఓటర్లు కు తెలుసు.

అయితే, బిజెపికి ఎపుడో ఒకప్పుడు ఎవరో ఒక జనాదరణ ఉన్న నాయకుడు దొరక్కపోడు, పరిస్థితి తారుమారు కాకతప్పదు. అలాంటి అవకాశమే రాదనుకోవడం అవివేకం అవుతుంది. రాష్ట్రంలో పార్టీ నాయకత్వ బాధ్యతను భుజానేసుకునే సామర్థ్యం ఉన్న ఎవరైనా ఒక మంచి వ్యక్తిని బిజెపికి దొరికితే, హిందుత్వ పోకడలను లోలోన అణచి వేసుకోలేక సతమతమవుతున్న వ్యక్తులు, శక్తులు అకస్మాత్తుగా పెల్లుబుకవచ్చు. ఎన్నికల్లో గెలిచేందుకు బాట వేయవచ్చు.

కాబట్టి తప్పు ఎక్కడుందంటే...

తప్పు, నిస్సందేహంగా, భారతదేశం మరుగుజ్జు ప్రజాస్వామ్యంలో ఉంది.భారత ప్రజాస్వామ్యాన్ని పోషించి, పెద్ద చేయడానికి మొదలయిన ప్రయత్నాలు నెహ్రూ మరణంతోనే ఆగిపోయినట్లున్నాయి.ప్రజాస్వామ్యం బలపడకపోవడంతో ఎన్నికల ద్వారా అధికారం చేజిక్కించుకుంటే చాలు, చాలా ప్రయోజనాలున్నాయి, తాను అందలమెక్కవచ్చు. తన మద్దతు దారులకు అధికారం ఛత్రం పట్టవచ్చు. ఇలాంటి ప్రజా స్వామ్య ఆకర్షణల వల్ల , బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలనే దాని కంటే, ఏదో విధంగా అధికారం చేజిక్కించుకోవాలన్నదే రాజకీయ నాయకుల ప్రధాన వ్యాపకమయింది.

ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమంగా మారి అభివృద్ధికి ప్రతిబంధకంగా తయారయిన కులాన్ని నిర్మూలించాలనుకోవడం కంటే, , దాని రాజకీయసమీకరణకు ఒక సాధనంగా వాడుకుంటూ ఉండటం మనం సర్వత్రా చూడవచ్చు. సాంప్రదాయం, ఆచారాలు అనేవి ప్రజాస్వామ్యానికి భయంకరమయిన ప్రతిబంధకాలు. వివాహంలో భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ నుండి ఆస్తి హక్కుల వరకు మహిళల సమానత్వాన్ని తిరస్కరించే ఈ సంప్రదాయాలకు, ఆచారాలకు ప్రస్తుత రాజకీయాల్లో ప్రోత్సాహం దొరకడమే కాదు, వాటికి చట్టపరమైన రక్షణ దొరుకుతూ ఉంది.

ప్రజాస్వామ్యం అనేది కేవలం ఎన్నికలనే స్థాయికి దిగజారిపోయింది. ఎన్నికలను గెలవడానికి ధన జన బలాన్ని విస్తృతంగా ఉపయోగించడం, ఓటర్లకు డబ్బు, మద్యం పంచడం , ఇంకా కొన్ని చోట్ల డ్రగ్స్‌తో అందించడం నిత్యకృత్యాలు ( స్టాండర్డ్ అపరేటింగ్ ప్రొసీజర్స్) అయ్యాయి. భారతదేశంలో అమలులో ఉన్న ఎన్నికల విధానం, రాజకీయాలనుంచి చిత్తశుద్ధిని నిర్మూలించి, రాజకీయ నాయకులు పార్టీలు ఫిరాయించడం, ఫిరాయింపుదార్లతో ప్రభుత్వాలను కూల్చడం, ఏర్పాటుచేయడం వంటి వాటిని రొటీన్ చేసింది. నేరస్థులకు గూండాలకు కూడా ప్రోత్సాహం అదే విధంగా ఎక్కువయింది.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్మించి బిజెపిని ఓడించాలనే దాని మీద కంటే, ఎన్నికల వ్యూహం ద్వారా కాషాయ పార్టీని ఓడించవచ్చనే ప్రతిపక్షాలు కలలు కంటున్నాయి. ఇది బిజెపి ప్రజావ్యతిరేక రాజకీయాలకు ఉచిత పాస్ ఇచ్చినట్లయింది. శక్తివంతమయిన బిజెపి పోలింగ్ నిర్వహణకు, వనరులకు సమీకరణకు మార్గం సుగమం చేసింది.

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు ఒక రాజవంశం నాయకత్వం వహిస్తున్నదని విమర్శిచేందుకు బీజేపీకి ఇది బాగా ఉపయోపడుతూ ఉంది.

ఎందుకంటే, కాంగ్రెస్ కుటుంబం తన తప్పులను తెలుసుకుని నాయకత్వం నుంచి వైదొలగేందుకు ఏమాత్రం సుముఖంగా లేదు. దానికి తోడు కోటరీ సాయంతో పెత్తనం కొనసాగించేందుకే ఎత్తులు వేస్తున్నది.

ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయంతో ఇండియా కూటమిని శాసించే సామర్థ్యాన్ని తగ్గించింది. విశ్వసనీయతను దెబ్బతీసింది.

అయితే ఎన్నికల ఫలితాల్లో ఒక ఆశాకిరణం ఉంది. బిజెపికి దక్కిన భారీ విజయవల్ల ఒక ప్రమాదం ఉండక పోవచ్చు. అదేంటంటే, 2019 ఎన్నికలకు ముందు జరిగిన బాలాకోట్ మిలిటరీ దాడి గుర్తుందా? అలాంటి ప్రమాదకర ప్రయోగాలు చేసేందుకు బిజెపి పూనుకోకపోవచ్చు. సిక్కు వేర్పాటువాదులకు వ్యతిరేకంగా భారతీయ భద్రతా సంస్థలు చేస్తున్న జేమ్స్ బాండ్ తరహా కార్యకలాపాల మీద అంతర్జాతీయ దృష్టి పడటం వల్ల బిజెపి దుందుడుకుగా ప్రవర్తించడం కాకుండా నిగ్రహం ప్రదర్శించాల్సి వస్తుంది.

వామపక్షాలు ఇక ఇల్లు సర్దిపెట్టుకోవాలి

వామపక్షాలు, వారి మద్దతు దారులు కాంగ్రెస్‌కు ప్రాణం పోసి తద్వారా వూపిరిపీల్చుకుందానుకునే ధోరణులవిడిచిపెట్టాలనేది ఎన్నికల నుంచి వెలువడిన మరొక సందేశం.

భారత్ లో ప్రజాస్వామ్యాన్ని నిర్మించే శక్తిగా కాంగ్రెస్ తప్పక ఉపయోగపడుతుంది. అయితే, పార్టీ నిర్వహణకు అవసరమయిన నిధులను ప్రజల నుంచి సేకరించుకునే విధానాన్ని అనుసరించాలి. అలాంటి నిర్ణయం పార్టీ నాయకత్వం, నడవడిలో సమూల ప్రక్షాళనకు పిలుపులాంటిది. అంతటి సాహసం కాంగ్రెస్ చేస్తుందా! నిధుల కోసం పార్టీ ఏలుబడిలోఉన్న రాష్ట్రాలను వాడుకునే వ్యూహం అనుసరిస్తే అది అవినీతికి బాట వేస్తుంది. ప్రజల్లో అసంతృప్తి రేకెత్తిస్తుంది.

ఈ నేపథ్యంలో ఉత్తరాదిలో ఓటమి పేరుతో ఖర్గేని హైదరాబాద్ కు పంపి, ఉత్తరాదిలో నాయకత్వాన్ని రాజవంశం వెనక్కి తీసుకుంటుందేమో.




Read More
Next Story