జగన్, రేవంత్‌లదే హవా.. 2024 ఎన్నికలపై 'ఫెడరల్' సర్వే
ఫెడరల్-పుతియతలైమురై- యాప్ట్ 2024 ప్రీ-పోల్ సర్వే బీజేపీకి మిశ్రమ స్పందన కనిపించింది. ఏపీలో కొంత ఓట్ల శాతాన్ని సంపాయించనుంది. తెలంగాణలో అక్కడక్కడా మెరవొచ్చు.
ఉమ్మడి చరిత్ర, భాష, సంస్కృతి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఈవేళ రెండు వేర్వేరు రాజకీయ ధృక్పదాల వైపు మొగ్గుచూపుతున్నాయి.
ది ఫెడరల్-పుతియతలైమురై, యాప్ట్ 2024 ప్రీ-పోల్ సర్వే సర్వే ప్రకారం... రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ), తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన కూటమి మధ్య హోరాహోరి పోటీ జరగనుంది.
వచ్చే జూన్‌లో పదేళ్లు పూర్తి చేసుకోనున్న తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేయాలని ఓటర్లు నిర్ణయించుకున్నట్టు సర్వేలో తేలింది.
ఆంధ్రప్రదేశ్: జగన్‌కు ఎడ్జ్ ఉందా?
తెలంగాణ విభజన సమయంలో హైదరాబాద్‌ను అప్పగించిన తర్వాత మళ్లీ నిలదొక్కుకోవడానికి పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్‌లో గత 10 ఏళ్లుగా అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఈ ఏడాది కేంద్రంలో కొత్త ప్రభుత్వానికి ఓటు వేయడంతో పాటు రాష్ట్రంలో కొత్త అసెంబ్లీకి కూడా ఓటు వేయనున్నారు ఏపీ ఓటర్లు. అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. మరోవైపు ప్రత్యర్థి టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది.
ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీకి దాదాపు 13 సీట్లు వస్తాయని సర్వే చెబుతుండగా, టీడీపీ-జనసేన కూటమికి దాదాపు 11 సీట్లు వస్తాయని సర్వే చెబుతోంది. ఈసారి ఒక్క సీటును దక్కించుకోనున్న బీజేపీకి గణనీయంగా ఓట్లు పెరిగాయని అంచనా. నిజానికి ఇది 2019 నాటి పరిస్థితికి విరుద్ధం. బీజేపీకి అనూహ్యంగా బాగా స్పందన కనిపించింది ఈ సర్వేలో.
తెలంగాణ: అసెంబ్లీ మాదిరే లోక్‌సభ ఎన్నికలు కూడానా!
దేశంలోనే యువ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కి పట్టం కట్టారు. రెండు నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అప్పుడే తీర్పు ఇవ్వలేకపోయినప్పటికీ పార్లమెంటు ఎన్నికలలో కూడా కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతారని అనిపిస్తోంది.
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో 13 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, మిగిలిన స్థానాలను కె చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) గెలిచే అవకాశం ఉందని ఫెడరల్ సర్వే పేర్కొంది.
2019లో తెలంగాణ రాష్ట్ర సమితి అని పిలవబడే BRS తొమ్మిది స్థానాలను గెలుచుకుంది. 2019లో సీట్లేమీ రావని సర్వే అంచనా వేయగా బీజేపీకి నాలుగు సీట్లు గెలిచింది.
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు భిన్నంగా, 2019 కంటే ఈ ఏడాది కూడా తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం తగ్గే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. 2019లో 42 శాతం ఓట్లు సాధించిన బీఆర్‌ఎస్ ఈ ఏడాది 32 శాతానికి తగ్గుతుందని సర్వే పేర్కొంది. 42.5 శాతం ఉన్న కాంగ్రెస్ ఈ ఏడాది లోక్‌సభ స్థానాల్లో అత్యధిక ఓట్లను సాధిస్తుందని అంచనా.
రేపు ఏమి ప్రకటిస్తామంటే?
ఇటీవలి నెలల్లో తీవ్ర రాజకీయ గందరగోళానికి గురైన మూడు రాష్ట్రాలను రేపు మేము కవర్ చేస్తాం. ఆ తిరుగుబాటు, సంచలనం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందా? రేపు ఇదే ప్లేస్‌లో, ఇక్కడే చూడండి!