అదానీ, అంబానీల నుంచి రాహుల్ భారీగా నల్లధనం: మోదీ
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ అదానీ, అంబానీల నుంచి ఎంత నల్లధనం తీసుకున్నారని ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు.మోదీ ఎక్స్ పోస్టులో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘అదానీ, అంబానీల నుంచి రాహుల్ గాంధీ ఎంత నల్లధనం తీసుకున్నారు?’’ అని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.అనంతరం బీజేపీ పేరిట ఎక్స్ లో పోస్టు పెట్టారు.
- అదానీ, అంబానీలపై రాహుల్ గాంధీ విమర్శలు చేయడం అకస్మాత్తుగా మానేశారని, వారి నుంచి రాహుల్ గాంధీకి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిందా అని మోదీ ప్రశ్నించారు. అంబానీ-అదానీలతో ఎన్నికల సమయంలో రాహుల్ కుదుర్చుకున్న డీల్ ఏమిటో వెల్లడించాలని మోదీ డిమాండ్ చేశారు.
- ‘‘వారి నుంచి మీకు ఎన్ని బస్తాల నల్ల ధనం వచ్చిందని మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్ యువరాజు గత ఐదేళ్లుగా ఐదుగురు వ్యాపారవేత్తలు అని విమర్శలు చేయడం మీరు చూశారని, ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల డెలివరీ అనంతరం రాహుల్ ఈ జపం చేస్తున్నారని ప్రధాని ఆరోపించారు.
అదానీ, అంబానీలపై విమర్శలు ఎందుకు చేయడం లేదు?
‘‘పార్లమెంట్ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి అదానీ, అంబానీలపై విమర్శలు చేయడం లేదని, దీనిపై నేను తెలంగాణ నేల నుంచి రాహుల్ గాంధీని అడగాలనుకుంటున్నాను,ఈ ఎన్నికల్లో యువరాజు వారి నుంచి ఎంత నల్ల ధనం తీసుకున్నారు’’అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్ పోస్టులో ప్రశ్నించారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు, ఎక్స్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నల్లధనం సంచుల టెంపో కాంగ్రెస్ పార్టీకి చేరిందా?
ఎన్ని సంచుల నల్లధనంతో కూడిన టెంపో కాంగ్రెస్ పార్టీకి చేరిందా? అని మోదీ అడిగారు. ‘‘మీరు రాత్రికి రాత్రే అదానీ, అంబానీల గురించి విమర్శలు చేయడం మానేయడం వెనుక మీ మధ్య ఏం ఒప్పందం కుదిరింది’’అని మోదీ ప్రశ్నించారు. ‘‘ఐదేళ్లుగా మీరు అంబానీ-అదానీలను దుర్భాషలాడారు, ఇప్పుడు మీరు రాత్రికి రాత్రే ఆగిపోయారు. అంటే మీకు ఏదో వచ్చింది. దీనిపై మీరు దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే మోదీ ప్రశ్నించారు.
Next Story