సూర్యలంక వద్ద తీరం దాటిన మిగ్ జామ్ తుపాన్‌


మిగ్ జామ్ తుపాన్‌ ముప్పు కోస్తాకు తప్పింది. మంగళవారం రెండు గంటల ప్రాంతంలో బాపట్ల సూర్యలంక బీచ్‌ వద్ద తుపాన్‌ తీరాన్ని దాటింది. తుపాన్‌ ప్రభావిత జిల్లాలైన ఎనిమిది జిల్లాల్లో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మంగళవారం సాయంత్రం, రాత్రి విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులకు తీవ్ర నష్టం జరిగింది. నష్టం వివరాలు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా వరి ధాన్యం నీటిపాలైంది. గోదావరి జిల్లాలు, బాపట్ల, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

అక్కడక్కడ గుడిసెలు కూలాయి. కొన్ని చోట్ల వంద ఏళ్లనాటి చెట్లు పడిపోయాయి. రోడ్లపక్కన ఉండే పెద్ద చెట్లు వేళ్లతో సహా పెకిలించబడ్డాయి. విద్యుత్‌ శాఖకు బాపట్ల జిల్లాలో ఎక్కువ నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. పండ్లతోటలకు కూడా నష్టం జరిగింది. చాలా వరకు చెట్లు నేలకు వరిగాయి. వర్షం రాత్రంతా ఉండే అవకాశం ఉండటంతో ఈ రోజు పూర్తి స్థాయిలో సహాయ పునరావాస శిబిరాల్లో బాధితులు ఉంటారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలోని తుపాన్‌ బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
ఊహించిన నష్టం లేకుండా..
అధికారులు భారీ స్థాయిలో నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్లు ముందుగా ఊహించారు. అయితే తుపాన్‌ తీరం దాటటం పెద్దగా ప్రభావం కనిపించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృంధాలు బాగా పనిచేశాయి.
రైతులకు ఊహించని నష్టం
కోస్తాలోని ఎనిమిది జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టాలను అంచనా వేసేందుకు బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే ఉన్నతాధికారులు ప్రాధమిక అంచనాలు తయారు చేశారు.
బాపట్ల జిల్లా సూర్యలంక వద్ద తుపాన్‌ తీరాన్ని దాటినందున నష్టం అంచనాలకోసం బృందాలు రంగంలోకి దిగినట్లు బాపట్ల కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా ఫెడరల్‌కు తెలిపారు.


Next Story