ట్విట్టర్  ఎక్కిన  కెసిఆర్... ఫామ్ వదలి జనంలోకి, సోషల్ మీడియాలోకి
x
KCR BUS TOUR

ట్విట్టర్ ఎక్కిన కెసిఆర్... ఫామ్ వదలి జనంలోకి, సోషల్ మీడియాలోకి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా మార్పు వచ్చింది. ఇపుడు ఫామ్ హౌ స్ జనం మధ్యకి,ముఖ్యంగా సోషల్ మీడియాలో దూరారు. అక్కడ ఎం అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి


పదేళ్ల పాటు తెలంగాణ సీఎంగా ఎర్రవెల్లి ఫాంహౌస్, ప్రగతి భవన్‌కే పరిమితమైన కేసీఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్లమెంట్ ఎన్నికల వేళ జనం మధ్యలోకి వచ్చారు.

- బస్సు యాత్ర : ఏప్రిల్ 24వతేదీ నుంచి మే 10 వతేదీ వరకు 17 రోజులపాటు కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలకు శ్రీకారం చుట్టారు. మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, మహబూబ్ నగర్ రోడ్ షోలలో పాల్గొన్న కేసీఆర్ బస్సులో తిరుగుతూ రోడ్ షోలతో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు నాగర్ కర్నూల్ పట్టణంలో కేసీఆర్ రోడ్ షో జరగనుంది.

- సీఎంగా పదేళ్ల పాటు కేసీఆర్ ఎక్కువగా ఎర్రవెల్లి ఫాం హౌస్, ప్రగతి భవన్ కే పరిమితమయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, తెలంగాణ మేథావులకు కూడా కేసీఆర్ అప్పాయింట్ ఇవ్వకుండా దూరంగా ఉన్నారు.
- 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కేసీఆర్ బీఆర్ఎస్ భవన్ కు వస్తానని ప్రకటించినా ఆచరణ రూపం దాల్చలేదు. ప్రమాదం వల్ల తుంటి ఎముక విరిగి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న కేసీఆర్ మళ్లీ ఎర్రవెల్లి ఫాం హౌస్ కే వెళ్లారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. కానీ ఇటీవల బస్సు యాత్రకు ముందు ఓ టీవీ స్టూడియోకు వెళ్లి తాను చేసిన అభివృద్ధి గురించి ఏకరవు పెట్టారు.
- పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు, అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థుల ప్రకటనను కేసీఆర్ ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచే చేశారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కేవలం 17 రోజుల బస్సు యాత్రకు వచ్చిన కేసీఆర్ జనం మధ్య ఉంటారా? లేదా మళ్లీ ఫాం హౌస్ కే వెళతారా అన్నది వేచి చూడాల్సిందే.

ఎక్స్ ఖాతా తెరచిన కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ 24వ అవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ జనం మధ్యకు వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ శనివారం నాడు ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలు తెరిచారు. ఇన్నాళ్లు కేవలం ఫేస్ బుక్ కే పరిమితమైన కేసీఆర్ ఓటమి అనంతరం సోషల్ మీడియా కొత్త ఖాతాలు తెరవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

సోషల్ మీడియా ప్రచారానికే కొత్త ఖాతాలు
కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పేరుతో ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను తెరచి ‘‘బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!’’ మొదటి పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు నాటి తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఫొటోను జత చేశారు. ఈ పోస్టుకు 4,705 లైక్స్ వచ్చాయి. 1213 మంది రీ పోస్టులు చేయగా లక్షమంది నెటిజన్ల నుంచి వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా కేసీఆర్ తన బస్సు యాత్ర, ఎన్నికల ప్రచార సభల సమాచారాన్ని ప్రజలతో షేర్ చేసుకోబోతున్నారు. తెలంగాణ అభివృద్ధిపై, కేసీఆర్ మనవడు కె హిమాన్షు రావుతో సహా పార్టీ నాయకులు, అభిమానుల నుంచి సానుకూల సందేశాలతో కేసీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు నిండిపోయాయి.


Read More
Next Story