బిజెపి అధ్యక్ష పదవికి  కిషన్ రెడ్డి గుడ్ బై ?
x
Telangana BJP Chief G Kishan Reddy ( Image source: X)

బిజెపి అధ్యక్ష పదవికి కిషన్ రెడ్డి గుడ్ బై ?

కొత్త అధ్యక్షుడెవరు? మళ్లీ బండి సంజయ్ వస్తారా? తనని ఉద్వాసన చెప్పిన తీరును బండి సంజయ్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. మరి కొత్త అధ్యక్షుడెవరు? అన్ని ప్రశ్నలే


కేంద్ర పర్యాటక, సంస్కృతి మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవినుంచి నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో వినబడుతూ ఉంది.

నవంబర్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఎనిమిది స్థానాలను గెలుచుకున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. రాష్ట్ర అసెంబ్లీని హంగ్ హౌస్ గా మార్చి, తదుపరి ప్రభుత్వం ఏర్పాటుచేయడంలో కీలక పాత్రవహించేలా బిజెపికి సీట్లు దక్కుతాయని పార్టీ నాయకత్వం భావించింది. అయితే, అలా జరగలేదు. పార్టీ మూడో స్థానంలోకి పడిపోయింది.గత రెండేళ్లుగా , బిఆర్ ఎస్ ప్రత్యామ్నాయం బిజెపియే అని చేసుకుంటూ వచ్చిన ప్రచారం తప్పని ఈ ఎన్నికలు రుజువు చేశాయి.

ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవిని వదులుకోవాలనే నిర్ణయాకి కిషన్ రెడ్డి వచ్చారని, ఈ విషయాన్ని నివేదించేందుకు జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో ఆయన సమావేశమవుతారని తెలిసింది.

అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్ర పార్టీ చీఫ్‌గా ఉండేందుకు మాత్రమే ఆయన అంగీకరించారని, అందుకే ఇప్పుడు ఆ బాధ్యత నుంచి తప్పుకోవానుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ని ఎందుకు మార్చరో ఆ స్థానంలోకి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డిని ఎందుకు తెచ్చారో ఇప్పటికీ పార్టీ నాయకత్వం నుంచి సరైన వివరణ లేదు. ఈ నిర్ణయం పార్టీకి, బిఆర్ ఎస్ కు మధ్య కుదిరిన ఒప్పందం ఫలితమే నన్న ప్రచారం చెలరేగింది. పార్టీ ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా వినిపించిన విమర్శ, బిజెపి, బిఆర్ ఎస్ కు బి టీమ్ అనే.




రాష్ట్ర నాయకత్వ మార్పు నిజానికి ఎవరికీ నచ్చలేదు. బండి సంజయ్ ను తొలగించి అధిష్టానం పెద్ద తప్పుచేసిందనే వాదన సర్వత్రా వినిపించింది. ఈ వాతావరణంలో రాష్ట్ర అధ్యక్షత బాధ్యతలను స్వీకరించడం, అందునా ఎన్నికల సమయంలో దీనికి అంగీకరించడం కిషన్ రెడ్డికి కూడా ఇష్టం లేదని చెబుతారు.

అయితే, అసెంబ్లీ ఎన్నికలవరకైనా ఈ బాధ్యతలను స్వీకరించి, పార్టీని నడిపించాలని నాయకత్వం ఆయన మీద వత్తిడి తీసుకువచ్చిందని అందుకే కిషన్ రెడ్డి అంగీకరించారని పార్టీ వర్గాల వాదన.

అయితే, కిషన్ రెడ్డి పార్టీని నడిపిన తీరు, ఆయన ఎన్నికల ప్రచార సరళి పార్టీ ఎన్నికల మీద పెట్టుకున్న ఆశలను నెరవేర్చేలా కార్యకర్తలను ఉత్తేజపరచలేదనే విమర్శ మొదలయింది. నిజానికి ఆయన ప్రచారం ఏ మాత్రం ప్రభావితం చేయడం లేదనే విమర్శ కూడా మొదలయింది.

సంజయ్ ను మార్చినప్పటినుంచి పార్టీలోపలా, బయటి రాజకీయవర్గాల్లోను ఒకటే చర్చ .. సంజయ్ ను మార్చి తప్పుచేశారని. ఎన్నికల సమయంలో పార్టీ ని నడిపించేందుకు కిషన్ రెడ్డి సరిపోడని. దానికి తోడు కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం కూడా అంత ఉత్తేజంగా సాగలేదని గుర్తించే కేంద్ర నాయకత్వం చాలా మంది నేతలను తెలంగాణ పంపి ప్రచారంచేయించింది. దాాని వల్ల పెద్దగా ఫలితం దక్కలేదు.

అయితే, కిషన్ ను ఎందుకు నియమించారు

బండిసంజయ్ ని మార్చాలనుకున్నాక అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే చర్చ వచ్చింది. అయితే, అపుడు ప్రధానంగా వినిపించిన పేరు ఈటల రాజేందర్ ది. సంజయ్ ని మార్చడం వెనక ఆయన వత్తిడి కూడా ఉందని కొందరు చెబుతారు. "రాజేందర్ పేరు ఒక దశలో దాదాపు ఖరారయింది కొత్తగా పార్టీలోచేరిన వ్యక్తి నాయకత్వం అప్పగిస్తే, ఎప్పటినుంచో పార్టీని నమ్ముకుని వస్తున్న నాయకులకు, కార్యకర్తలకే కాకుండా పాతబస్తీ వంటి ప్రాంతాలలో ఉన్న అభిమానులను నిరుత్సాహపరుస్తుంది. అందువల్ల కొత్తవారిని కాకుండా పార్టీనే నమ్ముకున్నవారికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు," అని సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

ఇపుడు కిషన్ తప్పుకోవాలనుంటున్నారు. దీనికి కారణాలు రెండు, ఒకటి పార్టీ పరాజయం. రెండు వచ్చే ఎన్నికల్లో తాను ఎంపిగా గెలవడం మీద దృష్టి నిలపాలి. అలాంటపుడు పార్టీ ని మరొక ఎన్నికల సీజన్ లో నడపడం కష్టమవుతుంది.

కొత్త వ్యక్తి ఎవరు?

భారతీయ జనతా పార్టీకి ఇదొక పెద్ద సమస్య. సమర్థవంతులైన నాయకులు ఎవరూ కనిపించడం లేదు. సాధారణ పరిస్థితుల్లో పార్టీని ఎవరైనా నడిపిస్తారు. ఎన్నికల సమయం అంటే యుద్ధ సమయం. దీనికి తగిన సత్తా ఉన్నవారికే బాధ్యతలను అప్పగించాలి. అలాంటి వ్యక్తి ఎవరు? ఎందుకంటే, ఎన్నికల్లో పెద్ద వాళ్లంతా ఓడిపోయారు. బండిసంజయ్ ఓడిపోయారు, ఈటెల రాజేందర్ ఓడిపోయారు. ధర్మపురి అర్వింద్ ఓడిపోయారు. అలాగే దుబ్బాక నుంచి పోటీ చేసిన ఎం రఘునందన్ రావు ఓడిపోయారు. బండి సంజయ్ వారసుడి గురించి టాక్ వినబడుతున్నపుడు ఈ పదవి కోసం వీరంతా ప్రయత్నించారు. కాని, ఈ ఎన్నికల్లో ఓడిపోయినందున వారికి ఆ బాధ్యతలను అప్పగించడం పార్టీని నవ్వుల పాలుచేస్తుంది. ఎందుకంటే, కొత్త అధ్యక్షుడు పార్టీని లోక్ సభ ఎన్నికల్లోగెలిచేందుకు నడిపించాలి. ఇదొక పెద్ద సవాల్.

మళ్లీ బండి సంజయ్ వస్తారా

ఈ నేపథ్యంలో మళ్లీ బండి సంజయ్ పేరు ప్రస్తావనకు రావచ్చు. అయితే, ఈ సారి బండి సంజయ్ ఆ బాధ్యతలను స్వీకరించేందుకు ముందుకురాక పోవచ్చని తెలిసింది. ఎందుకంటే, తనని ఎందుకు అధ్యక్ష స్థానం నుంచి తొలిగించారో ఇప్పటికీ ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఫీల్డ్ లో ఎంజరుగుతున్నదో తెలుసుకోకుండా ఎవరో కొందరు చెప్పిన చాడీలు విని తనని తొలగించారని ఆయన ఇంకా ఆవేదన చెందుతూనే ఉన్నారు.

ఆ తర్వాత సంతృప్తి పరించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదా ఇచ్చినా ఆయనకు నచ్చలేదు. సంజయ్ తొలగించిన మరుక్షణం నుంచి పార్టీగ్రాఫ్ పడిపోవడం మొదలయింది. నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఎదిరించేశక్తి బిజెపి కోల్పోయిందని చాలా మంది భావించారు. దీనితో బిజెపి నుంచి కెసిఆర్ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ వైపు మళ్లాయి. దీని పర్యవసానంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం లో బండి సంజయ్ కూడా ఓటమి పాలయ్యారు. ఈ పరాజయ ప్రభావం రేపటి లోక్ సభ ఎన్నికల్లో కూడా పడవచ్చు. అందువల్ల ఆయన కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచేందుకు బాగా కష్ట పడాల్సి ఉంది. అందువల్ల అధ్యక్ష పదవి స్వీకరించాలని అధిష్టానం కోరినా అంగీకరించకపోవచ్చని తెలిసింది.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచి ,రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వచ్చింది. గతంలో బిఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాల మీద గట్టి పోరాటం చేసి బండి సంజయ్ ప్రజల్లో మంచి పట్టు సంపాదించారు. కెసిఆర్ కు ధీటైన నాయకుడనే పేరు వచ్చింది.దీనితో బిజెపి ఆకర్షణ అమాంతం పెరిగిపోయింది. ఇపుడు మారిన పరిస్తితుల్లో బండి సంజయ్ కి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అంతపెద్ద సమస్యలేముంటాయి. కాబట్టి లోక్ సభ ఎన్నికల సమయంలో పార్టీకి నాయకత్వం వహించడం కష్టమని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ గెలిచాక బండి సంజయ్ హుందాగా ప్రవర్తిస్తూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అభినందిస్తూ మంచి వ్యాఖ్యలు చేశారు. :ప్రచార సమయంలో కెసిఆర్ టార్గెట్ గా చేసుకున్నది ఇద్దరినే. అందులో ఒకరు రేవంత్ రెడ్డి అయితే, రెండోది నేను. మేము కెసిఆర్ ని ఎక్స్ పోజ్ చేశాము. ప్రజలు గుర్తించారు. కాంగ్రెస్ కు ఓటు వేశారు. రేవంత్ ను అభినందిస్తున్నాను ఈ విషయంలో," అని అన్నారు. అందువల్ల రెండు మూడు నెలల్లోనే మొదలయ్యే లోక్ సభ ప్రచారంలో రేవంత్ ని టార్గె ట్ చేసి ‘కాంగ్రె స్ వద్దు, డబుల్ ఇంజన్ ముద్దు’ అని ప్రచారం చేయడం కష్టమవుతుంది. అలాంటపుడు మరొక సారి ప్రతికూల వాతావరణంలో పార్టీ బాధ్యత స్వీకరించేందుకు బండి ముందుకు రాకపోవచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మరి బిజెపి ముందున్న కర్తవ్యం

కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా ఒప్పించాలి. లోక్ సభ ఎన్నికలయ్యే దాకా పార్టీ ని నడిపంచాలని, ఆతర్వాత కొత్త నాయకుడిని ఎంపిక చేయడం సులువు అవుతుంది. “లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ మూడో సారి గెలవడం ఖాయం. అపుడు ఆ ఉత్తేజకర వాతావరణంలో పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరైనా ముందుకు వస్తారు. ఇపుడు అసెంబ్లీ ఎన్నికల ఓటమి ప్రభావం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉధృతంగా అమలుచేస్తున్న పథకాలు, కీలకమయిన నిర్ణయాలనేపథ్యంలో బిజెపికి నడిపించేందుకు ఎవరూ ముందుకురారు,” అని ఒక సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు.

బిప్రస్తుతం పార్టీకి కొన్ని ఆప్షన్‌లు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది మిస్టర్ సంజయ్ కుమార్‌ను తిరిగి అధ్యక్షుడిగా తీసుకురాగలదు, అయితే తరువాతి నుండి కరీంనగర్ నుండి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని చవిచూసిన తరువాత, వెనుక నుండి కొంతమంది సీనియర్ల మద్దతుతో కొత్తవారి నుండి నిరంతర ప్రచారం కారణంగా అతను తొలగించబడిన పదవిని ఆక్రమించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మారిన రాజకీయ పరిస్థితులు కూడా మరో కారణం. వివాదాస్పద అంశాలను హైలైట్ చేస్తూ పార్టీని నడిపించినప్పుడు బీజేపీ నాయకుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, సీనియర్ మంత్రి కెటి రామారావు మరియు ఇతరులను నిందించారు.

కానీ, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా జాతీయ సమస్యలు వెలుగులోకి రావచ్చు. అంతేకాకుండా, తన రాజకీయ స్థితిని తిరిగి పొందాలంటే ఆయన మళ్లీ ఎన్నికవ్వాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు సూచించాయి.

Read More
Next Story