కేటీఆర్‌కు దేముడు గుర్తొచ్చాడు!
ఎప్పుడూ ఆస్తికుడినని చెప్పుకునే కేటీఆర్ దేముడి పేరు కూడా ఎత్తారు. కాంగ్రెస్ పార్టీ తమపై చేస్తున్న దుష్ప్రచారాలకు ఆ దేముడుకూడా తగిన శిక్ష విధిస్తాడని అన్నారు.
విద్యుత్ కొనుగోళ్ళ కేసుకు సంబంధించి, విచారణ సంఘానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని నిన్న సుప్రీమ్ కోర్ట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే అసలు విచారణను రద్దు చేయాలని వాదిస్తూ కేసీఆర్ వేసిన పిటిషన్‌ను మాత్రం కోర్ట్ పరిగణనలోకి తీసుకోలేదు. విచారణ చెల్లుతుందన్నట్లుగానే పేర్కొంది. మొత్తం మీద ఇది కేసీఆర్‌కు పాక్షిక విజయం మాత్రమే అయింది.
అయితే, కేటీఆర్ ఇవాళ సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలపై స్పందిస్తూ అదేదో పూర్తిగా తమకు అనుకూలంగా వచ్చినట్లుగా బిల్డప్ ఇచ్చారు. కోర్ట్ ప్రతిష్ఠాత్మక తీర్పు ఇచ్చిందని అన్నారు. సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. త్వరలో ప్రజాక్షేత్రంలో కూడా ఇలాంటి తీర్పే రాబోతోందని అన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, ఎప్పుడూ తాను ఆస్తికుడినని చెప్పుకునే కేటీఆర్ దేముడి పేరు కూడా ఎత్తారు. కాంగ్రెస్ పార్టీ తమపై చేస్తున్న దుష్ప్రచారాలకు ఆ దేముడుకూడా తగిన శిక్ష విధిస్తాడని అన్నారు.
రాజకీయ కక్షలు, ప్రతీకారాలకు కొన్ని పరిమితులు ఉంటాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాంటి ప్రతీకారాలకు ఎక్కువ రోజులు చెల్లవని సుప్రీమ్ కోర్ట్ నిర్ణయం పునరుద్ఘాటిస్తుందని అన్నారు.
మొత్తంమీద కేటీఆర్ ఈ మాత్రం పాక్షిక విజయాన్ని పూర్తిగా అనుకూల విజయంలాగా మాట్లాడటం, మరోవైపు దేముడి పేరు తలుచుకోవటాన్ని అందరూ ఎగతాళి చేస్తున్నారు.