
₹1 లీజు.. ₹500 కోట్ల లోన్! Fab City రహస్యం బయటపడిందా?
ఒకే భూమిపై ప్రభుత్వం vs బ్యాంక్ vs కంపెనీ లీగల్ వార్
హైదరాబాద్‌లోని Fab City SEZ భూమి వివాదం ఇప్పుడు తెలంగాణలో పెద్ద దుమారం రేపుతోంది. ఒకవైపు ప్రభుత్వం భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు SBI బ్యాంక్ ఆ భూమిని తమ రుణానికి సెక్యూరిటీగా పరిగణిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టు ఒక కీలక ప్రశ్న లేవనెత్తింది. "కేవలం ₹200 కోట్ల ప్రాజెక్టుకు సుమారు ₹500 కోట్ల రుణం ఎలా మంజూరు చేశారు?" ఈ ఒక్క ప్రశ్నతో మొత్తం Fab City వ్యవహారం వార్తల్లోకి వచ్చింది.
అసలు Fab City అంటే ఏమిటి?
2006-07 కాలంలో భారత్‌లో సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ దాదాపు లేదు. ప్రపంచంలోని పెద్ద చిప్ తయారీ సంస్థలు అమెరికా, తైవాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లోనే ఉండేవి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో సెమీకండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాలు తీసుకొచ్చింది. భారీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ సమీపంలో Fab City ప్రాజెక్టును ప్రకటించింది. లక్ష్యం ఒక్కటే.ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం.
SEM India Fab కు ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చింది?
అప్పటి ప్రభుత్వం SEM India Fab ను Fab Cityలో ప్రధాన లేదా Anchor Industryగా తీసుకురావాలని భావించింది. అందుకే 100 ఎకరాల భూమిని 66 ఏళ్ల లీజుపై కేటాయించింది. ఎకరానికి సంవత్సరానికి కేవలం ₹1 లీజు రుసుము నిర్ణయించింది. విద్యుత్ సబ్సిడీలు ప్రకటించింది. నీటి సరఫరా హామీ ఇచ్చింది. VAT, CST రీయింబర్స్‌మెంట్ వంటి పన్ను రాయితీలు ఇచ్చింది. SEZ ప్రయోజనాలు కల్పించింది.
ఇక్కడ ప్రభుత్వం ఆలోచన ఏమిటంటే:"ఇప్పుడు భూమి తక్కువ ధరకు ఇచ్చినా, భవిష్యత్తులో వేల కోట్ల పెట్టుబడులు, వేల ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమలు వస్తాయి."
భూమి ఎప్పుడు కేటాయించారు?
అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O. Ms. No. 94, తేదీ 28 ఏప్రిల్ 2007 ద్వారా SEM India Fab Private Limited కు భూమి కేటాయించింది. 100 ఎకరాల భూమి. 66 ఏళ్ల లీజు. కరానికి ఏడాదికి ₹1. 25 జూన్ 2007న లీజు ఒప్పందం అమల్లోకి వచ్చింది. అదే రోజు భూమి స్వాధీనం కూడా అప్పగించారు. అంటే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చాలా ప్రాధాన్యతతో తీసుకుందన్న విషయం ఇక్కడ స్పష్టమవుతుంది.
కంపెనీ ఏమి హామీ ఇచ్చింది?
SEM India Fab మొదటి దశలో Assembly, Testing, Marking & Packaging యూనిట్ ఏర్పాటు చేస్తామని తెలిపింది.తర్వాత పూర్తి స్థాయి సెమీకండక్టర్ ఫ్యాబ్ నిర్మిస్తామని ప్రకటించింది. మొత్తం పెట్టుబడి బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందని చెప్పింది. ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు ద్వారా భారీ పరిశ్రమల ఎకోసిస్టమ్ ఏర్పడుతుందని ఆశించింది.
తర్వాత ఏమైంది?
2007 నుంచి 2010 మధ్య ప్రాజెక్టు కోసం భారీ ప్రకటనలు వచ్చాయి. వేలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. భారీ పెట్టుబడులు వస్తాయని చెప్పారు. కానీ ప్రాజెక్టు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. ప్లాంట్ నిర్మాణం జరగలేదు. వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కాలేదు. అక్కడినుంచే వివాదం మొదలైంది. ప్రభుత్వం భూమిని తిరిగి తీసుకోవాలని అనుకుంది?
ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం, కంపెనీ భూమి కేటాయింపు సమయంలో ఒప్పుకున్న షరతులను పూర్తిగా అమలు చేయలేదు. అందువల్ల 2010-11 ప్రాంతంలో భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే చర్యలు ప్రారంభించింది. అయితే కంపెనీ దీనిని వ్యతిరేకించింది. రుణదాతలు కూడా వ్యతిరేకించారు. దీంతో కేసులు ప్రారంభమయ్యాయి.
ఇప్పుడు ప్రధాన వివాదం ఏమిటి?
ఇప్పుడు ఒకే భూమిపై మూడు వేర్వేరు పక్షాలు హక్కు చెబుతున్నాయి.
1. ప్రభుత్వం చెబుతోందిః "ప్రాజెక్టు అమలు కాలేదు. కాబట్టి భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటాం."
2. SBI చెబుతోందిః "ఈ భూమి మా రుణానికి సెక్యూరిటీ. కాబట్టి మా హక్కులు ముందుగా పరిగణించాలి."
3. కంపెనీ చెబుతోందిః "మేము చట్టబద్ధంగా భూమి తీసుకున్నాం. మాకు హక్కులు ఉన్నాయి."
దీంతో ప్రభుత్వం, బ్యాంకు, కంపెనీ మధ్య పూర్తి స్థాయి లీగల్ క్లాష్ ఏర్పడింది.ఇప్పుడు కేసులో అత్యంత కీలక అంశం రుణం.
హైకోర్టు లేవనెత్తిన ప్రశ్న ఏమిటింటే,
"₹200 కోట్ల ప్రాజెక్టుకు సుమారు ₹500 కోట్ల రుణం ఎలా మంజూరు చేశారు?" ఇది ముఖ్యమైన ప్రశ్న? ఎందుకంటే సాధారణంగా బ్యాంకులు కేవలం ప్రాజెక్ట్ ఖర్చు ఆధారంగా మాత్రమే రుణం ఇవ్వవు. వారు చాలా అంశాలను పరిశీలిస్తారు:
1. భూమి విలువ
2. భవిష్యత్ ఆస్తుల విలువ
3. యంత్రాలు
4. ప్లాంట్
5. ప్రొమోటర్ల గ్యారంటీలు
6. అదనపు కోలాటరల్
7. గ్రూప్ కంపెనీల ఆస్తులు
8. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు
అయితే ప్రాజెక్ట్ ఖర్చు ₹200 కోట్లు మాత్రమే ఉంటే, ఎలాంటి అదనపు భద్రత లేకుండా ₹500 కోట్ల రుణం ఇవ్వడం వెనుక ఏం జరిగింది? అందుకే హైకోర్టు వివరణ కోరుతోంది.
బ్యాంకులు పెద్ద రుణాలు ఎలా మంజూరు చేస్తాయి?
1. Detailed Project Report ను కంపెనీ పూర్తి ప్రాజెక్ట్ రిపోర్టు సమర్పిస్తుంది.
2. Techno-Economic Appraisal నిపుణులు ప్రాజెక్టు సాధ్యాసాధ్యత, మార్కెట్ పరిస్థితులు, ఆదాయం, రిస్క్ విశ్లేషిస్తారు.
3. స్వతంత్ర సంస్థలు భూమి విలువ, యంత్రాల విలువ, ఆస్తుల విలువ అంచనా వేస్తాయి.
4. Credit Approval ఇచ్చేటప్పుడు జోనల్ కమిటీ, కార్పొరేట్ క్రెడిట్ కమిటీ, ,బోర్డు స్థాయి కమిటీ అనుమతులు అవసరం.
5. బ్యాంకు సాధారణంగా Mortgage, Hypothecation, Personal Guarantees తీసుకుంటుంది.
6. రుణం ఇచ్చిన తర్వాత డబ్బు ఎక్కడ ఖర్చవుతోంది?, ప్రాజెక్టు ఎంతవరకు పూర్తయింది? అనేది బ్యాంకు పర్యవేక్షించాలి.
కోర్టు తెలుసుకోవాలనుకుంటున్న అంశాలు:
₹200 కోట్ల ప్రాజెక్టుకు ₹500 కోట్ల రుణం ఎందుకు ఇచ్చారు?
సరైన డ్యూ డిలిజెన్స్ జరిగిందా?
SEZ భూమిని తాకట్టు పెట్టారా?
తాకట్టు పెట్టి ఉంటే చట్టపరమైన అనుమతులు ఉన్నాయా?
రుణం మంజూరు సమయంలో అన్ని నిబంధనలు పాటించారా?ఇవే ప్రస్తుతం విచారణలో ఉన్న ప్రధాన ప్రశ్నలు.
SEM India Fab కంపెనీకి సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న పబ్లిక్ రికార్డులు, MCA డేటా, కోర్టు పత్రాల ప్రకారంBandaru Venkaiah Naidu, Pratap Srinivasa Kondamoori, Rajendra Manikonda, Vinod Kumar Agarwal డైరెక్టర్‌గా ఉన్నట్లు పేర్లు కనిపిస్తున్నాయి.
ఈ కేసులో ప్రధాన ప్రశ్న భూమి వివాదం మాత్రమే కాదు. 2007లో సెమీకండక్టర్ పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇచ్చింది. 100 ఎకరాల భూమిని కేవలం ఎకరానికి సంవత్సరానికి ₹1 లీజుపై కేటాయించింది. కానీ ప్రాజెక్టు ఆశించిన స్థాయిలో అమలు కాలేదన్న ఆరోపణలతో భూమి వివాదం మొదలైంది. ఇప్పుడు అదే వివాదం మరో కీలక ప్రశ్న వద్దకు చేరుకుంది. "₹200 కోట్ల ప్రాజెక్టుకు ₹500 కోట్ల రుణం ఎలా మంజూరైంది?" బ్యాంకు అన్ని నిబంధనలు పాటించిందా? భూమిని చట్టబద్ధంగా సెక్యూరిటీగా తీసుకున్నారా? ప్రభుత్వం భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికిన తర్వాతే Fab City కేసులో అసలు చిత్రం పూర్తిగా స్పష్టమవుతుంది.

