బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలంగాణలో 7 రోజులపాటు విస్తారంగా వర్షాలు
x

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలంగాణలో 7 రోజులపాటు విస్తారంగా వర్షాలు

తెలంగాణలో రాగల ఏడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు సోమవారం విడుదల చేసిన వెదర్ రిపోర్టులో తెలిపారు.


చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు, ద్రోణి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలంగాణ రాబోయే ఏడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం హెడ్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గత రెండు రోజులుగా ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఎత్తు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఈ నెల 25వతేదీనాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర, కోస్తా తీరాల్లో ఈ నెల 26వతేదీన వాయుగుండంగా మారి వర్షాలు కురిసే అవకాశముందని ఆమె వివరించారు.


11 జిల్లాల్లో నేడు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాస్ట్రంలో సోమవారం నుంచి రాగల ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆకాశపు ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సెప్టెంబరు 22 వతేదీ నుంచి 28వతేదీ వరకు వర్షాలు విస్తారంగా కురవవచ్చని ఆయన తెలిపారు. సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని ధర్మరాజు తెలిపారు. ఈ సందర్భంగా 11 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించామని ఆయన చెప్పారు. ఉరుములు, మెరుపులతో వర్షంతోపాటు ,గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఆయన వివరించారు. సెప్టెంబరు 23,24, 25,26,27,28తేదీల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

హైదరాబాద్ లోనూ వచ్చే 24 గంటల్లో వర్షాలు
హైదరాబాద్ నగరంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయని డాక్టర్ ఎ ధర్మరాజు చెప్పారు. నగరంలో గరిష్ఠ ఉష్షోగ్రత 31 డిగ్రీల సెల్షియస్, కనిష్ఠ ఉష్షోగ్రత 21 డిగ్రీల సెల్షియస్ ఉంటుందని ఆయన చెప్పారు.

రేపు భారీవర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్,హనమకొండ, జనగాం, సిద్ధిపేట్ జిలాల్లో అకకడక్కడ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధకారులు చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబరు 24 వతేదీన కొమరంభం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వివరించారు.

అల్పపీడనం ప్రభావంతో భారీవర్షాలు
అల్పపీడనం ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబరు 25, 26,27 తేదీల్లో భారీవర్షాలు కురిసేఅవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. అతి భారీవర్షాల వల్ల హైదరాబాద్ నగరంతోపాటు సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో వరదలు సంభవించే అవకాశముందని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ఉత్తర తెలంగణ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసేఅవకాశం ఉందని తెలిపారు.


Read More
Next Story