రేవంత్ కి మావోయిస్టు పార్టీ 15 డిమాండ్లు. అవేంటంటే...
x
పథకాలకు నిధులెలా వస్తాయో ప్రజలకు తెలియచేయాలని రేవంత్ కు మావోయిస్టు పార్టీ సలహ

రేవంత్ కి మావోయిస్టు పార్టీ 15 డిమాండ్లు. అవేంటంటే...

ధరణి యాప్ నే కాదు, ఆ హరితహారాన్ని కూడా ఎత్తేయండంటున్నది మావోయిస్టు పార్టీ. ఎందుకంటే...


బిఆర్ ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమాన్ని వెంటనే రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. హరిత హారాన్ని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాలా ప్రతిష్టాత్మకంగా, తెలంగాణనంతా అకుపచ్చవనంలాగా తీర్చిదిద్డడం పేరుతో అమలుచేస్తూ వచ్చారు. ఆయన మేనల్లుడు, రాజ్యసభ ఎంపి సంతోష్ కుమార్ కి ఈ కార్యక్రమానికి అప్పగించారు.

ఈ కార్యక్రమాన్ని మొక్కలు పెంచే పవిత్ర కార్యక్రమంగా చూపేందుకు సినిమా సెలెబ్రీటీలతో ఒక మొక్కనాటించి పబ్లిసిటీ ఇప్పించేవారు. సంతోష్ ని తెలంగాణ వనపోషకుడిగా తయారుచేశారు.

అయితే, రాష్ట్రంలో మిగులు భూములను ఆక్రమించుకుంటున్న హరితాహారం పట్ల మావోయిస్టు పార్టీ వ్యతిరేకత వ్యక్తం చేసింది. ప్రభుత్వ , బంజరు భూములను వ్యవసాయ కూలీలకు పంచాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అభిప్రాయపడింది.

గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇలాంటి ప్రతిపాదనే చేశారు. భూమి లేని ప్రతిపేదకుటుంబానికి మూడెకరరాల భూమి ఇస్తానని కూడా చెప్పారు. తర్వాత ఆయన ఆప్రస్తావనే మర్చి పోయారు.

ఈ నేపథ్యంలో భమిలేని పేదలకు, వ్యవసాయకూలీలకు మిగులు భూములను పంచాల్సిన అవసరాన్ని మావోయిస్టు పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుర్తు చేసింది.

అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే జాబ్ క్యాలెండర్ ప్రకటించి లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామిని ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశాలు కల్పించాలాని, ఎస్సీ , ఎస్టీ , బీసీ మైనార్టీ విద్యార్థులకు విద్య అవకాశాలను ఉచితంగా కల్పించాలని వత్తిడి తీసుకురావాలని మావోయిస్టు పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ నేడొక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన పార్టీ అధికార ప్రతినిధి జగన్ సంతకంతో విడుదలయింది.

కెసిఆర్ హరిత హారం చాలా బీభత్సాన్ని కూడా సృష్టించింది. ఇదంతా పచ్చదనం కింద కనిపించకుండా పోయింది. చాలా చోట్ల హరిత హారం కోసం తరతరాలు సాగుచేసుకుంటున్న గిరిజనుల భూములను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, దీనిని అడ్డుకోబోయిన వారి మీద కేసులు పెట్టారు. ఈ విషయాన్ని మావోయిస్టూ గుర్తు చేస్తూ హరిత హారాన్ని రద్దు చేసి ఆదివాసులపై వున్న కేసులను ఎత్తివేయాలని ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు 2008 ఆటవి హక్కుల చట్టం ప్రకారం లబ్ది దారులకు పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి సూచించింది.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం ప్రెస్ మీట్ లో ‘ప్రజలే పాలకులు , మేము సేవకులం’ అంటూ కాంగ్రేస్ పాలన ప్రజాస్వామ్య పాలన అన్నట్లుగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ మావోయిస్టు పార్టీ 15 డిమాండ్లను రేవంత్ ముందుంచింది.

డిమాండ్లు

1. హరిత హారం రద్దు చేయాలి.

2. భూస్వాములకే బాగా ఉపయోగపడుతున్న ధరణి యాప్ ను రద్దు చేయాలి.

3. రుణాలు మాఫీ , రైతు బంధు పేరిట ప్రజా ధనాన్ని భూస్వాములకు పంచే విధానాన్ని నిలిపి వేసి పేద , మధ్య తరగతి రైతులకు , కౌలు రైతులకు రైతు బంధు వర్తింప చేయాలి.

4. రైతు పండించిన పంటలకు మండీలు ఏర్పర్చి న్యాయమైన ధర కల్పించాలి.

5. రాష్ట్రంలో మిగులు భూములను , ప్రభుత్వ , బంజరు భూములను వ్యవసాయ కూలీలకు పంచాలి.

6. ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ప్రజల నిర్వాసిత సమస్యను పరిష్కరించాలి.

7. ఆదివాసీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి , జల్ - జంగిల్ - జమీన్ పై పూర్తిగా ఆదివాసులకే అధికారం కల్పించాలి. ఆదివాసీల చట్టాలకు విరుద్ధంగా ఏర్పరుస్తున్న పోలీస్ క్యాంపులను ఎత్తియాలి.

8. పెసా చట్టాన్ని , 5 వ , 6 వ షెడ్యూల్డ్ చట్టాలను , ఆప్ 70 చట్టాన్ని. జీవో నెంబర్ 3 ని అమలు చేయాలి

9. ప్రభుత్వ రంగ సంస్థలను రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పాలి.

10. ఆర్టీసి ప్రవేట్ కరణను నిలిపి వేయాలి.

11. ఓపెన్ కాస్టుల మైనింగ్ రద్దు చేయాలి.

12. ఉత్పత్తి రంగాల్లో కాంటాక్టు కార్మికులను , ఔట్ సోర్సింగ్ కార్మికులను , క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. డిపెండెంట్ ఉద్యోగులను వెంటనే భర్తీ చేయాలని ,

13. కాజిపేట్ లో రైలు కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి

14. ప్రజా ఉద్యమకారులపై అర్బన్ నక్సలైట్లు , కలంథారి మావోయిస్టులంటూ ముద్ర వేస్తూ వారిని అక్రమ కేసుల్లో ఇరికించి ఊపా చట్టం , ఎస్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి వాటిని నిలిపి వేయండి.

ధ్15. ధర్నా చౌక్ ను ఎలాంటి ఆంక్షలు లేకుండా పునరుద్దరించండి. పౌర హక్కులకు , స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగని కనీసం చట్టబద్ధ పాలన అయినా కొనసాగించమని ప్రజలు కోరుతున్నారు.

ఇదే విధంగా ప్రకటించిన పథకాలన్నీ అమలు చేసేందుకే అనే చిత్త శుద్ధిని నిరూపించేందుకు ప్రయత్నించాలని మావోయిస్టు పార్టీ కోరింది.

“మహలక్ష్మీ రైతు భరోసా , గృహ జ్యోతి , ఇందిరమ్మ ఇళ్ళు , యవ వికాసం , చేయూత ఆరు గ్యారంటీల ఉచితాలు ప్రకటించారు. వీటి వెనక వున్న ఉచితాల అంతర్యంను మనం అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుంది. పేదరికంలో మగ్గుతున్న వారి ఆధాయ వనరులు పెంచి పేదరికాన్ని నిర్మూలించి జీవిత భద్రతకు గ్యారంటి ఇవ్వకుండా ఇప్పటికే 5 లక్షల్లో కోట్ట అప్పుల్లో వున్న రాష్ట్రంలో ఉచిత స్కీమ్ లను అమలు చేస్తామంటున్నారు. వీటికి ఎక్కడి నుండి నిధులు సమకూర్చుతారనేది ప్రజలు కూడా ఆలోపించాలంచాలి,అని మావోయిస్టు పార్టీ కోరింది.


Read More
Next Story