Meerpet Woman Case |‘గురుమూర్తి పథకం ప్రకారమే భార్యను చంపాడు’
తన భార్య వెంకటమాధవిని అత్యంత కిరాతకంగా హతమార్చి ఆనవాళ్లు లేకుండా చేసిన మాజీ జవాన్ గురుమూర్తిని రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
తన భార్య వెంకటమాధవిని హతమార్చిన మాజీ జవాన్ గురుమూర్తిని రాచకొండ పోలీసులు సీపీ కార్యాలయానికి తీసుకువచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టారు. భార్య వెంకటమాధవిని గోడకేసి కొట్టి, గొంతు నులిమి కిరాతకంగా హతమార్చాడని దర్యాప్తులో తేలిందని రాచకొండ పోలీసు కమిషనర్ జి సుధీర్ బాబు చెప్పారు. భార్యతో గొడవపడి చంపాడని సీపీ తెలిపారు. జనవరి 15,16 తేదీల్లో భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో పథకం ప్రకారమే గురుమూర్తి భార్యను హత్య చేశాడని తేలింది. హత్యకు పథకం ప్రకారమే ముందే పిల్లల్ని సోదరి ఇంటికి పంపించాడు. హత్యానంతరం మృతదేహాన్ని డిస్పోజ్ చేసి, పిల్లల్ని తీసుకువచ్చి రెండు రోజులు గడిపాడని సీపీ చెప్పారు. భార్యను హత్య చేసిన గురమూర్తిలో ఎలాంటి పశ్చాతాపం లేదని సీపీ చెప్పారు. మీ మమ్మీ నాతో గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని గురుమూర్తి పిల్లల్ని నమ్మించాడని సీపీ వివరించారు.భార్యను చంపి, ముక్కలు చేసి వాటి ఆనవాళ్లు లేకుండా చేశాడని, గురుమూర్తి కిరాతక వ్యక్తి అని సీపీ చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం...