‘పార్టీ కోరితే సంతోషంగా రాజీనామా చేసేదాన్ని’
x

‘పార్టీ కోరితే సంతోషంగా రాజీనామా చేసేదాన్ని’

తనపై జరిగిన దాని ఘటనలో తాను ఎవరిని క్లీన్ చిట్ ఇవ్వడం లేదని ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ స్పష్టం చేశారు.


తనపై జరిగిన దాని ఘటనలో తాను ఎవరిని క్లీన్ చిట్ ఇవ్వడం లేదని ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లినపుడు ఆయన సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని మలివాల్ ఆరోపించిన విషయం తెలిసిందే.

దాడి ఘటనను గుర్తుచేసుకుంటూ..

“ఆ రోజు కేజ్రీవాల్ ఇంటికి వెళ్లాను. ఆయన ఇంట్లో ఉన్నారని, నన్ను కలవడానికి వస్తున్నారని చెప్పారు. ఇంతలో గదిలోకి వచ్చిన బిభవ్ కుమార్‌ను అరవింద్ జీ వస్తున్నారా? అని అడిగాను. ఆయన నాపై దాడి చేయడం ప్రారంభించాడు. నన్ను ఏడెనిమిది సార్లు గట్టిగా కొట్టాడు. నేను ఆయనను నెట్టడానికి ప్రయత్నించినా.. నా కాలు పట్టుకొని లాగాడు. నా తల సెంటర్ టేబుల్‌కి తగిలింది. నేను గట్టిగా అరుస్తూనే ఉన్నా. కానీ ఎవరూ నన్ను రక్షించలేదు.” అని ఎంపీ విలేఖరులకు వివరించారు.

బిభవ్ కుమార్ ఎవరి సూచనలను పాటిస్తున్నారని అని అడిగిన ప్రశ్నకు..“ఇది దర్యాప్తు విషయం. నేను ఢిల్లీ పోలీసులకు సహకరిస్తున్నాను. దాడి జరిగినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు. నేను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వడం లేదు.’’ అని సమాధానమిచ్చారు.

‘‘పార్టీ కోరితే రాజ్యసభకు సంతోషంగా రాజీనామా చేసేదాన్ని. ఇప్పుడు రాజీనామా చేయను. వారు నా క్యారెక్టర్‌ను కించపర్చారు. బీజేపీ ఏజెంట్ గా ముద్రవేశారు. నేను ఇప్పుడు నిష్క్రమించను. మరింత కష్టపడి పనిచేస్తా. ఆదర్శ పార్లమెంటేరియన్ అవుతా.’’ అని చెప్పారు.

మలివాల్ ఆరోపణలపై కేజ్రీవాల్ బుధవారం మాట్లాడారు. "న్యాయమైన విచారణ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. న్యాయం జరగాలి. పోలీసులు ఇద్దరివైపు న్యాయబద్ధంగా విచారణ జరిపి న్యాయం చేయాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

అయితే తన క్యారెక్టర్‌ను తప్పుబట్టి, బిజెపి ఏజెంట్‌గా ముద్రవేసిన వ్యక్తి ఇప్పుడు స్వేచ్ఛ, నిష్పాక్షిక విచారణ అని మాట్లాడడం హాస్యాస్పదమని మలివార్ పేర్కొన్నారు.

Read More
Next Story