వాలంటైన్స్ డే రోజు ఓయో రూమ్స్ బుకింగ్ జోరు
ఓయో రూమ్స్ యువతకు స్వర్గథామంగా మారాయి. ఫిబ్రవరి 14వతేదీ వాలంటైన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఓయో రూమ్స్ రికార్డు స్థాయిలో బుక్ అయ్యాయి...
ఏడాదికి ఒకసారి వచ్చే వాలంటైన్స్ డేను సంవత్సరం పాటు మర్చిపోలేని మధుర స్మృతిగా మలుచుకునేందుకు ప్రేయసీ, ప్రియులు, దంపతులు, ప్రేమ పక్షులు ఓయో రూమ్స్ కు తరలివచ్చారని ఓయో బుకింగ్ రికార్డులే చెబుతున్నాయి. ప్రేమికుల దినం సందర్భంగా రికార్డు స్థాయిలో హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవడమే కాకుండా అంతే స్థాయిలో కండోమ్‌లు కొనుగోలు చేసినట్లు తాజాగా వెల్లడి కావడం సంచలనం రేపింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రైవేట్ హోటల్స్, రిసార్టులు, పబ్స్, ఓయో రూమ్స్ బుకింగుల్లో డిస్కౌంట్లు ప్రకటించడంతో ఈ ఏడాది ప్రేమికులతోపాటు దంపతులు కూడా ముందుకు వచ్చి ఓయో రూమ్స్ లో ఆనందంగా గడిపారని ట్రావెల్ ఒపీడియా నివేదికలో వెల్లడైంది.
ఓయో రూమ్స్ పై వ్యతిరేకత
వాలంటైన్స్ డే సందర్భంగా ఓయో రూమ్స్ బుకింగ్ చేసుకోవడంతోపాటు కండోమ్ ల విక్రయాలు కూడా గణనీయంగా పెరిగాయని వెల్లడైంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సాధారణం కంటే వివిధ రకాల కంపెనీల కండోమ్‌ల విక్రయాలు విపరీతంగా జరిగాయని హైదరాబాద్ నగరంలోని భగవాన్ మెడికల్ స్టోర్ యజమాని ఆర్ సురేష్ చెప్పారు. వాలంటైన్స్ డే మన సంస్కృతీ సంప్రదాయాలకు విరుద్ధమని, విదేశీ సంస్కృతిని మనం అవలంభించడం తగదని హిందూ సంస్థ నాయకుడు మల్కాజిగిరికి చెందిన విఠోభా చెప్పారు. ఓయో రూమ్ లలో యువతీ యువకులు గడపటం మంచి పద్ధతి కాదని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) నాయకురాళ్లు వ్యాఖ్యానించారు.
ఓయో రూమ్స్ బుకింగుల్లో హైదరాబాద్ నంబర్ వన్
హైదరాబాద్ నగరం ఓయో రూమ్స్ బుకింగ్స్‌లో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. వాలంటైన్స్ డే కావచ్చు...డిసెంబర్ 31 లేదా కొత్త సంవత్సరం జనవరి 1వతేదీ కావచ్చు... సందర్భం ఏదైనా ఓయో రూమ్స్ ప్రేయసీప్రియులతో కిటకిటలాడాయని ట్రావెల్ ఒపీడియా నివేదిక బహిర్గతం చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా బుక్ చేసుకోవడంతోపాటు ప్రైవసీగా గడిపేందుకు ఓయో రూమ్స్ అనువుగా ఉండటంతో హైదరాబాదీలు ఎక్కువగా వీటిని బుక్ చేసుకుంటున్నారని తేలింది. ఓయో గదులను ప్రేమికుల కోసం ముస్తాబు చేశామని హైదరాబాద్ నగరానికి చెందిన ఓ హోటల్ మేనేజర్ లక్ష్మణ కుమార్ చెప్పారు.హోటల్ గదులను ఎక్కువ బుక్ చేసుకున్న రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉత్తర ప్రదేశ్ ఉంది. ఆ తర్వాత ఓయో బుకింగుల్లో వరుసగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.
ట్రావెల్ ఒపీడియా రిపోర్టులో వెల్లడైన ఓయో జోరు
దేశవ్యాప్తంగా ఓయో రూమ్స్ బుకింగ్‌లో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా నగరాలు ముందున్నాయని ట్రావెల్ ఒపీడియా రిపోర్ట్ తెలిపింది. చిన్నపట్టణాల విభాగంలో ఓయో రూమ్స్ బుకింగుల్లో వరంగల్ ముందుంది. వరంగల్ తర్వాత గోరఖ్‌పూర్,గోవా, మైసూర్, పుదుచ్చేరి పట్టణాల్లో ఓయో రూమ్ ల బుకింగ్ జోరుగా సాగింది. దిఘా, ఏఫీలో గుంటూరులోనూ ఓయో బుకింగ్స్ ఊపందుకున్నాయని వెల్లడైంది. ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో జైపుర, గోవా, మైసూర్, హరిద్వార్, పూరి, అమృత్ సర్, హరిద్వార్ వారణాసి, పళని పట్టణాల్లో ఓయో గదులు భక్తులతో కిటకిటలాడాయి. యూపీ, తెలంగాణ, మహారాష్ట్ర ఓయో గదుల బుకింగ్ లో ముందున్నాయి.
సందడిగా మారిన ఓయో రూమ్స్
బెంగళూరు, హైదరాబాద్,కోల్‌కతా ఉండగా,చెన్నై, ముంబయితోపాటు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలైన గోవా, మనాలీ,బృందావనం పట్టణాల్లో ఓయో గదులు సందడిగా మారాయి. వాలెంటైన్స్ డే సమయంలో ఓయో రూమ్స్‌లో గతంలో రెండు రోజులు ఉండగా... ఈ ఏడాది అది 4 రోజులకు పెరిగిందని సర్వేలో తేలింది. అందుబాటు ధరల్లో ఏసీ, వైఫై లాంటి సదుపాయాలతో హోటల్ గదులను అందించడంతో ఓయో ముందుంది. గత ఏడాది డిసెంబర్ 31వతేదీన రికార్డు స్థాయిలో ఒక్క రోజే ఏకంగా 4.5 లక్షల ఓయో రూమ్ బుకింగ్స్ జరిగాయి.ఇప్పుడు ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా కూడా ఓయోకు మంచి డిమాండ్ వచ్చింది. కుటుంబంతో, స్నేహితులతో, తమకు ఇష్టమైన వారితో ఓయో రూముల్లో గడిపేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని ఓయో ప్రతినిధి ఒకరు చెప్పారు.
కండోమ్‌ల విక్రయాల జోరు
వాలెంటైన్స్ డే సందర్భంగా ఓయో రూమ్ బుకింగ్స్ గత ఏడాది కంటే 35 శాతం పెరిగాయని ఓయో పేర్కొంది. వాలెంటైన్స్ డే రోజున ఎక్కువగా ఓయో రూమ్స్ బుకింగ్స్ బృందావనంలోనూ అయ్యాయి. 2024వ సంవత్సరం జనవరి 1వతేదీన ఓయో రూం బుకింగులు రికార్డు స్థాయిలో జరిగాయి. జనవరి 1వతేదీ ఒక్కరోజే 6.2 లక్షల ఓయో రూమ్స్ బుకింగ్ కాగా, గంటకు 1700 కండోమ్స్ ఆర్డర్లు వెల్లువెత్తాయని తేలింది. ఈ ఏడాది గోవా, హైదరాబాద్, నైనిటాల్ నగరాల్లో మద్యం అమ్మకాల్లో రికార్డు స్థాయిలో జరిగాయి. శృంగారంలో పాల్గొనేటప్పుడు కండోమ్‌లను ఉపయోగించాలని వైద్యులు సలహా ఇస్తుండటంతో ఎక్కువ మంది వీటిని వాడారు. వాలెంటైన్స్ డే సందర్బంగా హోటల్ వ్యాపారంతో పాటు కండోమ్ ల వ్యాపారం బాగా జరిగిందని వెలుగు చూడటంతో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.