కార్ల్‌సెన్‌తో తలపడడం నాకు సవాల్ కాదు: ప్రజ్ఞానానంద
మే 27 నుంచి ప్రారంభమయ్యే నార్వే చెస్ టోర్నీలో ఇండియా నుంచి యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రగ్నానంద, ఆయన చెల్లెలు ఆర్. వైశాలి పాల్గొంటున్నారు.
నార్వే చెస్ టోర్నమెంట్ మే 27న మొదలవుతోంది. జూన్ 7 వరకు జరిగే ఈ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్, హికారు నకమురా, కార్ల్‌సెన్ తదితరులు పాల్గొంటున్నారు. ఇండియా నుంచి యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రగ్నానంద, తన చెల్లెలు ఆర్. వైశాలి ఆడబోతున్నారు.
మాగ్నస్ కార్ల్‌సెన్‌తో తలపడనున్న ప్రగ్నానంద..
ప్రముఖ క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్‌సెన్‌తో తన సొంతగడ్డపై ప్రగ్నానంద తలపడబోతున్నారు. " మాగ్నస్‌తో అతని సొంతగడ్డ మీద తలపడడం.. సవాల్‌గా భావించడం లేదు.గత ఏడాది ప్రపంచ కప్ తర్వాత అతనితో ఇది నా మొదటి క్లాసికల్ గేమ్.నేను ఎప్పుడూ మంచి ఛాలెంజ్‌ని ఆస్వాదిస్తాను " అని ప్రజ్ఞానంద అన్నారు.
ఈ నెల ప్రారంభంలో వార్సాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరిగిన సూపర్‌బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద 33 ఏళ్ల కార్ల్‌సెన్‌ను ఓడించాడు.
నార్వే చెస్‌లో పాల్గొనేవారి జాబితా:
పురుషుల విభాగం: మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే), ఫాబియానో కరువానా (యుఎస్‌ఎ), హికారు నకమురా (యుఎస్‌ఎ), డింగ్ లిరెన్ (చైనా) అలిరెజా ఫిరౌజ్జా (ఫ్రాన్స్), ఆర్. ప్రగ్నానంద రమేష్‌బాబు
మహిళల విభాగం: కోనేరు హంపీ (భారత్), లీ టింగ్జీ (చైనా), జు వెన్జున్ (చైనా), అన్నా ముజిచుక్ (ఉక్రెయిన్), ఆర్. వైశాలి (భారత్), పియా క్రామ్లింగ్ (స్వీడన్).