సలార్.. బాహుబలిని బ్రేక్ చేస్తుందా!
సలార్ కథ మహాభారతమా, కేజీఎఫ్పా. టీవీల నిండా ఇదే చర్చ.. మరోపక్క ఈ మూవీపై భారీ అంచనాలు.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ ని మించిపోతుందని టాక్..
బాహుబలిని బ్రేక్ చేస్తుందని ఒకరంటే ఆర్ఆర్ఆర్ ని మించిపోతుందని ఒకరంటున్నారు. మరి సలార్ తో ప్రభాస్ ఆ రికార్డులను బ్రేక్ చేస్తాడా లేదో చూడాలి. ఇక సలార్ స్పెషల్ షోలు, టికెట్ రేట్లు విషయానికి వస్తే.. తెలంగాణలో స్పెషల్ షోలకు అనుమతిని ఇచ్చారు. టికెట్ల ధరలు పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ అనుమతి ఇచ్చాయి.
థియేటర్ల వద్ద సందడి షురూ..
సలార్ సందడి మొదలైంది. థియేటర్ల వద్ద క్యూలు పెరిగాయి. పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. హైదరాబాద్ కూకట్ పల్లి విశ్వనాధ్ థియోటర్ వద్ద కొందరికి తలలు పగిలాయి. ఏమైనా ఈ సినిమా ఓ రేంజ్ లో ఉండబోతోందని అంటున్నారు.
తెలంగాణ థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ టికెట్స్ ని థియేటర్స్ వద్దనే అమ్ముతామని ప్రకటించింది. టికెట్ల బుకింగ్స్ ని ఓపెన్ చేసింది. దీంతో టికెట్స్ బుక్ చేసుకునేందుకు థియేటర్స్ వద్ద అభిమానులు బారులు తీరారు. అక్కడ కోలాహలం చూస్తుంటే సినిమా ఇప్పటికే రిలీజ్ అయిందా అనిపిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మూవీ రైట్స్ లో ఆర్ఆర్ఆర్ రికార్డ్ బద్దలు..
సలార్ సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డుని బ్రేక్ చేసిందట. సలార్ తెలుగు టీవీ రైట్స్ ని స్టార్ మా దాదాపు రూ.22 కోట్లకు కొనుగోలు చేశారట. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా టీవీ రైట్స్ అన్ని భాషల్లో కలిపి 25 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. కేవలం టీవీ రైట్స్ మాత్రమే కాదు. మొత్తం డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ లోను సలారే టాప్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ 325 కోట్లకు అమ్ముడుపోతే, సలార్ 350 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇలా అన్ని విషయాల్లో సలార్ మూవీ ఆర్ఆర్ఆర్ రికార్డుని బ్రేక్ చేసిందని చెబుతున్నారు.
బాహుబలిని మించిపోయిందట..
బాహుబలి కలెక్షన్స్ రికార్డుని బ్రేక్ చేయడం ఆర్ఆర్ఆర్ కి కూడా సాధ్యం కాలేదు. మరి సలార్ తో ప్రభాస్ ఆ రికార్డులను బ్రేక్ చేస్తాడా లేదా అనేది చూడాలి. ఇక సలార్ స్పెషల్ షోలు, టికెట్ రేట్లు విషయానికి వస్తే.. తెలంగాణలో స్పెషల్ షోలకు అనుమతిని ఇచ్చారు. మొదటిరోజు మొత్తం ఆరు షోలు పడబోతున్నాయి. కొన్ని సెలెక్టెడ్ చేసిన థియేటర్స్ లో తెల్లవారుజామున ఒంటిగంట షో కూడా వేయనున్నారు. సాధారణ టికెట్ రేట్లుతో పోలిస్తే.. మల్టీఫెక్స్ ల్లో రూ.100, సాధారణ థియేటర్లలో రూ.55 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు.
ఏపీలో రూ.40 పెంచుకోవచ్చు...
ఆంధ్రప్రదేశ్ లో 10 రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో రూ.40 రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.
ప్రధాన పాత్రల్లో ప్రభాస్, శృతి హసన్..
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా సలార్. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన యాక్షన్ కట్ ట్రైలర్ ఆడియన్స్ లో సినిమా పై భారీ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీని థియేటర్స్ లో ఎప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యిపోయాయి.
మూల కథ మహాభారతమేనా...
సలార్ కథ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మహాభారతాన్ని మార్చి సలార్ సినిమాని తెరకెక్కించారట.ఈ సినిమా ఇద్దరు ప్రాణ మిత్రులు శత్రువులుగా ఎలా మారారు అనే కథాంశంతో వస్తుందని ప్రశాంత్ నీల్ ఇప్పటికే చెప్పేశారు. ఇప్పుడు ఈ పాయింట్ ని చూపిస్తూనే మహాభారతంతో పోలుస్తున్నారు. మహాభారతంలో దుర్యోధనుడు, కర్ణుడు స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పు అన్ని తెలిసినా తనని నమ్మిన మిత్రుడు కోసం కర్ణుడు చివరి వరకు తోడుగా నిలిచి ప్రాణాలు విడిచారు.
దుర్యోధనుడిని కర్ణుడు ఎదిరిస్తారా?
సూక్ష్మంగా సలార్ కథా సారాంశం ఇదేనని అంచనా. దుర్యోధనుడు చేసిన తప్పుని కర్ణుడు ప్రశ్నించి, ఎదురిస్తే అది సలార్ కథ అని తెలుస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కోసం ఫైట్ చేసే ప్రభాస్‌కి.. ఆ మిత్రుడు చేసే పనులు నచ్చకపోవడంతో ఎదురు తిరుగుతాడు. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్న టీంను ఆనంద్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సలార్ చిత్రాన్ని మహాభారతంతో పోల్చి చెప్పారు. సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య స్నేహం చాలా ఎమోషనల్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. బాహుబలిలో రాముడి వంటి పాత్రలో కనిపించిన ప్రభాస్.. ఇప్పుడు సలార్ లో కర్ణుడు వంటి పాత్రలో కనిపించబోతున్నారు. బాహుబలి తరువాత మళ్ళీ అలాంటి విజయం లేని ప్రభాస్‌కి సలార్ ఆ రేంజ్ హిట్ ఇస్తుందా లేదో చూడాలి
కేజీఎఫ్ మాదిరిగా ఉంటుందని మరో టాక్..
సలార్ కథపై మరో రూమర్ కూడా బయటకి వచ్చింది. అది ఈ సినిమా కథ సూపర్ డూపర్ హిట్ అయిన కేజీఎఫ్ లా ఉంటుందని ప్రచారం సాగుతోంది. సలార్ ట్రైలర్ చూసిన వారికి కేజీఎఫ్ సీన్లు గుర్తుకువచ్చాయట. ఈ ప్రచారం నెట్టింట బాగానే హల్ చల్ కావడంతో సలార్ నిర్మాతలు ఇప్పుడు రంగంలోకి దిగారు. కేజీఎఫ్ కి సలార్ సినిమాకి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెబుతూ టీవీలలో ప్రచారం ప్రారంభించారు. తాము ఈప్రచారాన్ని ఇప్పటికే తిప్పి కొట్టి ఉండాల్సిందంటున్నారు.
https://youtu.be/ahb3H9ENKwo?feature=shared