తెలంగాణ నుంచి లోక్ సభకు సోనియా పోటీ,  రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు
x
సోనియా గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే

తెలంగాణ నుంచి లోక్ సభకు సోనియా పోటీ, రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు

గతంలో ఇలాగే ఇందిరా గాంధీని కూడా ఆహ్వానించారు. 1980 లోక్ సభ ఉప ఎన్నికల్లో ఆమె పోటీచేశారు. గెలుపొందారు.


వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) పోటీ చేయాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ( పీఏసీ) ఏకగ్రీవ తీర్మానం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిన్న హైదరాబాద్ లోకి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో జరిగింది. తెలంగాణ్ ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే (Telangana Congress in-charge Thackeray) సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ విషయాలను పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ అలీ షబ్బీర్ విలేకరులకు తెలిపారు.

"సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఇస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పాటుకు సహకరించి తన హామీ నెరవేర్చారు. దీనికి ప్రతిఫలంగా తెలంగాణా నుంచి వచ్చే ఎన్నికల్లో లోక్ సభ కు పోటీ చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ తీర్మానాన్ని ఆమోదించాలని సోనియా గాంధీకి, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి లేఖరాస్తాం," అని షబ్బీర్ తెలిపారు.

ఈ తీర్మానంతో త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు సోనియాగాంధీని కలసి రాష్ట్రం నుంచి పోటీ చేయాలని అభ్యర్థిస్తారు. సోనియా ఎన్నిక సులభంగా జరిగేందుకు అనువయిన లోక్ సభ స్థానాల గురించి ఆమెకు విన్నవిస్తారు. సోనియా గాంధీ ఈ అభ్యర్థనకు అంగీకరిస్తే, నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి తెలంగాణ నుంచి పోటీ చేసిన రెండో అభ్యర్థి అవుతారు.

గతంలో 1980 లోక్ సభ మధ్యంతర ఎన్నికల్లో సోనియా అత్త ఇందిరాగాంధీ మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రికార్డు స్థాయిమెజారిటీ తో గెలుపొందారు.

ఇందిరా గాంధీ ఎన్నిక

1980లో మెదక్ నుంచి ఇందిరా గాంధీ ఎందుకు పోటీ చేశారు... (heading)

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రం నుంచి లోక్ సభ పోటీ చేయాలని సోనియాగాంధీ ని ఆహ్వానించింది. ఆమె అంగీకరిస్తే, నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి పోటీచేసిన రెండో వ్యక్తి అమె అవుతారు. మొదటి వ్యక్తి ఆమె అత్త ఇందిరా గాంధీ.

ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎందుకు పోటీ చేశారు

ఎమర్జన్సీ ముగిసేటపుడు 1977 మార్చిలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాయబరేలీ నియోజకవర్గంలో ప్రధాని ఇందిరాగాంధీ, జనతా పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు.

దేశ అంతరంగిక భద్రతకు ముప్పు అంటూ ఆమె 1975జూన్ 25 ఎమర్జన్సీ విధించారు. 1977 మార్చి 21 అది ముగిసింది. ఎన్నికలు మార్చి 16 నుంచి మార్చి 20 దాకా జరిగాయి.

1977 ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. ఇందిరా గాంధీ సొంతపార్టీని స్థాపించారు. దాని పేరు కాంగ్రెస్ (ఐ) అంటే ఇందిరా కాంగ్రెస్.

1977 లో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఏర్పడిన జనతా ప్రభుత్వం 1979 జూలై లో కూలిపోయింది. తర్వాత లోక్ దళ్ అధినేత చరణ్ సింగ్ కాంగ్రెస్ (ఐ) మద్దతుతో మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటుచేశారు. అయితే, కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంది. ఆ ప్రభుత్వం కూలిపోయింది.

దీనితో 1980 జనవరి లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అప్పుడు రాయ్‌బరేలీతో పాటు మరో సురక్షిత ప్రాంతం నుంచి కూడా పోటీ చేయాలని ఇందిరాగాంధీ నిర్ణయించుకున్నారు. దక్షిణాదిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె నిలబడితే బాగుంటుందని పార్టీ భావించింది.

అపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ (ఐ) మెదక్ నుంచి పోటీ చేయాలని ఇందిరా గాంధీని కోరింది. దీనికి ఆమె అంగీకరించారు. మెదక్ నుంచి పోటీ చేశారు.

ప్రధాన ప్రత్యర్థి జైపాల్ రెడ్డి

అపుడు ఆమె రికార్డు స్థాయిలో రెండు లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఇందిరాగాంధీ ప్రధాన ప్రత్యర్థి ఎవరో కాదు, ఎస్ జైపాల్ రెడ్డి. ఆయన జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అపుడు ఇందిరాగాంధీని ఎలాగైనా ఓడించాలనే కోరిక ప్రజాస్వామిక వాదుల్లో బలంగా ఉండింది. అందుకే తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్ కూడా పోటీ చేశారు. ఇలాగే మానవ కంప్యూటర్ గా పేరున్న శకుంతలా దేవి కూడా పోటీ చేశారు. ఓడిపోయారు.

ఇపుడు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థనను సోనియా గాంధీ మన్నిస్తారో లేదో చూడాలి. ఒక వేళ ఆమె పోటీ చేయాలనుకుంటే మెదక్ నియోజకవర్గాన్ని ఎన్నుకుంటారా లేక మరొకటా అనేది వెంటనే తేలకపోవచ్చు.

తెలంగాణలో రికార్డ్..

1980 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) పార్టీ తెలంగాణలో భారీ విజయం సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 42 లోకసభ స్థానాల్లో పోటీ చేస్తే 41 స్థానాల్లో కాంగ్రెస్(ఐ)విజయ ఢంకా మోగించింది. ఒక్క పార్వతీపురం నియోజవర్గం మాత్రం కాంగ్రెస్ (యూ)కు దక్కింది.ఈ నియోజకవర్గం నుంచి కిషోర్ చంద్రదేవ్ గెలుపొందారు.

తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 15 లోక్ సభ సీట్లను కాంగ్రెస్ (ఐ) చేజిక్కించుకుంది.

Read More
Next Story