తెలంగాణ (Telangana)ఎంపీలు పార్లమెంటులో పలు డిబేట్లలో పాల్గొని రికార్డు నెలకొల్పారు. పార్లమెంటు సమావేశాల్లో హాజరు శాతంలోనూ తెలంగాణ ఎంపీలు రికార్డు నెలకొల్పారు. పార్లమెంటులో ప్రశ్నలు అడగడంలోనూ తెలంగాణ ఎంపీలు ముందున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 మంది లోక్ సభ సభ్యులు(Members of Lok Sabha) ఉండగా, వీరిలో జి కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), బండి సంజయ్ కుమార్ (కరీంనగర్) కేంద్రమంత్రులుగా ఉన్నారు. ఇద్దరు కేంద్రమంత్రులు మినహాయించి 15 మంది లోక్ సభ సభ్యుల పనితీరును విశ్లేషించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 18వ లోక్ సభలో (Loksabha) 2024-25 సంవత్సరంలో ఎంపీల పనితీరును పార్లమెంట్ రికార్డుల ప్రకారం పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ సంస్థ విశ్లేషించింది. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ఎంపీలు (Telangana MPs outperfrom)పార్లమెంటు ఎలా పనిచేస్తున్నారనేది తెలుసుకోవాల్సిన అంశంగా మారింది.
తెలంగాణ ఎంపీలు 678 ప్రశ్నలు సంధించారు...
తెలంగాణ రాష్ట్రంలోని ఎంపీలు మొత్తం 678 ప్రశ్నలు అడిగారు. ఇందులో బీజేపీ ఎంపీలు 316 ప్రశ్నలు అడిగారు. తెలంగాణలోని కాంగ్రెస్ ఎంపీలు తక్కువ ప్రశ్నలు అడిగారు.2024 జూన్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 4వతేదీ దాకా తెలంగాణలోని ఇద్దరు కేంద్ర మంత్రులు మినహాయించి, 15 మంది ఎంపీలు 678 ప్రశ్నలు అడిగారు. బీజేపీకి చెందిన 8మంది ఎంపీలు 316 ప్రశ్నలు సంధించగా, కాంగ్రెస్ ఎంపీలు 308 ప్రశ్నలకే పరిమితమయ్యారు.పార్లమెంట్ సమావేశాల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 79 ప్రశ్నలు వేసి ముందున్నారు.
తెలంగాణలో టాప్ 5 ఎంపీలు వీరే...
లోక్ సభ సమావేశాలకు హాజరు కావడం, ప్రశ్నలు అడగటం,పార్లమెంట్ చర్చల్లో పాల్గోనడంలో తెలంగాణకు చెందిన ఐదుగురు ఎంపీలు టాప్ లో నిలిచారు. బీజేపీకి చెందిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఖమ్మం ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి టాప్ 5లో నిలిచారు.
హైదరాబాద్ ఎంపీ రికార్డ్
పార్లమెంటు సమావేశాల్లో హాజరుశాతంతోపాటు చర్చల్లో పాల్గొనడంలో హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అగ్రస్థానంలో నిలిచారు. లోక్ సభలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ 54 ప్రశ్నలు అడిగి ముందున్నారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్ పార్టీకి చెందిన ఏకైక ఎంపీ అసద్ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల కంటే అత్యధిక ప్రశ్నలు సంధించారు.ఎంపీ ఒవైసీ ఒక్కడే 21 డిబేట్లలో పాల్గొన్నారు. మరో వైపు లోక్ సభలో జరిగిన 21 చర్చల్లో పాల్గొన్నారు.
డిబేట్లలో కాంగ్రెస్ ఎంపీల ఫస్ట్
పార్లమెంటులో ఏడాది కాలంలో తెలంగాణ ఎంపీలు 119 చర్చల్లో పాల్గొన్నారు. జాతీయ చర్చల సగటు 11.8 శాతం కాగా, తెలంగాణ ఎంపీల డిబేట్ల పాలుపంచుకున్న శాతం 7.9 శాతంగా ఉంది. కాంగ్రెస్ ఎంపీలు 56 చర్చల్లో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలోని 8మంది బీజేపీ ఎంపీలు 42 డిబేట్లలో పాలుపంచుకున్నారు.
లోక్ సభ సమావేశాల హాజరులోనూ...
తెలంగాణ లోక్ సభ సభ్యులు పార్లమెంటు సమావేశాలకు హాజరుకావడంలో ముందున్నారు. 15మంది ఎంపీలు 88.53 శాతం సమావేశాలకు హాజరు అయ్యారు. జాతీయ ఎంపీల హాజరు సగటు 87 శాతం కాగా దాని కంటే అధికంగానే తెలంగాణ ఎంపీలు సమావేశాల్లో పాల్గొన్నారు. మజ్లిస్ పార్టీ ఏకైక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ 92.65శాతం హాజరుతో అందరికంటే అగ్రస్థానంలో నిలిచారు. బీజేపీకి చెందిన 8 మంది తెలంగాణ ఎంపీలు 92.16 శాతం హాజరు అయ్యారు. కాంగ్రెస్ ఎంపీల హాజరు శాతం 85.29 శాతంగానే ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో హాజరులో డీకే అరుణ వందశాతం సమావేశాలకు హాజరై రికార్డు నెలకొల్పారు. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు 97.076 శాతం, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 95.59 శాతం సమావేశాలకు హాజరై టాప్ 3 రికార్డు నెలకొల్పారు.