‘ఛాంపియన్ ఆఫ్ పీజంట్స్’కు దేశ అత్యున్నత పురస్కారం
జాతీయ రైతు దినోత్సవం (కిసాన్ దివస్)ను ఏటా డిసెంబర్ 23న జరుపుకుంటాం. అదే రోజు జరుపుకోడానికి ఓ విశేషముంది.
జాతీయ రైతు దినోత్సవం (కిసాన్ దివస్)ను ఏటా డిసెంబర్ 23న జరుపుకుంటాం. అదే రోజు జరుపుకోడానికి ఓ విశేషముంది. ఆ రోజు దేశానికి ప్రధానిగా పనిచేసిన చౌదరి చరణ్ సింగ్ పుట్టిన రోజు. రైతుల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన జన్మదినాన్ని కిసాన్ దివస్‌గా జరుపుకుంటున్నాం.
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్రం శుక్రవారం ‘‘భారతరత్న’’ పురస్కారాన్ని ప్రకటించింది. ఇటీవలే ఎల్‌కే అద్వానీ, కర్పూరీ ఠాకూర్‌లకు ప్రభుత్వం గతంలో దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో చౌదరి చరణ్ సింగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
రైతు కుటుంబంలో జన్మించి..
1902 డిసెంబర్ 23న జన్మించిన చౌదరి చరణ్ సింగ్ గొప్ప రైతు నాయకులలో ఒకరు. రైతుల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారు. అందుకే ఆయనను ‘ఛాంపియన్ ఆఫ్ ఇండియన్ పీజంట్’గా పిలుస్తారు. చరణ్ సింగ్ జూలై 28, 1979 నుంచి జనవరి 14, 1980 మధ్య కాలంలో దేశానికి 5వ ప్రధానమంత్రిగా పనిచేశారు.
మధ్యతరగతి కుటుంబం నుంచి..
చౌదరి చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. 1923లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1925లో ఆగ్రా విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు. న్యాయశాస్త్రంలో శిక్షణ పొంది ఘజియాబాద్‌లో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1929లో మీరట్‌కు చేరుకుని తరువాత కాంగ్రెస్‌లో చేరాడు.
ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికై..
1937లో చౌదరి చరణ్ సింగ్ తొలిసారిగా ఛప్రౌలీ నియోజకవర్గం నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అతను
మొదటిసారిగా 1937లో యుపి శాసనసభకు ఛప్రౌలీ నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1946, 1952, 1962, 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించాడు.
మంత్రిగా..
1951లో క్యాబినెట్ మంత్రి అయ్యారు. న్యాయ, సమాచార శాఖలను ఆయనకు అప్పగించారు. తరువాత డాక్టర్ సంపూర్ణానంద ప్రభుత్వ హయాంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు.1959 లో తాను రాజీనామా చేసినపుడు రెవెన్యూ, రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు.
జూన్ 1951లో యూపీలో క్యాబినెట్ మంత్రి అయ్యారు. న్యాయ, సమాచార శాఖలకు బాధ్యత వహించాడు. 1952లో సంపూర్ణానంద్ క్యాబినెట్‌లో రెవెన్యూ, వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏప్రిల్ 1959లో రాజీనామా చేసినప్పుడు, అతను రెవెన్యూ, రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు.
చరణ్ సింగ్ సుచేతా కృపలానీ మంత్రివర్గంలో వ్యవసాయం,అటవీ శాఖ మంత్రిగా (1962-63) కూడా పనిచేశారు. 1966లో స్థానిక స్వపరిపాలన శాఖ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ చీలిక తర్వాత, 1970 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో రెండోసారి యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, 1970 అక్టోబర్ 2న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.
23 రోజులు ప్రధానిగా..
1979 జులై 28 నుంచి ఆగస్టు 20 మధ్య కేవలం 23 రోజుల పాటు దేశ ఐదో ప్రధానిగా సేవలు అందించారు చౌదరి చరణ్ సింగ్..
యూపీలో ప్రముఖ రైతు నాయకుడిగా..
1950వ దశకంలో చౌదరి చరణ్ సింగ్ భారతదేశంలో అత్యంత విప్లవాత్మక భూసంస్కరణ చట్టాలకు మార్గదర్శకత్వం వహించడంతో ఆయన చాలా ప్రసిద్ధి చెందారు. 1959లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సామ్యవాద, సామూహిక భూ విధానాలను వ్యతిరేకించడంతో చరణ్ సింగ్ పేరు దేశవ్యాప్తంగా తెలిసిపోయింది.