ఫెడరల్ తెలంగాణ వచ్చేసింది!
‘ది ఫెడరల్ తెలంగాణ ఎడిషన్’ ను ప్రారంభించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. దేశంలోని ప్రముఖ వార్తా వెబ్ సైట్లలో ‘ది ఫెడరల్’ (The Federal) ఒకటి.
గౌరవనీయులైన పాఠకులు, శ్రేయోభిలాషులు, ప్రజాస్వామిక వాదులు, ప్రకటనకర్తలకు ఫెడరల్ గ్రూఫ్ తరఫున నమస్కారం.
‘ది ఫెడరల్ తెలంగాణ ఎడిషన్’ ను ప్రారంభించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. దేశంలోని ప్రముఖ వార్తా వెబ్ సైట్లలో ‘ది ఫెడరల్’ (The Federal) ఒకటి. ఫెడరల్ ప్రారంభమైన నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ఎడిషన్‌ను- తెలుగులో విడుదల చేసింది. రాష్ట్రాల దృక్కోణం నుంచి భారత దేశ ముఖ చిత్రాన్ని వీక్షించాలనే నినాదానికి అనుగుణంగా తెలంగాణ ఎడిషన్ ను తీసుకువచ్చాం. ఓ రాష్ట్ర రాజధాని నుంచి వెలువడిన ది ఫెడరల్ ఎడిషన్ల శ్రేణిలో మొట్ట మొదటిది తెలంగాణ ఎడిషన్ కావడం గర్వకారణం.
"మా మకుటాయమానమైన ‘ది ఫెడరల్’ ఇంగ్లీషు ఎడిషన్ ను ఎలా తీసుకువస్తున్నామో అదే ఉత్సాహం, విలువలు, నిబద్ధతతో అన్ని రాష్ట్రాల ప్రాంతీయ భాషలలో విలువలతో కూడిన జర్నలిజం ప్రమాణాలతో ఫెడరల్ వెబ్ సైట్లను తీసుకురావాలన్నది మా లక్ష్యం" అని ఈ సందర్భంగా ‘ది ఫెడరల్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్.శ్రీనివాసన్ అన్నారు. "అందులో భాగంగా ఇప్పుడు తెలుగులో తెలంగాణ ఎడిషన్ తీసుకువచ్చాం. ప్రాంతీయ భాషా ఎడిషన్ల ద్వారా విచక్షణ, వివేకం కలిగిన పాఠకులు... తమ తమ భాషలలో ఉత్తమ జర్నలిజం విలువలతో కూడిన వార్తల్ని పొందగలుగుతారు" అని శ్రీనివాసన్ చెప్పారు.
ది ఫెడరల్.. చెన్నైలోని న్యూ జనరేషన్ మీడియా గ్రూపులో అంతర్భాగం. ప్రతిష్టాత్మక ‘పుతియ తలైమురై’ (Puthiya Thalai Murai) టెలివిజన్ ఛానల్ ఈ గ్రూపునకు మకుటాయమానం.
"బహుళ భాషల్లో ఫెడరల్‌ని ప్రారంభించడమనేది విశ్వవ్యాపిత అనుసంధానం, సమగ్రత పట్ల మాకున్న నిబద్ధతకు నిదర్శనం" అని న్యూ జనరేషన్ మీడియా సీఇవో రాజమణి సి అన్నారు. “ప్రపంచం చాల వైవిధ్యంతో కూడింది. భిన్న భాషలు, మరెన్నో సంస్కృతులతో నిండి ఉన్నది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, నాణ్యమైన జర్నలిజానికి భాష ఎప్పుడూ అడ్డంకి కాకూడదు. ‘ది ఫెడరల్’ ఈ విషయాన్ని గట్టిగా నమ్ముతోంది. సరిహద్దులతో నిమిత్తం లేకుండా ప్రతి పాఠకుడి గుండెలను ప్రతిధ్వనింపజేయాలన్నది మా ఉద్దేశం. అందుకు ఏ భాషలోనైనా అర్థవంతంగా ఉండే వార్తలను అందించాలని భావిస్తున్నాం. మా విస్తరణ ఒక్క భాషాపరమైందే కాదు, ఇదో నిరంతర ప్రయాణం. మనం నివశిస్తున్న ప్రపంచాన్ని మరింత సుసంపన్నంగా అవగతం చేసుకోవడానికీ, అనుసంధానికి చేస్తున్న ప్రయాణం. వచ్చే ఎన్నికలపై దృష్టి సారించినపుడు మా నిబద్ధత తిరుగులేనిదిగా ఉంటుంది. ప్రతి ఓటరును ప్రతిధ్వనింపజేసేలా ప్రభావవంతమైన, నిష్పాక్షికమైన కవరేజీని అందించడం మా లక్ష్యంగా ఉంటుంది” అని సీఇవో స్పష్టం చేశారు.
"బహుళ భాషల్లోకి విస్తరించడం అనేది సమాచార మార్పిడికి కొత్త మార్గాలను తెరవడానికి, విభిన్న ప్రేక్షకులతో కనెక్ట్ కావడానికి ఉపయోగపడుతుంది. ప్రాంతీయ ప్రకటనదారులకు విస్తృత అవకాశాలను అందిస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఏ భాష మాట్లాడుతున్నా అడ్డంకులను అధిగమించి, వాస్తవాల్ని ప్రజలకు తెలిపే విధంగా మేము చేసే ప్రయత్నాలకు అండగా నిలవండి. మాతో కలిసి నడవండి, మాతో చేరండి. మాతో మాట్లాడండి" అని కోరారు సీఇవో రాజమణి.
ఎన్నో సవాళ్లు ఉన్నా వివిధ రాష్ట్రాలలోకి ప్రవేశించడం ఓ ఉత్తేజకరమైన విషయంగా ఫెడరల్ భావిస్తోంది. టెక్నాలజీ, కంటెంట్, వార్తల ప్రాధాన్యతల పరంగా మీడియా వేగంగా మార్పు చెందుతున్న తరుణంలో వివిధ రాష్ట్రాల్లోకి ప్రవేశించడం నిజంగా ఓ సవాల్. భారతీయ భౌగోళిక చిత్రపటంపై యువ రాజ్యంగా ఉన్న తెలంగాణ ముఖచిత్రాన్ని ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రపంచానికి కొత్త కోణంలో చూపించాలని ఫెడరల్ భావిస్తోంది
‘ది ఫెడరల్ తెలంగాణ’ ఎడిషన్ ను సీనియర్ జర్నలిస్ట్ జింకా నాగరాజు నడుపుతారు. హార్డ్ హిట్టింగ్ జర్నలిస్టుగా ఆయనకు తెలుగు రాష్ట్రాలలో పేరుంది. ఫెయిర్ జర్నలిజం కోసం పరితపించే వాళ్లలో ఆయన ఒకరు. జింకా నాగరాజు ఆధ్వర్యంలో వస్తున్న ‘ది ఫెడరల్ తెలంగాణ‘ ఎడిషన్ విజయవంతమవుతుందని గట్టిగా విశ్వసిస్తున్నాం.
The Federal: https://thefederal.com/
The Federal Telangana: http://telangana.thefederal.com/
ధన్యవాదాలతో,
న్యూ జనరేషన్ మీడియా గ్రూపు
చెన్నై, తమిళనాడు