శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం...!
x

శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం...!



తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీరాములవారు తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.

హ‌నుమంత వాహ‌నం – భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి





హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులైన శ్రీ రామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.





శ్రీరామనవమి ఆస్థానం

అనంతరం రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించారు .


Read More
Next Story