ఐదు దఫాలతో పోలిస్తే ఆరో దశలో తగ్గిన పోలింగ్ శాతం..
x

ఐదు దఫాలతో పోలిస్తే ఆరో దశలో తగ్గిన పోలింగ్ శాతం..

ఆరో దఫాలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు నిన్న పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం 61.20 శాతంగా నమోదైంది.


దేశంలో లోక్ సభ ఆరో విడద ఎన్నికలు శనివారం ముగిశాయి. ఏడో, చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది.

ఆరో దఫాలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు నిన్న పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం 61.20 శాతంగా నమోదైంది. ఇది ఇప్పటి వరకు జరిగిన అన్ని దశల కంటే అత్యల్పం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆరో దఫాలో 64.4 శాతం పోలింగ్ నమోదైంది. కాగా మే 20వ తేదీన జరిగిన ఐదో దశలో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగి 62.20 శాతం నమోదైనట్లు ఈసీ పేర్కొంది.

నాల్గవ దశ పోలింగ్‌లో 69.16 శాతంగా నమోదుకాగా, ఇది 2019 పార్లమెంటు ఎన్నికల కంటే 3.65 శాతం ఎక్కువ. మూడో విడత పోలింగ్‌లో 65.68 శాతం ఓటింగ్ నమోదైంది. 2019లో అయితే 68.4 శాతంగా నమోదైంది. 2024 రెండో దశ పోలింగ్‌లో 66.71 శాతం నమోదు కాగా, 2019 రెండో దఫాలో 69.64 శాతంగా నమోదైంది. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలి దశ పోలింగ్‌లో 66.14 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019 ఎన్నికల్లో తొలి దశలో 69.43 శాతం పోలింగ్‌ నమోదైంది.

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాతే తుది పోలింగ్ శాతం స్పష్టంగా తెలుస్తుందని పోల్ ప్యానెల్ పేర్కొంది.

Read More
Next Story