తిరుమల: జగన్ పై ఆంక్షలంటే సనాతన ధర్మాన్ని అడ్డుకోవడమేనా..
x
తిరుమలలో శ్రీావారికి పట్టువస్త్రాలు తీసుకుని వెళుతున్న జగన్ (ఫైల్)

తిరుమల: జగన్ పై ఆంక్షలంటే సనాతన ధర్మాన్ని అడ్డుకోవడమేనా..

తిరుమల శ్రీవారిని జగన్ దర్శనం చేసుకునే వెళతారు. పార్టీ నేతలను గృహ నిర్బంధం చేయడాన్ని వైసీపీ ఆక్షేపించింది. ఈ వ్యవహారాలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఏమన్నారంటే..


తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునే వెళతారు. జిల్లాల నుంచి వస్తున్న వారిని నిర్బంధించడాన్ని వైసీపీ తప్పుబట్టింది. "ఎంతగా అణిచితే అంతగా పైకి లేస్తాం" అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. వైసీపీ అధ్యక్షుడు "వైఎస్. జగన్ తిరుమల శ్రీవారిని దర్శించునే వెళతారు. అందులో ఎలాంటి సందేహం లేదు" అని కూడా ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

"తిరుమలకు రాకుండా వైసీపీ అధినేత వైఎస్. జగన్ ను అడ్డుకోవడం అంటే సనాతన ధర్మాన్ని అడ్డుకోవడమే. సంస్కృతిని దెబ్బతీయడమే" అని ఆయన అభివర్ణించారు. జగన్ అంటే బీజేపీకి అంతభయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. తిరుమల లడ్డూ లో కల్తీ జరిగిందనే ఆరోపణల ప్రకంటనలు ఆగడం లేదు. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని మాజీ సీఎం వైఎస్. జగన్ కార్యక్రమం కూడా ఖరారైంది. దీనికి టీడీపీ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. సాధువులు కూడా వైఎస్. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి తిరుపతిలో మోహరించారు.

పోలీసుల ఆంక్షలు
తిరుమల లడ్డూ వ్యవహారంలో చోటుచేసుకున్న రాజకీయ వ్యవహారాల నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు "పోలీస్ 30 యాక్టు అమలు"కు ఉత్తర్వులు జారీ చేశారు. "సభలు, సమావేశాలు, ర్యాలీలు కూడా నిర్వహించడానికి ముందస్తు అనుమతి అవసరం" అని ఎస్పీ ఆదేశాల్లో స్పష్టం చేశారు.
ప్రజాగొంతుకగా నిలుస్తాం..
రాయలసీమ జిల్లాల నుంచి వస్తున్న తమ పార్టీ నాయకులు, మాజీ ప్రజాతినిధులను పోలీసులతో అడ్డగించారు. అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం అన్నారు. తిరుపతిలో తనతో పాటు ఎంపీ మద్దెల గురుమూర్తి, నగర మేయర్ డాక్టర్ బీఆర్. శిరీషా యాదవ్ తో పాటు అనేక మందికి నోటీసులు ఇచ్చారు. ఇది ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. "ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజాగొంతుకలుగా నిలుస్తాం. ఆందోళనలతో ప్రజాభిప్రాయాన్ని కూడా కూడగడతాం అని వ్యాఖ్యానించారు.

"సీఎం చంద్రబాబు చెప్పిన ఒక అపద్దాన్ని నిజం చేయడానికి, ఆయన సహచర పార్టీ నేతలు కూడా సిద్ధ పడ్డారు" అని ఆరోపించారు. వేదమూర్తి వేంకటేశ్వరస్వామి ప్రసాదంపై వేయి నాల్కలతో మాట్లాడకండి. వ్యవక్తిగత రాజకీయాల్లకి శక్తిమూర్తిని తీసుురావద్దు" అని ప్రభుత్వానికి హితవు పలికారు. సీఎం చంద్రబాబు ఒకమాట, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమాట, వారి పార్టీ నేతలు తలోరకమైన మాటలు మాట్లాడుతున్నారంటూ, పవన్ కల్యాణ్ "హిందూ ధర్మానికి ధ్వజస్తంభం తానే అన్నట్లు మాట్లాడుతన్నారు" అనిభూమన కరుణాకరెడ్డి వాగ్బాణాలు సంధించారు. మళ్లీ.. జగన్ ను శ్రీవారి దర్శనానికి అనుమతించాలి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు.
మీ భీషణ ప్రతిజ్నలు ఆపలేవు...
వైఎస్. జగన్ ను అడ్డుకుంటాం. అని కొందరు. డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని ఇంకొందరు అంటున్నారు. మీ భీషణ ప్రతిజ్ణలు మా నాయకుడి పర్యటనను అడ్డుకోలేవు అని హెచ్చరించారు. హిందూ ధర్మానికి తామే పరిరక్షలుగా బిల్డప్ ఇస్తున్న తిరుపతి నేతల చెప్పింది వేదమా? అని నిలదీశారు. "మీరంతా శ్రీవారి భక్తుల జీవన విధానాన్ని చిదిమేస్తున్నారు" అని కరుణాకరరెడ్డి వ్యాఖ్యానించారు. హైందవ సంస్కృతిపై ఓనమాలు తెలియని వారు మాట్లాడుతున్నారు. మా పరిస్థితి అదికాదు. అన్ని విషయాలను ఔపోసన పట్టాం. అధ్యయనం, రచనలతో మేమేంటో నిరూపించుకున్నాం" అని అన్నారు. మీరు చెబితే మేము హిందువులను చెప్పించునే స్థితిలో లేము. అని అని హెచ్చరించారు.

దివంగత సీఎం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ధర్మరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాం. ఇవే తాము పాటించిన హిందూధర్మానికి నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. టీడీపీ కూటిమి నేతలు చేబితే మేము హిందువులం అవుతాం అనుకుంటే పొరబాటు. మీరు ఆ మాటలంటే చెబితే సిగ్గుపడతాం" అని వ్యాఖ్యానించారు. పోలీసులు కూడా ద్వందనీతిని పాటిస్తున్నారని ఆయన ఆరోపించారు. నేను అలిపిరి గరుత్మంతుడి విగ్రహం వద్ద మాట్లాడాలని ప్రయత్నిస్తే, పోలీసులు అడ్డుకున్నారు. అదే రోజు టీడీపీ నేతలను అక్కడ ఎలా అనుమతించారని భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు.
ఈఓ తీరు బాధాకరం..
టీటీడీ ఈఓ జే. శ్యామలరావు వ్యవహరించిన తీరుపై కూడా మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అభ్యంతరం తెలిపారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ మూడు నెలల కాలంలో ఎన్ని నెయ్యి ట్యాంకర్లు లోపలికి వెళ్లాయి. ఆ నివేదికలు ఎక్కడ? సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
"తన తండ్రి చనిపోతే మాజీ సీఎం వైఎస్. జగన్ శాస్ర్తక్తంగా పిండప్రదానం చేశారు. తిరుమలకు వచ్చినప్పుడు తిరునామాలు ధరించి దర్శనానికి వెళ్లారు. ఆయన హిందూత్వానికి నిదర్శనం కనిపించలేదా" అని కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. "సీఎం చంద్రబాబు తీరు వెనుక రాజకీయ కల్మషం ఉంది. మీ రాజకీయాలు ఆపండి" అని ఆయన హితవు పలికారు.
Read More
Next Story