TIRUMALA : వైకుంఠ ఏకాదశి: 24న ఆన్ లైన్ కోటా టికెట్ల విడుదల
x
తిరుమల ఆలయం. వైకుంఠ ద్వారం (ఇన్ సెట్)

TIRUMALA : వైకుంఠ ఏకాదశి: 24న ఆన్ లైన్ కోటా టికెట్ల విడుదల

వైకుంఠ ఏకాదశికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో ఉంచనున్నారు. శ్రీవాణి, ఎస్ఎస్డీ టికెట్లు జారీ తేదీలను మార్పు చేశారు.


తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల తరువాత వైకుంఠ ఏకాదశికి అంత ప్రాధాన్యం ఉంది. ఏడాదికి ఒక రోజు మాత్రమే శ్రీవారి ఆలయంలోని ఉత్తరద్వార (వైకుంఠ ద్వారాలు) దర్శనం ఉంటుంది. సాధారణంగా ఏకాదశి, ద్వాదశికి మాత్రమే ఈ ద్వారాలు తెరిచేవారు. దీంతో ప్రముఖులు, స్వల్ప సంఖ్యలో మాత్రమే సామాన్య భక్తులకు ఈ దర్శనం అందుబాటులో ఉండేది. వైకుంఠ ద్వారంలో వెళితే జన్మ ఫలిస్తుందనేది యాత్రికుల ప్రగాఢ నమ్మకం. దీంతో ఐదేళ్లు గా వైకుంఠ ద్వారా దర్శనాలు పది రోజులు కల్పించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. కనీసం ఐదు లక్షల మందికి వైకుంఠ ద్వారా దర్శనం కల్పించే లక్ష్యంగా టీటీడీ ఏర్పాట్ల చేయడానికి తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా..

ఆన్ లైన్ లో కోటా టికెట్లు
తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనం తోపాటు యాత్రికులు వసతి కోటా విడుదల చేసే తేదీలను టీటీడీ ప్రకటించింది. టీటీడీ ఆన్లైన్ సైట్ లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని కూడా యాత్రికులకు సూచన చేసింది. శ్రీవాణి దర్శనం, రూ. 300 ఎస్ఈడీ (Special Entrance Darshan) టికెట్ల కోటా విడుదల చేసే తేదీలను కూడా టీటీడీ వెల్లడించింది.
23న వైకుంఠం టికెట్లు
2025 కొత్త సంవత్సరం జనవరి 10వ తేదీ తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. ఇవి 19వ తేదీ వరకు తెరిచే ఉంచుతారు. సామాన్య యాత్రికులకు కూడా ఉత్తరద్వార దర్ఢనం కల్పించడానికి వీలుగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన టికెట్లను టీటీడీ ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తుంది. పది రోజుల టికెట్లు అందుబాటులో ఉంటాయి.
-పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
దర్శనం, వసతి తేదీల మార్పు...
తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీవాణి ట్రస్టు, ఎస్ఎస్డీ, మార్చి నెల దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను మార్పు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆమేరకు
- డిసెంబరు 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.
-డిసెంబరు 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు వివరించారు.
-అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తారు.
Read More
Next Story