‘‘ఆ ‌నలుగురు’’
x

‘‘ఆ ‌నలుగురు’’

తెలంగాణ ప్రజాభవన్‌ ‌దగ్గర ఇద్దరు వ్యక్తులు ప్రదర్శించిన ఓఫ్లెక్సీలో ‘‘ఆ నలుగురి’’ గురించే ఇప్పుడు చర్చంతా. ఇంతకీ వారెవరు? బ్యాక్‌‌గ్రౌండ్‌ ఏం‌టి..


తెలంగాణ సీఎం ఎ. రేవంత్‌ ‌రెడ్డి (CM Revanth) ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్‌ (Praja Darbar) ‌నిర్వహిస్తుండగా..బయట ఇద్దరు వ్యక్తులు ప్రదర్శించిన ఫ్లెక్సీ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరలవుతోంది.

‘తెలంగాణ అసలు దొంగలు’’ ‘‘బేకార్‌.. ‌బీహార్‌ ‌బ్యాచ్‌..’’అని రాసిన ఆ ఫ్లెక్సీలో 8 మంది ఫోటోలు, వాటికింద వారి పేర్లు ఉన్నాయి. మొదటి వరుసలో నలుగురి రిటైర్డ్ ఐఏఎస్‌ల ఫోటోలు (రాజీవ్‌శర్మ, సోమేష్‌ ‌కుమార్‌, ‌నర్సింగ్‌ ‌రావు, రజత్‌ ‌కుమార్‌) ఉం‌డగా.. రెండో వరసలో కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు, కవిత ఫొటోలు ఉన్నాయి.

కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌హరీష్‌, ‌కవిత గురించి అందరికి తెలుసు. కాని తెలియని వ్యక్తులు ఫ్లెక్సీ పై వరుసలో నలుగురున్నారు. వారంతా రిటైర్డ్ ఐఏఎస్‌ ఆఫీసర్లు. ఇప్పడు వారి గురించిన వివరాల కోసమే కొంతమంది నెట్‌లో సెర్చ్ ‌చేస్తున్నారు.

1. డా. ‌రాజీవ్‌ ‌శర్మ (Rajeev Sharma)

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ప్రధాన కార్యదర్శి ఈయన. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో కీలకంగా వ్యవహరించారు. ఐఏఎస్‌ 1982 ‌బ్యాచ్‌కు చెందిన ఈయన ఏపీలోని రెండు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌ ‌కూడా పనిచేశారు. ఆయన కెసిఆర్ కు అత్యంత ఇష్టుడు. ఎందుకంటే, రాజీవ్ శర్మ 2016 నవంబర్ ౩౦న రిటైర్ అయ్యారు. మరుక్షణం ఆయనను ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా నియమించారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసే దాకా ఆయనే ఈ పదవిలో కొనసాగారు. ఇది భారతదేశంలో ఇలాంటి అరుదైన గౌరవం మరెవ్వరికి దక్కి ఉండదు. అంతేకాదు, రిటైరయిన రాజీశ్ శర్మను వీడ్కోలుపలికిన తీరు కూడా అపూర్వం. బ్రాహ్మణుల వేద మంత్రోచ్చటన మధ్య సన్మానంతో గౌరవించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి రిటైరవుతున్న చీఫ్ సెక్రెటరీకి మహా అంటే ఒక శాలువ కప్పిఉండవచ్చు. అంతేకాని, ఇలా అసాధారణ లాంచనాలతో వీడ్కోలు పంపడం వెంటనే సల హాదారుగా తీసుకోవడం అసాధారణం.

2. ఎస్‌. ‌నర్సింగ్‌ ‌రావు (S.Narsing Rao)

నర్సింగ్‌ ‌రావు ఉమ్మడి ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. వెలమకులస్థుడు. 1986 బ్యాచ్‌కు చెందిన ఈయన మెదక్‌ ‌జిల్లావాసి. సింగరేణి కాలరీస్‌ ‌లిమిటెడ్‌కు సీఎండీగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన రిటైరయినా కూడా కొనసాగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 45 రోజుల కార్మికుల సమ్మె కాలంలో సింగరేణిని సమర్థంగా నడిపించారని పేరు. 2014 ఆ పదవికి రిజైన్‌ ‌చేసి.. తెలంగాణ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా చేరి కీలక పాత్ర పోషించారు.

3. రజత్‌ ‌కుమార్‌ ‌సైని (Rajat Kumar Saini)

తెలంగాణ ఐఏఎస్‌ 2007 ‌బ్యాచ్‌కు చెందిన ఈయన భదాద్రి కొత్తగూడెం జిల్లాకు కలెక్టర్‌గా పనిచేశారు. నేషనల్‌ ఇం‌డస్రీయల్‌ ‌కారిడార్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌లిమిటెడ్‌కు సీఈవోగా పనిచేశారు.

4. సోమేశ్‌ ‌కుమార్‌ (Somesh Kumar)

తెలంగాణ రాష్ట్ర తాజా మాజీ ప్రధాన కార్యదర్శి ఈయన. గడిచిన తొమ్మిదేళ్లలో గత సీఎం కేసీఆర్‌కు ముఖ్య సలహాదారుగా పనిచేసిన రెండో వ్యక్తి. గతంలో మాజీ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ ‌శర్మను కేసీఆర్‌ ముఖ్య సలహాదారుగా నియమించారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన అనేక పథకాల వెనక, సర్వేల వెనక సోమేష్ కుమార్ హస్తమే ఉందని చెబుతారు. ఆయన తీసుకున్న చాలా నిర్ణయాలు ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టాయి. చంద్రబాబు అంటే ఆయన నచ్చదు. అందుకే విభజన సమయంలో ఆయనను ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించినా, ట్రిబ్యునల్ కు పోయి తెలంగాణా కు మార్పించుకుని ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారులలో ఒకరయ్యారు.

సోమేశ్‌ ‌కుమార్‌ 2023 ‌జనవరి వరకు మూడేళ్లపాటు తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆయనను ఏపీకి కేటాయించడంతో.. పదవీ విరమణకు ఎనిమిది నెలల ముందు స్వచ్ఛంద పదవీ తీసుకున్నారు. అయితే ఆయన సేవలను కేసీఆర్‌ ‌వినియోగించుకున్నారు.

ఈ నలుగురు అధికారులను గ్యాంగ్ ఆఫ్ ఫోర్ గా వీళ్నని ఫ్లెక్సీకి ఎక్కించడం కలకలం సృష్టించింది.

Read More
Next Story