జో బైడెన్ స్థానంలో డెమోక్రటిక్ అభ్యర్థి ఎవరు అవుతారు?
x

జో బైడెన్ స్థానంలో డెమోక్రటిక్ అభ్యర్థి ఎవరు అవుతారు?

అధ్యక్షుడు బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు తన మద్దతు ప్రకటించారు, అయితే ఆమె అభ్యర్థిత్వం ఎంతవరకు సాఫీగా సాగుతుంది అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది.


నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరినుంచి వైదొలుగుతున్నానని జో బైడెన్ ప్రకటించటంతో ఆయన స్థానంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరు అవుతారు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

అధ్యక్షుడు బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు తన మద్దతు ప్రకటించారు, ఇతర ప్రముఖ డెమోక్రాట్‌లు కూడా వెంటనే స్పందించి ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. అయితే ఆమె అభ్యర్థిత్వం ఎంతవరకు సాఫీగా సాగుతుంది అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది.

డెమోక్రటిక్ పార్టీ టికెట్ కోసం పోటీ పడుతున్న నాయకులు వీరే:

ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్

క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్‌ల్యాండ్‌లో పుట్టిన ఉపాధ్యక్షురాలు కమల తుర్‌గుడ్ మార్షల్‌ను తనకు స్ఫూర్తిగా చెబుతుంటారు, పౌరహక్కుల ఉద్యమంలో చురుకుగా పని చేసిన తల్లిదండ్రుల పెంపకంలో పెరగటం గురించి తరచూ చెప్పుకుంటారు.

ఆర్థికవేత్త అయిన తన తండ్రి, క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన తన తల్లి గ్రాడ్యుయేట్ విద్యార్థులుగా యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో కలుసుకున్నారని, అక్కడ వాళ్ళు న్యాయంకోసం చాలా ర్యాలీలు, ఉద్యమాలు చేశారని కమల చెబుతారు.

2020లో కమలను తన ఉపాధ్యక్ష పదవికి ఎంచుకునేటప్పుడు, బైడెన్ ఆమె గురించి చెబుతూ, తనలాంటి అల్పుడికి భయమంటే ఎరగని పోరాట యోధురాలు దొరికిందని అన్నారు.

తాజా ఎన్నికలలో ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా కమల ఏ మాత్రం సంకోచించలేదు, ఇటీవలికాలంలో బైడెన్-హ్యారిస్ జోడీ విజయంకోసం చురుకుగా ప్రచారం చేస్తూ కనిపించారు.

స్వతహాగా నల్లజాతీయురాలు, భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్, అమెరికాకు ఉపాధ్యక్ష పదవిలో ఎన్నికైన మొదటి మహిళ, ఆ పదవిని అధిరోహించిన మొదటి నల్లజాతీయురాలు కూడా. హొవార్డ్ విశ్వవిద్యాలయంనుంచి పట్టా తీసుకున్న కమల, ఒక చారిత్రక నల్లజాతి కాలేజ్-యూనివర్సిటీలో చదివి అమెరికా అధ్యక్ష లేదా ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక కాబడిన మొట్టమొదటి వ్యక్తి.

రెండుసార్లు క్యాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికైన కమల 2016లో అమెరికా సెనేటర్‌గా విజయం సాధించారు. సెనేటర్‌గా ఆమె తనఖా సంక్షోభం సమయంలో పెద్ద బ్యాంకులపై, విద్యార్థులను దోచుకుంటున్న వ్యాపార కళాశాలలపై, పర్యావరణానికి హాని చేస్తున్నవారిపై చేసిన పోరాటాలకుగానూ పేరుగాంచారు.

నేరశిక్షా స్మృతిలో సంస్కరణలకు మద్దతుగా ఆమె ఎన్నో ఏళ్ళుగా మాట్లాడుతున్నారు, హింస లేని నేరాలపట్ల భిన్నమైన వైఖరి ఉండాలని, అన్ని నేరాలకూ ఒకే రకమైన తీవ్రమైన శిక్ష కాకుండా పునరావాసం కల్పించటానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె వాదిస్తూ వస్తున్నారు.

దేశ సరిహద్దులను మరింత సురక్షితంగా చేయటంతో సహా తమ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్ళలాంటి కొన్ని పనులు చూసుకునే బాధ్యతను ఉపాధ్యక్షురాలిగా కమలకు బైడెన్ అప్పజెప్పారు. అమెరికా సెనేట్ ప్రిసైడింగ్ అధికారిణిగా డెమోక్రాట్‌లు మద్దతు ఇచ్చిన బిల్లులపై పెద్ద సంఖ్యలో టై బ్రేకింగ్ ఓట్లు వేశారు. ఈ ఏడాది ఎన్నికలలో కాంగ్రెస్‌లోని రెండు సభలలో డెమోక్రాట్‌లకు అతి తక్కువ మెజారిటీ ఉండటమే దీనికి కారణం.

59 ఏళ్ళ కమల, లాస్‌ఏంజెల్స్‌ చెందిన న్యాయవాది డగ్లస్ ఎమ్‌హాఫ్‌తో వైవాహికబంధంలో ఉన్నారు.

ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్‌కర్

ఇలినాయిస్ గవర్నర్‌గా ఉన్న జేబీ ప్రిట్జ్‌కర్ అమెరికాలోని ప్రజాప్రతినిధులలో అత్యంత ధనికుడు. ఆయన హయత్ హోటల్ ఫార్చ్యూన్‌కు వారసుడు, ఒక మాజీ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ మరియు దాత. ఆయన నికర విలువ 340 కోట్ల డాలర్లు. ఫోర్బ్స్ వారి 400 మంది అత్యంత ధనిక అమెరికన్ల జాబితాలో ఆయన 250వ స్థానంలో ఉన్నారు.

59 ఏళ్ల ప్రిట్జ్‌కర్ 2018లో గవర్నర్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఆ ఎన్నికల్లో రెండోసారి ఆ పదవికి పోటీ పడిన రిపబ్లికన్ గవర్నర్‌ బ్రూస్ రానర్‌ను ఓడించారు. ఆ పదవిలో మంచి పేరు తెచ్చుకున్నారు. 16 సంవత్సరాలలో ఇలినాయిస్ గవర్నర్‌గా రెండోసారి ఎన్నుకోబడిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు.

మిచిగన్ గవర్నర్ గ్రెచెన్ విట్‌మర్

మిచిగన్ గవర్నర్ గ్రెచెన్ విట్‌మర్ రాష్ట్ర శాసనసభలో పదిహేను ఏళ్ళు చేసిన తర్వాత 2018 గవర్నర్ ఎన్నికల్లో విజయం సాధించి ఆ పదవిని అధిరోహించారు. అప్పటినుంచి డెమోక్రటిక్ పార్టీలో ఆమె ఎదుగుదల శరవేగంగా జరిగింది. 52 ఏళ్ళ గ్రెచెన్ జాతీయ స్థాయిలో తన పేరు పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.

క్యాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్

క్యాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందినవారు. 1995లో మేయర్‌గా విల్లీ బ్రౌన్ తరపున ప్రచారం చేయటంద్వారా రాజకీయాలలో ప్రవేశించారు. రెండేళ్ళ తర్వాత మేయర్ బ్రౌన్ న్యూసమ్‌ను శాన్ ఫ్రాన్సిస్కో బోర్డ్ ఆఫ్ సూపర్‌వైజర్‌లలో ఖాళీగా ఉన్న స్థానంలో నియమించారు. తర్వాత ఆయన ఎన్నిక కాబడ్డారు.

తదనంతర కాలంలో న్యూసమ్ తానే మేయర్‌గా అయ్యారు, ఒకే లింగం మనుషులు పెళ్ళి చేసుకోవటానికి లైసెన్సులు ఇవ్వాలంటూ మతపెద్దలకు ఆదేశాలివ్వటంద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

56 ఏళ్ళ న్యూసమ్ శాంటా క్లారా యూనివర్సిటీలో మంచి బేస్ బాల్ క్రీడాకారుడిగా రాణించారు. పట్టా తీసుకున్న తర్వాత కొంతకాలం సేల్స్‌లో పని చేశారు. తర్వాత ఒక వైన్ షాపు ప్రారంభించారు, అదే ప్లంప్‌జాక్ గ్రూప్‌గా అభివృద్ధి చెందింది, ఈ గ్రూపులో క్యాలిఫోర్నియాలోని రెస్టారెంట్లు, రిసార్టులు, వైన్ క్షేత్రాలు ఉన్నాయి.

న్యూసమ్ భార్య పేరు జెన్నిఫర్ సీబెల్ న్యూసమ్, వారికి నలుగురు పిల్లలు ఉన్నారు.

పెన్సిల్వేనియా గవర్నర్ జోస్ షాపిరో

పెన్సిల్వేనియా గవర్నర్ జోస్ షాపిరోను శరవేగంగా ఎదుగుతున్న రాజకీయ నాయకుడుగా రాజకీయవర్గాలలో చెబుతారు. ప్రస్తుతం ఆయన రెండో విడత గవర్నర్‌గా కొనసాగుతున్నారు. మొదటిసారి ఎన్నికైనపుడు, డొనాల్డ్ ట్రంప్ సమర్థించిన అభ్యర్థిని ఓడించి గెలిచారు. ఈయనకు డెమోక్రటిక్ పార్టీ టికెట్ లభిస్తే, అధ్యక్ష పదవికి పోటీపడిన మొదటి యూదుడుగా, రెండోసారి ఉపాధ్యక్ష పదవికి పోటీపడిన యూదుడిగా రికార్డ్ సృష్టిస్తారు.

ఉత్తర కరోలినా గవర్నర్ రాయ్ కూపర్

ఉత్తర కరోలినా గవర్నర్ రాయ్ కూపర్ ఆ రాష్ట్రంలో రెండు దశాబ్దాల కాలంలో ఆరు రాష్ట్రవ్యాప్త సాధారణ ఎన్నికల్లో గెలిచి ఉన్నారు. 67 ఏళ్ళ కూపర్ గవర్నర్‌గా బలమైన అప్రూవల్ రేటింగులు సాధించారు. గర్భస్రావ హక్కులు, అందరికీ విద్య వంటి అంశాలపై పోరాడతానని తనను గురించి తాను చెప్పుకుంటారు. 2000 సంవత్సరంలో అటార్నీ జనరల్‌గా ఎన్నికైన కూపర్, 16 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ కోర్సులు చేశారు. ఆయనకు, ఆయన భార్య క్రిస్టిన్‌కు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.

కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్

వృత్తిరీత్యా న్యాయవాది అయిన కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ 2015లో రాష్ట్ర అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు. 2019లో రిపబ్లికన్ గవర్నర్ మ్యాట్ బెవిన్‌ను ఓడించి ఆ పదవిని అధిరోహించారు. ఆయన తండ్రి స్టీవ్ బెషియర్ కూడా రెండు పర్యాయాలు గవర్నర్‌గా పనిచేసిఉన్నారు.

సెనేటర్ మార్క్ కెల్లీ

ఆరిజోనాకు చెందిన సెనేటర్ మార్క్ కెల్లీ వృత్తిరీత్యా ఆస్ట్రోనాట్. అసలు న్యూజెర్సీకి చెందినవాడు అయినప్పటికీ నాసా నుంచి, నేవీనుంచి రిటైర్ అయ్యాక భార్య గ్యాబ్రియెల్ గిఫార్డ్స్‌తో కలిసి టుస్కాన్‌లో స్థిరపడ్డారు. సెనేట్‌లో ప్రధానంగా జాతీయ భద్రత, సైన్యం, పశ్చిమ అమెరికాలో బాధిస్తున్న కరవు సమస్య వంటి అంశాలపై పని చేశారు. నాసాలో చేరకముందు గల్ఫ్ యుద్ధం సందర్భంగా 39 సార్లు యుద్ధ విమానాలను నడిపారు. నాసాలో స్పేస్ షటిల్‌లో మూడుసార్లు అంతరిక్షంలోకి వెళ్ళివచ్చారు.

Read More
Next Story