రేవంత్ తెస్తున్నది పెట్టబడుల మూటా, బోగస్ ఒప్పందాలా?
x

రేవంత్ తెస్తున్నది పెట్టబడుల మూటా, బోగస్ ఒప్పందాలా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నాయంటున్న 31 వేల కోట్ల పెట్టుబడులు కాంగ్రెస్ పార్లీ పొలిటిక్ ఇమెజ్ పెంచుతాయా?


ముఖ్యమంత్రులు ఈ మధ్య పెట్టుబడుల పండగలను చూపించి తమ ప్రభుత్వాలు విజయవంతమయ్యాయని, తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అందంగా తయారయిందని, అందుకే పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయని చెప్పడం పరిపాటి అయింది. దీనికోసం రెండు మార్గాలను ఎంచుకున్నారు. ఇందులో ఇన్వెస్టర్స్ కాంక్లేవ్ ని పెట్టి అక్కడ ఇన్వెస్టర్ల లక్షల కోట్ల పెట్టబడులకు ఒప్పందాలు కుదుర్చుకుని సక్సెస్ అని ప్రచారం చేసుకోవడం ఒక పద్ధతి. రెండోది, ఏకంగా విదేశాలకు వెళ్లి అక్కడ విదేశీపెట్టుబడిదారులను కలసి ఒప్పందాలు కుదుర్చుకోవడం. ఈ పద్ధతిని తెలుగు రాష్ట్రాలలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఒకనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అది బాటలోనే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులంతా పయనిస్తున్నారు. తెలంగాణ వచ్చాక విదేశీ ఇన్వెస్టర్లో కుదుర్చుకునే దానికి భారత రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్ ) ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. అప్పటి పరిశ్రమల మంత్రి కెటి రామారావు విదేశీ పర్యటలన్నీ పండగల ముగిశాయి. హైదరాబాద్ విదేశీపెట్టుబడుల అంతర్జాతీయ రాజధాని అనే ఇమేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇపుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విదేశీ పెట్టుబడులను తీసుకురావడంలో తన చాతుర్యం చూపించే పనిలో ఉన్నారు. ఇలా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం సూపర్ హిట్ అని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. వారం రోజులు సాగుతున్న పెట్టుబడుల వెల్లువ ప్రచారం వల్ల కాంగ్రెస్ రాజకీయంగా బాగా లబ్ది పొందుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ పెట్టబడులన్నీ హైదరాబాద్ కే వస్తున్నాయని కాబట్టి వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. ఇది నిజంగా జరగుతుందా?

గత వారమంతా అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం 50 వ్యాపార సమావేశాలు, మూడు రౌండ్‌టేబుల్ సమావేశాలు, క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంది. సీఎం 19 ఒప్పందాలను కుదుర్చుకున్నారు. మొత్తం రూ.31,500 కోట్ల పెట్టుబడులతో 30,750 కొత్త ఉద్యోగాలను సృష్టించారు.తర్వాత దక్షిణ కొరియా సియోల్‌లో రెండు రోజులు పర్యటించిన సీఎం ప్రతినిధి బృందం హ్యుందాయ్ మోటార్ కంపెనీ, 25 ఇతర టెక్స్‌టైల్ కంపెనీల ఉన్నతాధికారులతో సమావేశమైంది.

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా,దక్షిణ కొరియా దేశాల పర్యటన జరిగింది. ఆగస్టు 14వతేదీ వరకు సాగిన ఈ పర్యటనలో సీఎం వెంట సీఎస్‌ శాంతికుమారి,ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు వెళ్లనున్నారు.ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.న్యూయార్క్,వాషింగ్టన్, డల్లాస్,శాన్‌ ఫ్రాన్సిస్కో,దక్షిణ కొరియా సీయోల్ నగరాల్లో పర్యటించారు.
నా పర్యటన విజయవంతం : సీఎం రేవంత్ రెడ్డిఅన
అనుకున్నట్లే తెలంగాణలో పెట్టుబడుల కోసం తాను చేసిన అమెరికా పర్యటన విజయవంతమైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న నదులు, ప్రకృతి సిద్ధంగా ఉన్న వనరులు, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ స్థాయి పారిశ్రామిక వేత్తలకు చెప్పారు.సీఎం తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా పేర్కొంటూ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన జరిపారు. రెండోసారి అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ లీడర్స్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల వద్ద పెట్టుబడుల కోసం కలిసి మాట్లాడారు. సూటు, బూటు లేకున్నా సింపుల్ గా ఉన్న సీఎం పెట్టుబడులతో వస్తే తాము ప్రభుత్వ పరంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

అవన్నీ బోగస్ ఒప్పందాలా?

అమెరికా దేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలన్నీ బోగస్ అని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సీఎం షెల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. దీనితో ఆయన కాంగ్రెస్ పార్టీ పేరును కూడా మార్చేసి స్కాంగ్రెస్ అనడం మొదలుపెట్టారు. పెట్టుబడుల పేరిట షెల్‌ కంపెనీలతో బాతాఖానీ కొట్టి స్కాంగ్రెస్‌ ప్రజలను మోసగిస్తున్నదని. రేవంత్‌ రెడ్డి సోదరుడు నెల రోజుల్లో పెట్టిన స్వచ్ఛ్‌ బయో కంపెనీ ఇదే కోవలోనిదే ఆయన అన్నారు. "ఇది ఆరంభం మాత్రమే! ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి. కాంగ్రెస్ స్కాంగ్రెస్ గా బట్టబయలు అవుతుంది ' అని కెటిఆర్ పేర్కొన్నారు.రేవంత్‌ చేసుకునే ఒప్పందాల కంపెనీలన్నీ బోగస్ అని.. ఆ ఒప్పందాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ప్రకటించారు. .అయితే తాజాగా సీఎం రేవంత్ చేపట్టిన అభివృద్ధి పనులతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించేందుకు వీలుగా హైదరాబాద్ అభివృద్ధి ఉపయోగపడే అవకాశముందని హైదరాబాద్ నగరానికి చెందిన సోషల్ యాక్టివిస్టు, కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ లూబ్నా సర్వత్ చెప్పారు.

రేవంత్ ఒప్పందాలు అమలైతే ప్రజలు అభినందిస్తారు...

విదేశీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలు అమలు అయితే ప్రజలు అభినందిస్తారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గతంలో కేటీఆర్ పెట్టుబడుల పేరిట విదేశీ పర్యటనల కోసం రూ.40 కోట్లు ఖర్చు చేశారని, కానీ వచ్చిన పెట్టుబడులు మాత్రం అంతంత మాత్రమేనన్నారు. హైదరాబాద్ నగరం శాంతియుతంగా, వాతావరణం అనుకూలంగా ఉండటంతోపాటు వనరులున్నందు వల్ల విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పద్మనాభరెడ్డి చెప్పారు.

ప్రపంచ బ్యాంకుతో రేవంత్ భేటీపై విమర్శలు

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలవడంపై తెలంగాణకు చెందిన ఆర్థిక నిపుణులు పాపారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడని, ఆయన బాటలో రేవంత్ పయనించడంపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని పాపారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్రపంచ బ్యాంకు విధించే షరతులను అంగీకరిస్తే ప్రజలపై పన్నుల రూపంలో భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో క్వాలిటేటివ్ గా పరిపాలనలతో మార్పేులేదు. నిజానికి వ్యతిరేక పెరిగినట్లు కనిపిస్తుంది.గతంలో హైదరాబాద్ లో కరెంటు పోయిన సందర్భాలు బాగా తక్కువ ఇపుడు కరెంటు పోనీ రోజంటూ ఉందా. దీనికి కారణం ప్రజలకు అవసరం లేదు. కరెంటు పోెతున్నదని ప్రజలు ఫీలవుతున్నారు. ఇలా అనేక రంగాలలో ప్రజలు సంతృప్తిగా లేరు. ఈ వ్యతిరేకతని ఇన్వెస్ట్ మెంట్ ప్రచారం పోగొట్టడం క ష్టం," అని పాపారావు అన్నారు.

గతంలో కంటే హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరిగిందని చెప్పారు. రేవంత్ ఇమేజ్ విదేశీ పర్యటన వల్ల పెరగలేదని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మీద వ్యతిరేక పెరుగుతున్నందున రేవంత్ విదేశీపెట్టుబడుల వేటకు బయలుదేరారని, ఇంకొన్ని ఈ పెట్టుబడుల వెల్లువ, శంకుస్థాపనల పండగలు చేసుకుంటారని, ప్రజల సమస్యలు రోడ్లు, కరెంటు, ప్రైవేటు పాఠశాలల ఫీజులు, ఆసుప్రతులు సమస్యలు, హాస్టళ్ల సమస్యలు అట్లే ఉంటాయనే వాళ్లు కూడా ఉన్నారు. పెట్టబడుల సదస్సులూ, టూర్లు ఎవరుచేసిన ప్రజల దృష్టి మళ్లించేందుకే నని సీనియర్ జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు.


మాస్ ఇమేజ్ నుంచి క్లాస్ ఇమేజ్...రేవంత్ సొంతం
అయితే, మాస్ ఇమేజ్ ఉన్న రేవంత్ విదేశీ పెట్టుబడులను సాధించి కేటీఆర్ ను తలదన్నేలా క్లాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారని విదేశీ పర్యటనల ద్వారా సీఎం రేవంత్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జరిపిన విదేశీ పర్యటనతో తెలంగాణకు గ్రోత్ కారిడార్ అయిన హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వరదలా వచ్చాయి. ప్రపంచ స్థాయి పేరొందిన సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూకట్టాయి. సీఎం రేవంత్ తీసుకున్న చొరవతో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

హైదరాబాద్ అభివృద్ధికి సీఎం ప్రాధాన్యం
ఇప్పటికే హైదరాబాద్ నగరాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. స్కిల్ యూనివర్శిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు దీని బాధ్యతలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు సీఎం అప్పగించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధికి సీఎం శ్రీకారం చుట్టారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి భూసేకరణ ప్రారంభించారు. ఏఐ సిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి
దక్షిణ కొరియా దేశం సీయోల్ నగరంలోని చియోంగ్జీ చెయోన్ నది తీరాన్ని ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ వేగా అభివృద్ధి చేశారు. సుందరమైన వాటర్ ఫ్రంట్ ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి అదే తరహాలో మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పెట్టుబడులు తీసుకురావడం అభినందించదగ్గ విషయమని ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి తిరుపతిరావు వ్యాఖ్యానించారు.



సీఎం పర్యటన విజయవంతం : విప్ ఆది శ్రీనివాస్
తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి జరిపిన విదేశీ పర్యటన విజయవంతం అయిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. సీఎం అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశారని ఆయన పేర్కొన్నారు. ఏ కంపెనీకి కూడా అంగుళం భూమి కేటాయించక ముందే మనీలాండరింగ్ జరిగిందని కేటీఆర్ వ్యాఖ్యానించడం హ్యాస్యాస్పదమన్నారు.

కేటీఆర్ జల్సాలు చేశారు...
గతంలో సీఎంగా పనిచేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు రాలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ చెప్పారు. కేటీఆర్ లాగా జల్సాలు చేసేందుకు సీఎం విదేశాలకు వెళ్లలేదని ఆయన ఆరోపించారు. కేటీఆర్ గతంలో చైనా, సింగపూర్ దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి అతని కుటుంబ సభ్యుల కోసం పని చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఎంపీ మల్లు రవి కొట్టిపారేశారు.

సీఎం పర్యటనపై రాజుకున్న రాజకీయ రచ్చ
పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి జరిపిన విదేశీ పర్యటన రాష్ట్రంలో రాజకీయ రచ్చను రాజేసింది. సీఎం జరిపిన పర్యటన విజయవంతం అయిందని కాంగ్రెస్ నేతలు ప్రకటించగా, విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సీఎం పర్యటన వల్ల కుదరిన ఒప్పందాలు బోగస్ వని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.





సీఎం పర్యటనలో కుదిరిన అవగాహన ఒప్పందాలు
- కాగ్నిజెంట్: అమెరికా వెలుపల హైదరాబాద్‌లో అతిపెద్ద సామర్థ్యం ఉన్న కార్యాలయం ఏర్పాటు, ​​15,000 ఉద్యోగాలను సృష్టి.
-వాల్ష్ కర్రా హోల్డింగ్స్: వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి వీ-హబ్‌లో 5 మిలియన్ డాలర్లు, స్టార్ట్-అప్‌లలో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు.
-6ఆర్సీసియం: యూఎస్ వెలుపల హైదరాబాద్‌లో మొదటి శాఖ ఏర్పాటు, 500 హై-ఎండ్ టెక్ ఉద్యోగాల సృష్టి.
- స్వచ్ఛ బయో: 500 ఉద్యోగాలకు రూ.1,000 కోట్ల పెట్టుబడి.
- ట్రిజిన్ టెక్నాలజీస్: హైదరాబాద్‌లో ఏఐ ఇన్నోవేషన్, డెలివరీ సెంటర్, 1000 ఉద్యోగాల సృష్టి.
- హెచ్ సీఏ హెల్త్‌కేర్: 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ విస్తరణ.
- కార్నింగ్: 2025లో ఉత్పత్తిని ప్రారంభించడానికి గాజు గొట్టాల సౌకర్యం.
- ప్రపంచ బ్యాంక్: ప్రధాన కార్యక్రమాలపై సహకారం.
- వివింట్ ఫార్మా: 1,000 ఉద్యోగాలకు రూ.400 కోట్ల పెట్టుబడి.
- చార్లెస్ స్క్వాబ్: భారతదేశంలో మొదటి సాంకేతిక అభివృద్ధి కేంద్రం హైదరాబాద్‌లో ఉంది. డేటా సెంటర్ కార్యకలాపాల విస్తరణ
- హైదరాబాద్‌లో సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జోయిటిస్ ఇంక్.
- హ్యుందాయ్ మోటార్ కంపెనీ మెగా టెస్టింగ్ సెంటర్‌ ఏర్పాటు
- దక్షిణ కొరియాలోని 25 ప్రధాన టెక్స్‌టైల్ కంపెనీలు తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

Read More
Next Story