జర్నలిస్టుగా 42 సంవత్సరాల అనుభవం. 21 ఏళ్లు ఆంధ్రప్రభ, ఒక సంవత్సరం ఎన్టీవీ, 20 సంవత్సరాలుగా వార్త దినపత్రిక. ప్రస్తుతం అసోసియేట్ ఎడిటర్. రాసిన వ్యాసాలు 6,500 పైనే. అచ్చేసిన పుస్తకాలు – 4 అవి బల్గేరియా కవిత ( అనువాదం), అరాజకీయం ( కవితా సంకలనం), శ్రీ రాఘవేంద్ర శతకం ( కవిత్వం), మూడోకన్ను (వ్యాస సంపుటి). నన్నయ విశ్వవిద్యాలయం కోసం ‘తెలుగు పత్రికలు-భాషా పరిణామం’ మీద ఒక పుస్తకం రాస్తున్నారు.