రేవంత్ వైపే ఢిల్లీ మొగ్గు, నేడో రేపో ఖర్గే ప్రకటన
x
రేవంత్ పేరు ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే స్వయంగా ప్రకటించే అవకాశం

రేవంత్ వైపే ఢిల్లీ మొగ్గు, నేడో రేపో ఖర్గే ప్రకటన

అందరినీ బుజ్జగించాకే ముఖ్యమంత్రి అభ్యర్థిక ప్రకటన, కొంత డ్రామా అనంతరం ప్రకటన


తెలంగాణ ముఖ్యమంత్రి గా అభ్యర్థిగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నే నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీనేత రేవంత్ నియమించే అధికారాన్ని అధిష్టానానికి అప్పగిస్తూ నిన్న సిఎల్ పి ఒక తీర్మానాన్ని చేసి ఢిల్లీకి పంపింది. ఇది మొక్కుబడి వ్యవహారమే. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహ తదితరులు తీర్మానాన్ని ప్రతిపాదించారు.

సీఎల్పీ నేత ఎంపిక విషయంలో అధిష్టానం ప్రతినిధులు నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 64 మంది కాంగ్రెస్‌ కొత్త ఎమ్మెల్యే మెజారిటీ రేవంత్ కే మద్దతు తెలిపినట్లు సమాచారం. సోమవారం గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్‌, మురళీధరన్‌, దీపాదాస్‌ మున్షీ, అజయ్‌కుమార్‌, జార్జ్‌ సమావేశమయి ఈ అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ విషయాన్ని అక్కడే ప్రకటిస్తే అలజడి చెలరేగుతుందని, ప్రకటన వ్యవహారాన్ని ఢిల్లీకి వదిలేస్తే బాగుంటుందని నిర్ణయించి తీర్మానం చేసి పంపారని నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేత ఒకరు ‘ఫెడరల్ తెలంగాణ’ కు తెలిపారు.

కాంగ్రెస్ అధిష్టానం నుంచి ప్రకటన తక్షణం వెలువడకపోవచ్చని కూడా సమాచారం. రేవంత్ పేరు ప్రకటించడదానికి ముందు ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నవారికి, కష్ట కాలంలో పార్టీని వీడకుండా పనిచేసిన నాయకులకు ఎలాంటి గుర్తింపు ఇవ్వాలనేది కూడా తెల్చేసి ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

అంతేకాదు, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా రేవంత్ పేరును ప్రకటించే అవకాశం ఉందని ఈ వర్గాలు తెలిపాయి.

Read More
Next Story