సోలాపూర్ తెలుగు ఎంపి ధర్మన్న సాదుల్ మృతి
x
ధర్మన్న సాదుల్ (Source: Lokmat Times)

సోలాపూర్ తెలుగు ఎంపి ధర్మన్న సాదుల్ మృతి


మహారాష్ట్రలో తెలుగు సంతతికి చెందిన భారత రాష్ట్రసమితి నాయకుడు (బిఆర్ ఎస్) ఎంపీ ధర్మన్న సాదుల్ మృతి చెందారు

ఆయన చాలా కాలం కాంగ్రెస్ విధేయుడు. పూర్తిపేరు ధర్మన్న మొండయ్య సాదుల్ . కొద్దిరోజులుగా ఆయన ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, కోడలు, మనుమలు ఉన్నారు. వృద్ధాప్యంలో ఆరోగ్యం సహకరించకపోయినా ఇటీవల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.

షోలాపూర్ నగరంలోని తూర్పు ప్రాంతంలోని నేత పద్మశాలి సామాజికవర్గం నుంచి వచ్చిన ధర్మన్న సాదుల్ కాంగ్రెస్‌కు నమ్మకమైన నాయకుడు.1989 సాధారణ, 1991 మధ్యంతర లోక్‌సభ ఎన్నికల్లో షోలాపూర్ నియోజకవర్గం నుంచి సాదుల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు.

1989లో షోలాపూర్ మేయర్‌గా ధర్మన్న సదుల్ పనిచేశారు. అదే ఏడాది షోలాపూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఆయనకు అవకాశం ఇచ్చింది. అప్పటి దివంగత ఎడిటర్ రంగన్న వైద్య సవాలును అధిగమించి సాదుల్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1991లో వరుసగా రెండోసారి ఎంపీ అయ్యారు. అయితే 1996లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పట్లో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందనే చర్చ కూడా కేంద్రంలో జరిగింది. అయితే సరైన సమయంలో ఈ అవకాశం చేజారింది.

హరీష్ రావు విచారం

ధర్మన్నసాదుల్ మృతిపట్ల మాజీ మంత్రి, బిఆర్ ఎస్ సీనియర్ నాయకుడు టి హరీష్ రావువిచారం వ్యక్తం చేశారు.బిఆర్ఎస్ నేత, సోలాపూర్ మాజీ మేయర్, రెండు సార్లు ఎంపిగా సేవలు అందించిన ధర్మన్న సాదుల్ గారి మృతి బాధాకరం అని ఆయన ట్వీట్ చేశారు.


Read More
Next Story