
మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని రక్షించుకుందాం
ప్రస్తుత రాజకీయాల్లో కమ్యూనిష్టు పార్టీల నుంచి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. కేరళా, త్రిపుర మినహా ఆ పార్టీలకు మిగితా రాష్ట్రాల్లో పెద్దగా పట్టులేదు. ప్రాంతీయ పార్టీల హవా పెరగడం, వాస్తవ పరిస్థితులను గుర్తించకపోవడం, కాలం చెల్లిన విధానాలను, పిడివాదాన్ని నమ్ముకోవడం, కమ్యూనిస్టులలో చీలిక కారణంగా కమ్యూనిస్టుల బలం తరిగిపోతూ వచ్చింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి.
ఒకప్పుడు దేశంలోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను కమ్యూనిస్టులు రాజకీయంగా కీలక పాత్ర పోషించేవారు. పశ్చిమ బెంగాల్లోఅయితే దశాబ్దాల పాటు అధికార పీఠం వారిదే. కేరళలోనూ వారిదే ప్రాబల్యం. ఏపీలో ప్రత్యేకించి కొన్ని నియోజకవర్గాలు వారికి పెట్టని కోటలా ఉండేవి. కమ్యూనిస్టు పార్టీల నేతలు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలతో కలిసి ఉండేవారు. తమ కంటూ కొంత ఓటు బ్యాంకును స్థిరంగా నిలుపుకోగలిగేవారు. కేవలం వారి పోరాటాల కారణంగానే పలు సమస్యలు వెలుగులోకి వచ్చేవి. చట్ట సభల్లో చర్చకు వచ్చేవి.
ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన వామపక్షాల దుస్థితి చాలా వరకూ స్వయంకృతమేనని చెప్పాలి. ఇప్పుడు ఎందుకు పరిస్థితి మారిపోయిందో 'సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ'తో ఫెడరల్ తెలంగాణా చిట్ చాట్..

