అంబటి, అవంతిలు ఏమైతరో..!
x

అంబటి, అవంతిలు ఏమైతరో..!

వీరు సరదా రాయుళ్లు. ఆంధ్రప్రదేశ్‌లో రాసలీల రాజకీయాలకు వన్నె తెచ్చిన వారు. ఇద్దరూ మంత్రులుగా చేసిన వారు. మహిళలంటే వీరికి మహా గౌరవం.


ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌లు రాసలీలకు పెట్టింది పేరు. వీరు మహిళలతో ఫోన్‌ సంభాషణలు గతంలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రాంబాబు సంబరాల్లో మునిగి తేలడమే కాకుండా ఫోన్‌లలోనూ అమ్మాయిలతో సరదాగా మాట్లాడిటనట్లు ఆడియోలు బయటకు వచ్చాయి. అవంతి శ్రీనివాస్‌ అయితే ఆడియోలో మాట్లాడుతూ ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను. అరగంట వచ్చిపోవచ్చుగా అంటూ మాట్లాడిన మాటలు చాలా కాలం యూటూబ్‌లో హల్‌చల్‌ చేశాయి. ఇవన్నీ ఫేక్‌ వాయిస్‌లంటూ కొట్టిపారేశారు. అంతవరకు బాగానే ఉన్నా వీరి ఆడియోలే ఎందుకు వచ్చాయి. మిగిలిన వారికి ఎందుకు రాలేదనేది కూడా పలు అనుమానాలకు అప్పట్లో దారితీసింది.

ఇంతటి ఘనులైన వీరు 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. ఇద్దరూ మంత్రులుగా చేసిన వారు. అంటే పార్టీలో వీరికి పెద్దపీట వేసినట్లే కదా.. పైగా ఈ ఎన్నికల్లో అంబటి రాంబాబు సోదరుడు మురళికి పొన్నూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా టిక్కెట్‌ ఇచ్చారు జగన్‌మోహన్‌రెడ్డి. పార్టీలో వీరికి అంత ప్రయారిటీ ఉంది. మహిళపట్ల వీరికి ఉన్నది గౌరవం అనాలో సరదాగా గడిపే అలవాటు అనాలో తెలియదు కాని ఈ రాష్ట్రానికి మంత్రులుగా ఏమి చేశారనేది కూడా వీరిపై చర్చ సాగింది. సంబరాల రాంబాబు పరిస్థితి ఏమిటనేది ఒక్కసారి పరిశీలిద్దాం. సత్తెనపల్లి నియోజకవర్గంలో రాంబాబు గత ఎన్నికల్లో 20,874 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. డాక్టర్‌ కోడెల శివప్రసాదరావును ఓడించడంతో ఈయన రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నికలకు ముందు జరిగిన పలు పండుగల్లో లంబాడి మహిళల నృత్యాల్లో పొల్గొని సంచలనం సృష్టించారు. నాకు సరదాగా గడిపే అలవాటు ఉందని, అందుకే డ్యాన్స్‌ వేశానని చెప్పుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కన్నా లక్ష్మినారాయణ పోటీకి దిగారు. కన్నా లక్ష్మినారాయణ సీనియర్‌ రాజకీయ నాయకుడు. సరదాగా గడిపే విషయంలో కన్నాకు, అంబటికి చాలా తేడాలు ఉన్నాయి. ఎన్‌డిఏ కూటమి నుంచి పోటీకి దిగిన కన్నా ఈ సారి గెలుపే లక్ష్యంగా పనిచేశారని స్థానికులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో జగన్‌ ప్రభంజనం కొనసాగిందని, అందువల్ల అంబటి గెలిచారని స్థానికులు చెప్పటం వివేషం. ప్రెస్‌తో మాట్లాడటంలో అంబటి దిట్ట. రీపోలింగ్‌కు డిమాండ్‌ చేశారు. ఆయన డిమాండ్‌ను ఎన్నికల కమిషన్‌ పట్టించుకోలేదు.
విశాఖ జిల్లాలోని భీమిలి నియోజక వర్గం నుంచి అవంతి శ్రీనివాస్‌ (ముత్తంశెట్టి శ్రీనివాస్‌) వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీకి దిగగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఇరువురూ మంచి స్నేహితులు. అయితే రాజకీయంగా విరోదులు కావాల్సి వచ్చింది. ఎవరికి వారు గెలుపుకోసం గట్టిగా పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్‌కు రాసలీలల మీద కాస్త ఎక్కువ దృష్టి ఉంటుందని ఎన్నికలకు ముందు ఆడియో టేపులు బయటకు వచ్చాయి. వీటిని ఓటర్లు పరిగణలోకి తీసుకున్నారా లేదా అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. వీరిద్దరికీ ఇప్పటి వరకు ఓటమి లేదు. అయతే ఈ ఎన్నికల్లో ఎవరో ఒకరు ఓడిపోవాల్సిందే.
Read More
Next Story