తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్ గా..
x
శాసన సభ నూతన స్పీకర్

తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్ గా..

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిభా భారతి తొలి దళిత స్పీకర్.


తెలంగాణ లో కొలువుదీరనున్న నూతన శాసనసభ కు స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. మంత్రుల జాబితా విడుదల చేసిన లిస్ట్ లో ఆయన పేరు స్పీకర్ గా ఉంది. గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ ఎమ్మెల్యే గా గెలిచారు. ఇంతకుముందు 2008లో వికారాబాద్ కు జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి కిరణ్ కుమార్ మంత్రి వర్గంలో పని చేశారు. తరువాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2023 లో జరిగిన ఎన్నికల్లో తిరిగి వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణకు ఆయన తొలిదళిత స్పీకర్ అవుతున్నారు. గడ్డం ప్రసాద్ , ఒక నాటి కాంగ్రెస్ నేత జి .వెంకటస్వామి, ఇపుడు పెద్ద పల్లి ఎమ్మెల్యే జి వెంకటస్వామికి దగ్గరి బంధువు.

ముఖ్యమంత్రిగా అనుమలు రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన తరువాత మంత్రివర్గ కూర్పుపై సైతం చర్చలు జరిగాయి. మంత్రుల జాబితా ఉదయం బయటకు వచ్చినా... స్పీకర్ ఎవరన్నాదానిపై సందిగ్ధత తొలిగిపోలేదు. అయితే తాజాగా మంత్రివర్గం ఎవరు అనే దానిపై కేసీ వేణుగోపాల్ సంతకంతో కూడిన లెటర్ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినట్లు అయింది.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి దళిత స్పీకర్ ప్రతిభా భారతి. ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు స్పీకర్ గా ఉన్నారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నపుడు భట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు.

Read More
Next Story