ఇతర ప్రాంతాల్లో ఓటేసిన అసదుద్దీన్, మాధవీలత
హైదరాబాద్ పార్లమెంటు బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు అసదుద్దీన్ ఒవైసీ, కొంపెల్లి మాధవీలత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మజ్లిస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలతలు వారి ఓటు వారు వేసుకోలేక పోయారు. ఎందుకంటే వారు హైదరాబాద్ నియోజకవర్గం బయట నివాసం ఉంటుండటంతో వారు ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఓటేశారు.
- సోమవారం ఉదయం అసదుద్దీన్ ఒవైసీ పాతబస్తీ చాంద్రాయణ గుట్ట సమీపంలోని శాస్త్రిపురం పోలింగ్ కేంద్రానికి కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు. చేవేళ్ల పార్లమెంట్ పరిధి కిందకు అసద్ నివాస ప్రాంతం వస్తుంది.
- ఓటేసి బయటకు వచ్చిన అసదుద్దీన్ తన కుటుంబసభ్యులతో కలిసి వేలి సిరా గుర్తును చూపిస్తూ ఫొటోకు ఫోజిచ్చారు.
- మరో వైపు సికింద్రాబాద్ లో నివాసముంటున్న హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- మాధవీలత హైదరాబాద్‌లోని అమృత విద్యాలయం పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ‘‘సబ్కా సాథ్ మై హై, సబ్కా వికాస్ హై’’ అని మాధవీలత చెప్పారు.
- ‘‘ఓటు మార్పును తీసుకువస్తుందని,అభివృద్ధి వైపు పయనిస్తుంది కాబట్టి ఓటు వేయడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు బయలు దేరాలని లత కోరారు.
Next Story