కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌కు వ్యోమగామి సునీతా విలియమ్స్..
x

కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌కు వ్యోమగామి సునీతా విలియమ్స్..

KLFకు అతిథ్యం ఇవ్వనున్న జర్మనీ..హాజరుకానున్న 500 మంది వక్తలు..


Click the Play button to hear this message in audio format

కేరళ లిటరేచర్ ఫెస్టివల్ (KLF)కు వ్యోమగామి(Astronaut) సునీతా విలియమ్స్ (Sunita Williams) విచ్చేస్తు్న్నట్లు నిర్వాహకులు మంగళవారం (డిసెంబర్ 30) తెలిపారు. జనవరి 22న ప్రారంభం కానున్న KLF 2026కి జర్మనీ అతిథ్యం ఇవ్వనుంది. ఈ పెస్టివల్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 మంది వక్తలు రానున్నారు. నోబెల్ గ్రహీతలు అబ్దుల్ రజాక్ గుర్నా, ఓల్గా టోకార్జుక్, అభిజిత్ బెనర్జీ, బుకర్ బహుమతి గ్రహీత రచయిత-కార్యకర్త బాను ముష్తాక్, ఒలింపియన్ బెన్ జాన్సన్, పెప్సికో మాజీ CEO ఇంద్రా నూయి, కళాకారిణి చెయెన్నే ఆలివర్, ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ అలాగే ప్రముఖ రచయితలు గాబ్రియేలా యబారా, పెగ్గీ మోహన్, శోభా డే మరియు అమిష్ త్రిపాఠి హాజరుకానున్నారు.

"సునీతా విలియమ్స్ DC బుక్స్, KLF శ్రేయోభిలాషి కూడా. కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆమె ఉనికి ప్రత్యేకం. సునీతా భాగస్వామ్యం తరతరాలుగా స్ఫూర్తినిస్తుంది" అని DC బుక్స్ మేనేజింగ్ డైరెక్టర్, KLF చీఫ్ ఫెసిలిటేటర్ రవి డీసీ అన్నారు.

గత ఏడాది జూన్‌లో వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో కలిసి సునీతా విలియమ్స్ అంతరిక్ష యానం చేశారు. అంతరిక్షంలో అత్యధిక సమయం ( 286 రోజులు) గడిపిన వ్యోమగామిగా భారతి సంతతికి చెందిన సునీతా విలియమ్స్ రికార్డు సృష్టించారు. మెహ్సానా జిల్లాలోని ఝులసన్‌కు చెందిన గుజరాతీ తండ్రి దీపక్ పాండ్యా, స్లోవేనియన్ తల్లి ఉర్సులిన్ బోనీ దంపతులకు సెప్టెంబర్ 19, 1965న ఒహియోలోని యూక్లిడ్‌లో సునీతా జన్మించారు. జాన్సన్ స్పేస్ సెంటర్‌లో శిక్షణ పొందిన సునీత 1998లో నాసా వ్యోమగామిగా ఎంపిక చేసింది.

Read More
Next Story