RajBhavan AT HOME | రాజ్‌భవన్‌లో ఎట్ హోం  సందడి
x

RajBhavan AT HOME | రాజ్‌భవన్‌లో ఎట్ హోం సందడి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. సీఎం డాక్టర్ డి నాగేశ్వరరెడ్డిని సన్మానించారు.


రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఇచ్చిన ‘తేనీటి విందు’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

- ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్, కేంద్ర బొగ్గు, గనుల మంత్రి జి కిషన్ రెడ్డి; కన్హా శాంతివనం వ్యవస్థాపకులు కమలేష్ డి పటేల్,రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, మిలటరీ అధికారులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, పలువురు రాష్ట్ర ప్రముఖులు హాజరయ్యారు.పద్మశ్రీ అవార్డు పొందనున్న మందా కృష్ణా మాదిగ కూడా ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు. మందా కృష్ణాను సీఎం రేవంత్ రెడ్డి గవర్నరుకు పరిచయం చేశారు.



- ఈ కార్యక్రమంలో ‘గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024’ కు ఎంపికైన సభ్యులకు గవర్నరు అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అతిథులను కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఎట్ హోం కార్యక్రమానికి వచ్చిన అతిథులను గవర్నర్ అప్యాయంగా పలకరించారు.













Read More
Next Story