భారత పార్లమెంట్ పై దాడి.. పరుగులు తీసిన ఎంపీలు
x
పార్లమెంట్ పై దాడి జరుగుతున్న దృశ్యం

భారత పార్లమెంట్ పై దాడి.. పరుగులు తీసిన ఎంపీలు

భారత పార్లమెంట్ పై దాడి జరిగింది. ఇద్దరు ఆగంతకులు విజిటర్స్ గ్యాలరీ నుంచి పార్లమెంటు హాల్లోకి దూకారు. తర్వాత ఏమయింది?


ఆగంతకులు లోక్ సభలో పసుపు రంగు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఒక ఆర్గనైజేషన్ కు సంబంధించిన నినాదాలు చేశారు. దాంతో ఎంపీలు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.

సభకు వచ్చిన వారు మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ పేరుపై వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పార్లమెంట్ వెలుపల సైతం మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిణామంతో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. ఆగంతకులు తమ షూ నుంచి ఈ గ్యాస్ బాటిల్లు తీసి స్ప్రే చేసినట్లు తెలుస్తోంది.




ఇది ఇలా ఉంటే పార్లమెంటు బయట నీలమ్ (42), అమోల్ షిండే (27) అనే ఇద్దరు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఇద్దరు వ్యక్తులు పార్లమెంటులో పసుపు పచ్చ పొగ వదులుతున్న డబ్బాలను పార్లమెంటులో విసిరినట్లు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు గౌరవ్ గొగోయ్ ట్వీట్ చేశారు.


22 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు భారత పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. పార్లమెంట్‌ ప్రాంగణంలో జరిగిన ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. వారికి నేడు యావత్ దేశం నివాళులర్పిస్తోంది. పార్లమెంట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్‌, కేంద్రమంత్రులు సహా పత్రిపక్ష నేతలు అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అమరుల కుటుంబాలను ప్రధాని ఓదార్చారు. అటు అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్‌ వేదికగా నివాళులర్పించారు.

22 ఏళ్ల క్రితం డిసెంబరు 13న మన ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. తొమ్మిది మందిని పొట్టనబెట్టుకున్నారు. వారిని ధైర్యంగా ఎదుర్కొన్న భద్రతా బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఘటనలో తమ ప్రాణాలు అర్పించిన వీరులకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. వారి త్యాగాలను వృథా కానివ్వకూడదు. మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందేశమిచ్చారు.

నాడు పార్లమెంట్‌పై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది త్యాగాలు మరువలేనివి. ఈ దేశం వారికి రుణపడి ఉంటుంది. ప్రపంచ శాంతి కోసం ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో అన్ని దేశాలు ఐక్యంగా ఉండడం ఎంతో అవసరం ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ దన్‌ఖడ్‌ అన్నారు.

పార్లమెంట్‌పై దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులు. ఉగ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొని తమ ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలు చిరస్థాయిగా నిలిపోతాయి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.

2001 డిసెంబరు 13న లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్‌ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. వీరిలో ఆరుగురు దిల్లీ పోలీసులు కాగా.. ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముష్కరులను హతమార్చారు.


Read More
Next Story